భారీ మార్పులతో విడుదలైన సరికొత్త టయోటా ఫార్చ్యూనర్
టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అధునాతన ఫార్చ్యూనర్ వాహనాన్ని విడుదల చేసింది. నూతన డిజైన్, సరికొత్త ఇంజన్ ఆప్షన్‌లు ఇందులో ప్రత్యేకం.
ఆడి, బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ మరియు వోల్వో వంటి అత్యంత లగ్జరీ ఉత్పత్తులు ఇండియాలో ఉన్నప్పటికి టయోటా ఫార్చ్యూనర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇదంటే అమితమైన ఇష్టం. అమ్మకాల్లో దీనిది ప్రత్యేకమైన శైలి. ధరను లెక్కచేయకుండా భారీగా విక్రయించబడుతోంది ఫార్చ్యూనర్.

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి2017 ఫార్చ్యూనర్ ఎస్‌యువిని విడుదల చేసింది. ఈ నూతన వాహన శ్రేణిలోని ప్రారంభ వేరియంట్ ధర రూ. 25.92 లక్షలు ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టయోటా ఫార్చ్యూనర్ పెట్రోల్ వేరియంట్ ధరలు
- 2-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ధర రూ. 25.92 లక్షలు
- 2-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ ధర రూ. 27.61 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- 2-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ధర రూ. 27.52 లక్షలు
- 2-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ ధర రూ. 29.14 లక్షలు
- 4-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ ధర రూ. 30.05 లక్షలు
- 4-వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ ధర రూ. 31.12 లక్షలు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- వెహికల్ స్టెబిలిటి కంట్రోల్
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
- ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
- బ్రేక్ అసిస్ట్ వంటి ఎన్నో ఫీచర్ల కలవు.
- ఫాంటమ్ బ్రౌన్,
- సూపర్ వైట్,
- ఆటిట్యూడ్ బ్లాక్,
- అవంత్-గార్డ్ బ్రాంజ్,
- గ్రే మెటాలిక్,
- సిల్వర్ మెటాలిక్,
- వైట్ పియర్ల్ క్రిస్టల్ షైన్.

టయోటా ఫార్చ్యూనర్ డీజల్ వేరియంట్ ధరలు

సరికొత్త ఫార్చ్యూనర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం అయ్యింది. అవి, 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 2.8-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్.

2.7-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ సుమారుగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా 2.8-లీటర్ డీజల్ ఇంజన్ సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఫార్చ్యూనర్ ఎస్‌యువి 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ల అనుసంధానంతో ఉన్నాయి. డీజల్ వేరియంట్ ఫార్చ్యూనర్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉన్నాయి.

టయోటా మోటార్స్ డిజైన్ మరియు నిర్మాణాత్మక అంశాలలో అభివృద్ది కొరకు డెవలప్ చేసిన టయోటా న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్ (TNGA) వేదిక ఆధారంగా సరికొత్త 2017 ఫార్చ్యూనర్‌ను రూపొందించారు. మునుపటి టయోటా ఫార్చ్యూనర్‌తో పోల్చుకుంటే ఇది తక్కువ బరువు కలదు.

2017 టయోటా ఫార్చ్యూనర్ కొలతల పరంగా 4,795ఎమ్ఎమ్ పొడవు, 1,855ఎమ్ఎమ్ వెడల్పు మరియు 1,835ఎమ్ఎమ్ ఎత్తు కలదు. వీల్ బేస్ 2,750ఎమ్ఎమ్ పొడవు కలదు.

2017 టయోటా ఫార్చ్యూనర్‌లో స్పష్టంగా గుర్తించదగిన మార్పుల్లో డిజైన్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర ఎస్‌యువిలతో పోల్చితే ఇది యాంగులర్ డిజైన్ భాషలో ఉంది.

ముందు వైపున పగటి పూట వెలిగే లైట్ల ఇముడింపుతో ఉన్న పదునైన, కోణీయంగా ఉన్న సన్నని ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలవు. రెండు స్లాట్లు గల క్రోమ్ గ్రిల్ కలదు. ఫ్రంట్ బంపర్‌లో ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ వాటి చుట్టూ క్రోమ్ సొబగులు మరియు ఫ్రంట్ గ్రిల్‌లో క్రోమ్ పదార్థపు సొబగులు అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

ఫార్చ్యూనర్ వెనుక వైపున క్రోమ్ పట్టీలో ఎల్‌ఇడి లైట్లు సన్నని నీటి దారలా కలిసిపోయాయి. క్రింది వైపున ఉన్న బంపర్‌కు ఇరు వైపులా రెండు ఎర్రటి కళ్లను గమనించవచ్చు.

2017 టయోటా ఫార్చ్యూనర్ లోని భద్రత ఫీచర్లు
యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్
డౌన్ హిల్ అసిస్ట్
హిల్ అసిస్ట్ కంట్రోల్
ఎలక్ట్రానిక్ డ్రైవ్ కంట్రోల్,
7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగులు


2017 టయోటా ఫార్చ్యూనర్ లభించు రంగులు

సరికొత్త ఫార్చ్యూనర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, షెవర్లే ట్రయల్‌బ్లేజర్ మరియు హ్యుందాయ్ శాంటా ఫె వంటి వాహనాలకు గట్టి పోటీగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








