టయోటా ఇన్నోవా క్రిస్టాను ఇన్ని ఫోటోలలో ఎక్కడైనా చూడగలరా...?
టయోటా మోటార్స్ క్రితం రోజున నూతన తరానికి చెందిన 2016 ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విడుదల చేశారు. నూతనత్వానికి కొనసాగింపుగా మన ముందుకు వచ్చిన టయటా ఇన్నోవాకు చెందిన సుమారుగా 100 కు పైగా ఫోటోలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం నేటి కథనంలో అందిస్తున్నాము. క్రింద గల ఫోటో మీద క్లిక్ చేయండి.

ఇంజన్ :
జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ ఈ క్రిస్టా వాహనంలో 2.8-లీటర్ కెపాసిటి గల బిఎస్-IV స్టాండర్డ్ గల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 174 పిఎస్ పవర్ మరియు 1,200 నుండి 3,400 ఆర్‌పిఎమ్ మధ్య 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇది 2.4-లీటర్ డీజల్ ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది. ఈ 2.4-లీటర్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ని కలదు.
మరిన్ని వివరాలు:
- గేర్ బాక్స్ : 6-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మ్యాన్యువల్
- ఇంధన సామర్థ్యం: 55 లీటర్లు
- బరువు: 2450 కిలోలు(ఆటోమేటిక్), 2430 కిలోలు(మ్యాన్యువల్)
- క్రిస్టా వాహనం పొడవు: 4,735 ఎమ్ఎమ్
- క్రిస్టా వెడల్పు: 1,830 ఎమ్ఎమ్
- క్రిస్టా ఎత్తు: 1,795 ఎమ్ఎమ్
- మైలేజ్: మ్యాన్యువల్-10 కిమీలు, ఆటోమేటిక్- 11 కిమీలు
- సీటింగ్ సామర్థ్యం: 7 మంది ప్రయాణించవచ్చు
భద్రత ఫీచర్లు:
- క్లచ్ స్టార్ట్ సిస్టమ్ (స్టార్ట్ చేసే సమయంలో క్లచ్‌ను గట్టిగా నొక్కి పట్టి ఉంచాలి)
- ఏడు ఎయిర్ బ్యాగులు( డ్రైవర్, ముందు వైపు ప్యాసింజర్, డ్రైవర్ మోకాలికి, ముందు వైపు మరియు కర్టన్ షీల్డ్ వంటి ప్రదేశాలలో ఈ ఏడు ఉన్నాయి)
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- ఎలక్ట్రానికి బ్రేక్ డిస్ట్రిబ్యూషన్
- బ్రేక్ అసిస్ట్
- వెహికల్ స్టెబిలిటి కంట్రోల్
- హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్
- మూడు పాయింట్లు గల ఇఎల్ఆర్ సీట్ బెల్ట్ (ముందు మరియు వెనుక వైపు ఉన్న ప్రయాణికుల కోసం.


Click it and Unblock the Notifications













































































































































