ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షలు వరకు అమ్ముడుపోయిన టయోటా ప్రియస్
టయోటా మోటార్స్ 1997 ఆగష్టులో కోస్టర్ హైబ్రిడ్ ఇవి పేరుతో హైబ్రిడ్ కారును విడుదల చేసింది. విడుదల చేసిన నాలుగు నెలల కాలానికే ప్రియస్ హైబ్రిడ్ పేరుతో స్టిరపడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 90 లక్షల ప్రియస్ కార్లను అమ్మేసింది జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ.

విడుదల సమయం నుండి ఏప్రిల్ 30, 2016 నాటికి సరిగ్గా 90 లక్షల ప్రియస్ కార్ల అమ్మకాలు జరిపారు. అందులో కూడా చివరి 80 నుండి 90 లక్షల మధ్య ఉన్న అమ్మకాలు కేవలం తొమ్మిదినెలల కాలంలోనే జరిగాయని టయోటా మోటార్స్ తెలిపింది.
Also Read: క్విడ్ విషయంలో ఇండియాను నిర్లక్ష్యం చేసి బ్రెజిల్‌కు మొగ్గు చూపిన రెనో
కొత్త మైళు రాయిని దాటిన సందర్భంగా టయోటా మాట్లాడుతూ ఈ టయోటా హైబ్రిడ్ కార్లు కార్బన్ డై ఆక్సైడ్ (CO2) వాయువును చాలా వరకు తక్కువగా విడుదల చేస్తాయని తెలిపింది.
Also Read: బ్రిటీష్ దెబ్బకు నేల చూపులకే పరిమితం అయిన వ్లాదిమిర్ పుతిన్
గ్యాసోలీన్‌ను ఇంధనంగా వినియోగించుకునే గ్యాసోలీన్ వాహనాలతో పోల్చితే ఈ హైబ్రిడ్ వాహనాలు సుమారుగా 250 లక్షల కిలోలీటర్ల గ్యాసోలీన్ ఇంధనాన్ని తక్కువగా వినియోగించుకుంటాయని టయోటా మోటార్స్ తెలిపింది.
Also Read: భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్, నెలకు 2 లక్షల అమ్మకాలు
టయోటా మోటార్స్ మొత్తంగా అమ్మిన 90 లక్షల హైబ్రిడ్ వాహనాలలో సుమారుగా 40 లక్షల వరకు ప్రియస్ హైబ్రిడ్ విభాగం నుండి అమ్ముడుపోయినట్లు తెపింది.


Click it and Unblock the Notifications




























