డీలర్ల వద్దకు చేరిన 2016 టయోటా ఫార్చ్యూనర్
టయోటా మోటార్స్ తమ సరికొత్త 2016 ఫార్చ్యూనర్‌ను త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది మరియు టయోటా సరికొత్త ఫార్చ్యూనర్‌కు రహస్యంగా దేశీయ రహదారుల మీద పరీక్షలు నిర్వహిస్తోంది, వంటి అనేక కథనాలను డ్రైవ్‌స్పార్క్ ప్రచురిస్తూ వస్తోంది.

అయితే టయోటా మోటార్స్ తమ సరికొత్త 2016 ఫార్చ్యూనర్ ఎస్‌యువిని నిశ్శబ్ధంగా డీలర్ల చెంతకు చేర్చింది. అహ్మదాబాద్‌లోని టయోటా డీలర్ వద్ద మొదటి ఫార్చ్యూనర్‌ను గుర్తించడం జరిగింది.

టయోటా మోటార్స్ 2016 కు చెందిన ఫార్చ్యూనర్‌ను వివిధ రకాల పరీక్షల కోసం 2015 అక్టోబర్ నుండి దిగుమతి చేసుకోవండ ప్రారంభించింది.

టయోటా మోటార్స్ అతి త్వరలో అమ్మకాలు సిద్దంగా అందుబాటులోకి తీసుకురానున్న 2016 ఫార్చ్యూనర్ ఇప్పటికే ఇండోనేషియా మరియు థాయిలాండ్ అనే దేశాలలో అమ్మకాల్లో ఉంది.

టయోటా మోటార్స్ తమ సరికొత్త టయోటా గ్లోబల్ అర్కిటెక్చర్ (టిఎన్‌జిఎ) ఆధారంతో డిజైన్ చేయబడింది.

బాహ్య డిజైన్‌లో సరికొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్ల సమ్మళనంతో డిజైన్ చేయబడిన హెడ్‌లైట్, తిరిగి డిజైన్ చేయబడిన టెయిల్ లైట్లు మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రత్యేకంగా నిలిచాయి.

అంతర్జాతీయంగా టయోటా మోటార్స్ ఈ సరికొత్త ఫార్చ్యూనర్‌ను రెండు డీజల్ మరియు ఒక పెట్రోల్ వేరియంట్లో అందుబాటులో ఉంచింది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అమ్ముడుపోతున్న వేరియంట్లలో డీజల్ వేరియంట్లు ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టా తరహాలోనే ఉన్నాయి.

టయోటా మోటార్స్ ప్రస్తుతం ఫార్చ్యూనర్‌లో ఉన్న 2.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను ఇన్నోవా క్రిస్టాలో అందించార. ఇది సుమారుగా 148హబిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

అదే విధంగా 2016 టయోటా ఫార్చ్యూనర్‌లోని 2.8-లీటర్ డీజల్ ఇంజన్ సుమారుగా 175బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ పరంగా టయోటా ఈ 2016 ఫార్చ్యూనర్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- సముద్రాలపై వీటి వేగానికి అవధులే లేవు...!!
- షెవర్లే వారి ఆఫర్లు: ప్రతి కొనుగోలు మీద ఖచ్చితమైన బంగారు మరియు క్యాష్ బ్యాక్
- ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకుతో దూసుకొస్తున్న బిఎమ్‌డబ్ల్యూ
- అద్భుతమైన ధరతో విడుదలైన భారత దేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్
- వోక్స్‌వ్యాగన్ డీజల్ అమియో విడుదల: ధర మరియు ఇతర వివరాలు
- 2016 ప్యారిస్ మోటార్ షో లో సుజుకి ఇగ్నిస్ కాంపాక్ట్ క్రాసోవర్ ప్రదర్శన



Click it and Unblock the Notifications








