లగ్జరీ ఎమ్‌పివిని విడుదల చేయనున్న టయోటా ఇండియా
లగ్జరీ ఎమ్‌పివిలో తామే అగ్రగామిగా ఉండాలనే నెపంతో టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ లగ్జరీ ఎమ్‌పివిని విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివితో తిరుగులేని విజయం అందుకున్న టయోటా ఇప్పుడు సౌకర్యవంతమైన ఎమ్‌పివిల మీద దృష్టి సారించింది. అందుకోసం దేశీయ ఎమ్‌పివి మార్కెట్లోకి అత్యంత విలాసవంతమైన అల్పార్డ్ ఎమ్‌పివిని తీసుకురానుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎమ్‌పివి సెగ్మెంట్లో టయోటా ఇండియా అగ్రస్థానంలో ఉంది. అయితే అతి పెద్ద, విశాలమైన మరియు సౌకర్యవంతమైన భారీ సైజులో ఉన్న ఎమ్‌పివిని దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది.

అల్పార్డ్ అనే ఈ అతి పెద్ద లగ్జరీ ఎమ్‌పివిలో సుమారుగా ఎనిమిది అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు ఉండేటట్లు డిజైన్ చేశారు. ఇది జపాన్‌కు చెందిన టయోటా వారికి గుండెలాంటి ఉత్పత్తి.

టయోటా అంతర్జాతీయ పర్యావరణ హితమైన ఉత్పత్తులను రూపొందించడాన్ని సమర్థించేందుకు ఈ అల్పార్డ్ ఎమ్‌పివిని హైబ్రిడ్ సాంకేతికతతో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇండియాలో ఇప్పటికే అక్కడక్కడ డీజల్ వాహనాల మీద నిషేధాన్ని విధింస్తున్నందున దీనిని అన్ని ఉద్గార నియమాలకు అనుగుణంగా అన్ని ప్రదేశాలలో కూడా ఏ విధమైన నిషేధానికి గురవుకుండా విడుదల చేయడానికి రూపొందించారు.

టయోటా మోటార్స్ ఈ అల్పార్డ్ ఎమ్‌పివిలో 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను అందిస్తున్నారు, అయితే ఈ ఇంజన్‌ను టయోటా వారు తమ క్యామ్రీ హైబిడ్‌లో ఇది వరకే వినియోగించారు. ప్రస్తుతం ఈ క్యామ్రీ ఇండియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉంది.

టయోటా ఈ అల్పార్డ్ లగ్జరీ ఎమ్‌పివిని సుమారుగా 50 లక్షల రుపాయల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఇండియన్ వినియోగదారులకు కాస్త పెద్ద మొత్తంగానే అనిపించవచ్చు. కాకపోతే ధరకు తగ్గట్లు భార స్థాయిలో ఫీచర్లను అందివ్వనున్నారు.

ముందు వైపున ఉన్న ఎమ్‌పివి డిజైన్ అందరినీ బాగానే ఆకట్టుకుంటుంది. గది ఆకారంలో ఉన్న అతి పెద్ద క్యాబిన్ మరియు ఇంటీరియర్ స్పేస్ ఎంతగానో మిమ్మల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.

ఈ అల్పార్డ్ ఎమ్పివిలో ప్రక్క వైపున మరియు వెనుక వైపున డోర్లు చూడటానికి పార్శిల్ వ్యాన్ వలె ఉంటాయి. అయినప్పటికీ ఈ డోర్లు అన్నీ కూడా ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి. తాకే తెర మీద టచ్ చేయడం ద్వారా డోర్లు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా తెరుచుకుంటాయి.

ఇంటీరియర్‌లో చిన్న సైజు బార్ కూడా కలదు. హెడ్ మరియు లెగ్ రూమ్ ఎంతో విశాలంగా ఉంది. మూడవ వరుస సీటింగ్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. లేగేజ్ కోసం బూట్ స్పేస్ కూడా అధికంగా కల్పించారు.

టయోటా మోటార్స్ ఈ అల్పార్డ్ ఎమ్‌పివిలో అందించిన 2.5-లీటర్ 2ఎఆర్-ఎఫ్ఎక్స్ఇ హైబ్రిడ్ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

అల్పార్డ్ ఎమ్‌పివి తన గుర్తింపును చాటుకునేందుకు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తి అనే పేరుతో అందరినీ ఆకట్టుకోనుంది.

- డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లతో వ్యవసాయం చేసే అవకాశం
- రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్
- భవిష్యత్ అమెరికా అధ్యక్షుడి లిమోసిన్ సిద్దం


Click it and Unblock the Notifications








