క్రిస్టా కోసం దేశీయంగా పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేసే పనిలో టయోటా
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తమ బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పివి ఇన్నోవా కారు అమ్మకాలను పూర్తిగా నిలిపివేసి దీని స్థానంలో ఇప్పుడు క్రిస్టా కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే టయోటా ఈ క్రిస్టా వాహనాన్ని డీజల్ ఇంజన్‌తో పాటు పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వాలనే ఆలోచనలో ఉంది.

ఢిల్లీ పరిధిలో ఇన్నోవా మరియు క్రిస్టా కార్ల అమ్మకాల ఆశాజనకంగా ఉన్నాయి. అయికే వీటిని పెట్రోల్ వేరియంట్లో అందుబాటులో ఉంచి ఉండే మంచి అమ్మాకాలు సాధించేది. దీని దృష్టిలో ఉంచుకుని టయోటా క్రిస్టా కోసం పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ది చేయాలను ఆలోచనలో ఉంది.
Also Read: మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా
ప్రస్తుతం టయటా తమకు కావాల్సిన ఇంజన్‌లను కర్ణాటకలోని జిగని పారిశ్రామిక వాడలో తయారు చేస్తోంది. ఇంజన్‌లను దిగుమతి చేసుకోకుండా దేశీయంగా తయారు చేసుకోవడం వలన తక్కువ ధరలకు వీటిని అమ్మవచ్చు. అయితే ప్రస్తుతం కిర్లోస్కర్ దీనికి సబ్సిడరీగా వ్యవహరిస్తూ ఇంజన్‌లను తయారు చేస్తోంది.
Also Read: గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు
రెండు సంస్థలు కూడా సంయుక్తంగా పెట్రోల్ ఇంజన్ అభివృద్ది చేయడం గురించి చర్చించుకుంటే బాగుటుంది. అయితే ఇన్నోవా ఈ క్రిస్టా వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే రెనో వారి లాజి, మహీంద్రా జైలో వంటి వాటికి పోటిగా నిలవనుంది. మరియు దీని ప్రారంభ ధర సుమారు రూ. 13 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉండవచ్చు.


Click it and Unblock the Notifications

































