సిటి, సియాజ్, వెర్నా మరియు వెంటో లకు పోటీగా టయోటా వారి సరికొత్త సెడాన్
టయోటా మోటార్స్ భారత్ మరియు కొన్ని అంతర్జాతీయ మార్కెట్ల కోసం మిడ్ సైజ్ సెడాన్‌ను విడుదల చేయడానికి శ్రీకారం చుడుతోంది. టయోటా తమ ఎటియోస్ మోడల్ ఆధారంతో ఈ సెడాన్‌ను అభివృద్ది చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రభావవంతమైన మారుతి సియాజ్, హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్‌వ్యాగన్ వెంటోలకు పోటీగా ఈ టయటా సరికొత్త ఎటియోస్ ఆధారిత సెడాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

మిడ్ సెడాన్ సెగ్మెంట్లో టయోటాకు చెందిన ఏ విధమైన ఉత్పత్తి తమ లైనప్ లేదు. అయితే సరికొత్త మిడ్ సైజ్ సెడాన్‌ను వచ్చే 2017 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అకాశాలు ఉన్నాయి.

టయోటా దీనిని ముందుగా బ్రెజిల్ మార్కెట్లోకి విడుదల చేసి తరువాత ఇండియన్ మార్కెట్‌కు తీసుకురానుంది.

ఇంతకు మునుపు టయోటా మోటార్స్ వియోస్ సెడాన్‌ను రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ [ఆర్&డి} కోసం దిగుమతి చేసుకుంది. అయితే వియోస్‌ను ఎటియోస్‌తో పోల్చుకుంటే కాస్త ఖరీదుగానే ఉంటుంది.

ఎటియోస్‌ను రూపొందించిన వేదిక మీదనే ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌ను కూడా అభివృద్ది చేసారు. ఈ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే సరికొత్త మిడ్ సైజ్ సెడాన్‌ను అభివృద్ది చేయనున్నారు.

టయోటా తమ మిడ్ సైజ్ సెడాన్‌లో అందివ్వనున్న ఇంజన్‌కు సంభందించిన మరియు ఇతర సాంకేతిక వివరాలను గోప్యంగా ఉంచింది.

అయితే టయోటా సాధ్యమైనంత వరకు ఎటియోస్‌లో ఉన్న పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లను అందించే అవకాశాలు ఉన్నాయి.

ప్రారంభంలో ఈ రెండు ఇంజన్ ఆప్షన్లకు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేసి తరువాత దశలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం దేశీయంగా అభివృద్ది చెందుతున్న వియోస్ సెడాన్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు లేవు. అయితే ఇండియాలో దీనిని తక్కువ ఖర్చుతో పరిశోధన మరియు అభివృద్ది చేయవచ్చు. పూర్తి స్థాయిలో అభివృద్ది చెందిన తరువాత దీనిని ముందుగా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు.

నిరంతరం ఆటోమొబైల్ వార్తలు మరియు సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి. ప్రతి రోజు న్యూస్ లెటర్ ద్వారా సమాచారాన్ని మీ మెయిల్‌లో పొందుటకు కథనం క్రింద భాగంలో మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.

- 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక అనూహ్యంగా ఒడ్డుకు చేరిన వైనం


Click it and Unblock the Notifications