15 రోజుల్లో 16 వేల మంది ఆరా, 5,400 ల బుకింగ్స్: టయోటా ఫార్చ్యూనర్
టయోటా మోటార్స్ విడుదల చేసిన 2016 టయోటా ఫార్చ్యూనర్ విడుదలైన అనతి కాలంలోనే విశేష స్పందనకు గురయ్యింది. కేవలం 15 రోజుల్లో దీని గురించి 16 వేల మంది ఆరాతీయగా 5,400 మంది బుక్ చేసుకున్నారు.
జపాన్‌కు చెందిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ ప్రీమియమ్ ఎస్‌యువి 2016 ఫార్చ్యూనర్‌ని ఈ నెల (నవంబర్ 2016)లో విడుదల చేసింది. అచ్చం టయోటా ఇన్నోవా క్రిస్టా తరహాలో విశేష స్పందన లభించింది. కేవలం విడుదలైన 15 రోజు కాలంలోనే. 16,000 మంది దీని గురించి ఆరా తీయగా దేశవ్యాప్తంగా 5,400 మందికి పైగా బుక్ చేసుకున్నారు కూడా.

ప్రస్తుతం టయోటా మోటార్స్ ఈ 2016 ఫార్చ్యూనర్ మీద రెండు నెలలు ఉన్నట్లు ప్రకటించింది. టయోటా అందుబాటులోకి తీసుకువచ్చి ఈ ప్రీమియమ్ ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభిస్తోంది.

సరికొత్త 2016 ఫార్చ్యూనర్ టిపికల్ ఎస్‌యువి డిజైన్‍కు అద్దం పడుతుంది. ఎక్కువ స్పోర్టివ్‌గా, ప్రీమియమ్ లుక్‌లో పరిచయం అయ్యింది. మరియు మునుపటి ఫార్చ్యూనర్‌తో పోల్చితే ఉత్తమ మార్కెట్ విలువలను కలిగి ఉంది.

సాంకేతికంగా టయోటా 2016 ఫార్చ్యూనర్‌లో 2.7-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది డీజల్ వేరియంట్ ఫార్చ్యూనర్‌నే ఎంచుకున్నారు.

2.7-లీటర్ సామర్థ్యం గలపెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి అదే విధంగా ఇందులోని 2.8-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్ల కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో అందుబాటులో ఉన్నాయి. మరియు డీజల్ వేరియంట్ ఫార్చ్యూనర్ ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

టయోటా ఫార్చ్యూనర్ లోని ప్రారంభ వేరియంట్ ధర రూ. 25.92 లక్షలు మరియు ఫార్చ్యూనర్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 31.12 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

సరికొత్త 2016 టయోటా ఫార్చ్యూనర్ ఫోర్డ్ ఎండీవర్, షెవర్లే ట్రయల్ బ్లేజర్ మరియు హ్యుందాయ్ శాంటా ఫె వంటి ప్రీమియమ్ ఎస్‌యువిలకు గట్టిపోటీగా నిలుస్తోంది.

- ఈ ఏడాదికి చివరి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు: తెలివిగా ఎంచుకోవడానికి సరైన అవకాశం
- సరికొత్త సుజుకి వ్యాగన్ ఆర్ స్టింగ్ రే - ఇండియా విడుదల కోసమా...?


Click it and Unblock the Notifications








