సంవత్సరాంతపు ఆఫర్ల మీద గురి పెట్టిన టయోటా
సంవత్సరాంతపు మరియు డిసెంబర్ ఆఫర్లతో ఇప్పటికే ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. అందులో టయోటా కూడా. ఎంచుకోదగ్గ మోడళ్ల మీద ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రత్యేకించి డిసెంబర్ 2016 కోసం ప్రకటించింది.
జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ తమ లైనప్‌లో ప్రత్యేకించి కొన్ని మోడళ్ల మీద 2016 డిసెంబర్ సందర్భంగా సంవత్సరాంతపు ఆఫర్లను ప్రకటించింది. అయితే ఇదే తరుణంలో టయోటా తమ ఉత్పత్తుల మీద 3 శాతం వరకు ధరలను పెంచింది.

టయోటా మోటార్స్ ఈ ఏడాది విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా మీద 100 శాతం ఋణ సదుపాయం కల్పించింది. టయోటా తమ లైనప్‌లో అత్తుత్తమ అమ్మకాలు సాధించిపెడుతున్న క్రిస్టా ఎమ్‌పివి మీద మరే ఇతర ఆఫర్లను అందివ్వలేదు.

అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి రీలాంచ్ చేసిన ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా రూ. 35,000 ల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. మరియు తమ ప్లాటినమ్ ఎటియోస్ కాంపాక్ట్ సెడాన్ మీద గరిష్టంగా రూ. 45,000 ల వరకు ఆఫర్లను ప్రకటించింది.

టయోటా మోటార్స్ తమ కరోలా ఆల్టిస్ ప్రీమియమ్ సెడాన్ మీద గరిష్టంగా రూ. 70,000 ల వరకు ఆఫర్లను ప్రకటించింది. టయోటా మోటార్స్ ప్రత్యేకంగా ఎంచుకుని ప్రకటించిన మోడళ్ల మీద వాటి స్టాక్ ఉన్నంత వరకు లేదా డిసెంబర్ 31, 2016 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

సంవత్సరాంతంలో ఆఫర్ల ద్వారా వీలైనన్ని అమ్మకాలు నమోదు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాల్సిన తరుణంలో టయోటా తమ శ్రేణిలోని అన్ని ఉత్పత్తుల మీద కూడా 3 శాతం వరకు ధరలను పెంచింది.

రిమెంబర్ డిసెంబర్ 2016 మరియు 2016 సంవత్సరాంతపు ఆఫర్లుగా వినియోగదారులకు 100 శాతం బుణ సదుపాయం కల్పిస్తోంది. తద్వారా పెద్ద నోట్లచే జరిగే చెల్లింపులను రద్దు చేసిన కారణంగా వాహన కొనుగోలుకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిని అధిగమించేందుకు అతి తక్కువ నెలసరి వాయిదా పద్దతి ప్రారంభించింది.

ఇన్నోవా క్రిస్టా మీద అతి తక్కువగా రూ. 22,999 ల నెలసరి వాయిదాను అందించింది. మరియు బై నవ్ పే లేటర్ అనే ఆఫర్ ద్వారా మార్చి 2017 లో చెల్లింపులు జరిపే అవకాశాన్ని కూడా టయోటా ఇండియా ప్రకటించింది.

తయారీ పరంగా పెట్టుబడులు పెరగడం మరియు డాలరుతో రుపాయి విలువ మారకం రేటు పడిపోవడం వంటి కారణాలచేత తమ లైనప్‌లోని ఉత్పత్తులపై ధరల పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు టయోటా తెలిపింది. మరియు పెరిగిన ధరలు జనవరి 1, 2017 నుండి అందుబాటులోకి రానున్నట్లు టయోటా ప్రతినిధునులు స్పష్టం చేశారు.

టయోటా కిర్లోస్కర్ మోటార్ మార్కెటింగ్ మరియు సేల్స్ విభాగపు డైరెక్టర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా మాట్లాడుతూ, టయోటా వాహనాల ఉత్పత్తికి కావాల్సిన ముడి పరికరాల అభివృద్దికి తోడ్పడే స్టీల్, అల్యూమినియం, కాపర్ మరియు రబ్బర్ వంటి పదార్థాల ధరలు ఆరు నెలల క్రితమే పెరిగనందున ప్రస్తుత తమ వాహనాల ధరలను పెంచడానికి కారణం అని చెప్పుకొచ్చారు.

జపాన్ నుండి కూడా కొన్ని విడి పరికరాలను టయోటా దిగుమతి చేసుకుంటోంది. జపాన్ మార్కెట్లో కూడా ముడి పరికరాల మీద ధరల పెరగడం కారణం కూడా దేశీయంగా టయోటా లైనప్‌లోని వాహనాల ధరల పెంపుకు పరోక్షంగా కారణమయ్యాయని ఆయన తెలిపాడు.

- జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
- బాలీవుడ్ ఏమీ తీసిపోమంటున్న సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు...
- ప్రపంచంలో కెల్లా అతి చిన్న జీపు: దీని వేగం గంటకు 60 కిలోమీటర్లు...!!


Click it and Unblock the Notifications








