10 రోజుల్లో 15 వేల బుకింగులు: టయోటా ఇన్నోవా క్రిస్టా
జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అతి తక్కువ కాలంలోనే ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి వాహనాన్ని విడుదల చేసింది. యావత్ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు మొత్తం ఆశ్చర్యపోయే విధంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే సుమారుగా 15,000 బుకింగ్స్ నమోదయ్యాయి. అది కూడా టయోటా ఇన్నోవా క్రిస్టాలోని టాప్-ఎండ్ వేరియంట్‌ను ఎక్కువగా ఎంచుకున్నారు.

ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ వేరియంట్ ధర రూ. 13.83 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.77 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని క్రిస్టా మోడళ్లు కూడా మునుపటి ఇన్నోవా వేరియంట్లతో పోల్చుకుంటే దాదాపుగా నాలుగు లక్షల వరకు వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం టయోటా ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వినియోగదారులకు డెలివరీ ఇవ్వడానికి కొంచెం వెయింటింగ్ పీరియడ్ ప్రకటించే అవకాశం ఉంది. Also Read: సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా ఫోటో గ్యాలరీ
దేశీయంగా కుటుంబ సమేతంగా ప్రయాణాలకు మరియు వ్యాపార రవాణా అవసరాలకు ఈ టయోటా ఇన్నోవా పెట్టింది పేరు. అందుకోసం టయోటా మోటార్స్ ఇన్నోవాలో ఉన్న లక్షణాలను గ్రహించి మరిన్ని ఆధునిక సౌకర్యవంతమైన ఫీచర్లతోపాటు మంచి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ హంగులతో ఇన్నోవా క్రిస్టా రూపంలో అందుబాటులోకి తెచ్చింది.
Also Read: దేశీయంగా ఇన్నోవా క్రిస్టా విడుదల: ధర రూ. 13.84 లక్షలు
గత కాలంలో టయోటా ఇన్నోవాకు పోటీగా రెనో లాజీ మరియు మహీంద్రా జైలో వాహనాలు ఉండేవి. అయినప్పటికీ ఇన్నోవాతో పోల్చుకునేంత పోటీని ఇవ్వలేకపోయాయి. అయితే తాజాగా ఇన్నోవా క్రిస్టా విడుదలైన నేపథ్యంలో ఈ రెండు ఉత్పత్తులు ఇక నిశ్శబ్దాన్ని పాటించర తప్పదు.


Click it and Unblock the Notifications