పాత ఇన్నోవాకి కొత్త ఇన్నోవాకి మధ్య తేడా ఏంటి...?
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి విసృత స్థాయి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. అందులో 2005 లో భారతీయులకు ఇన్నోవా ఎమ్‌పివి వాహనాన్ని పరిచయం చేసింది. అప్పటి నుండి ఎన్ని ఎమ్‌పివి వాహనాలు దీనికి పోటీగా వచ్చినా దీనిని అమ్మకాల పరంగా వెనక్కినెట్టలేకపోయాయి. దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా ఎటువంటి అవాంతరాలను ఎదుర్కోకుండా విజయం పరంపరను కొనసాగుతూ వచ్చింది. అలా సుమారుగా ఒక దశాబ్దం కాలంలో 160 లక్షల ఇన్నోవా వాహనాలను అమ్మేసింది.

టయోటా మోటార్స్ తాజాగా ఇండియన్ మార్కెట్లో ఉన్న ఇన్నోవా స్థానంలోకి ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని విడుదల చేసింది. క్రితం రోజున బెంగళూరు కేంద్రంగా చేసుకుని దక్షిణ భారత మార్కెట్లోకి ఈ ఇన్నోవా క్రిస్టాను అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా మందికి ముందున్న ఇన్నోవా మరియు తాజా ఇన్నోవా క్రిస్టాకి మధ్య గల తేడా ఏమిటనే సందేహం మొదలై ఉంటుంది. పాత ఇన్నోవాను తరచూ రోడ్ల మీద చూస్తూనే ఉంటారు కదా, మరి కొత్త ఇన్నోవా క్రిస్టా ఎలా ఉందో క్రింద గల ఫోటోల మీద క్లిక్ చేసి తిలకించండి.
- క్రిస్టా జి 7-సీటర్ ధర రూ. 13,83,677 లు
- క్రిస్టా జి 8-సీటర్ ధర రూ. 13,88,177 లు
- క్రిస్టా జిఎక్స్ 7-సీటర్ ధర రూ. 14,69,681 లు
- క్రిస్టా జిఎక్స్ 8-సీటర్ ధర రూ. 14,74,181 లు
- క్రిస్టా జిఎక్స్ ఆటోమేటిక్ 7-సీటర్ ధర రూ. 15,99,681 లు
- క్రిస్టా జిఎక్స్ ఆటోమేటిక్ 8-సీటర్ ధర రూ. 16,04,181 లు
- క్రిస్టా విఎక్స్ 7-సీటర్ ధర రూ. 17,53,397 లు
- క్రిస్టా విఎక్స్ 8-సీటర్ ధర రూ. 17,57,897 లు
- క్రిస్టా జడ్‌ఎక్స్ 7-సీటర్ ధర రూ. 19,47,930 లు
- క్రిస్టా జడ్ఎక్స్ ఆటోమేటిక్ 7-సీటర్ ధర రూ. 20,77,930 లు
గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.
టయోటా క్రిస్టా సాంకేతిక వివరాలు:
టయోటా క్రిస్టా రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో కలదు. అందులో 2.4-లీటర్ ఇంజన్ 146.9 బిహెచ్‌పి పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ మరియు 2.8-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 174.5 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. రెండు ఇంజన్‌లు కూడా ఎకో మరియు పవర్ డ్రైవింగ్ మోడ్‌లలో అందుబాటులో కలవు. ఈ రెండు ఇంజన్ వేరియంట్లు కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.
అందుబాటులోకి:
ప్రస్తుతం టయోటా మోటార్స్ ఈ సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని బెంగళూరు మరియు కర్ణాటక రాష్ట్రం వ్యాప్తంగా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications






























































































































