టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఇన్నోవా క్రిస్టాను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది.

టయోటా మోటార్స్ ఈ ఏడాది మే నెలలోని మొదటి వారంలో తమ ఇన్నోవా స్థానంలోకి ఇన్నోవా క్రిస్టాను విడుదల చేసార. అయితే అప్పుడు కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. పెట్రోల్ వేరియంట్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ క్రిస్టా ను ఇప్పుడు పెట్రోల్ వేరియంట్లో అందుబాటులోకి తెచ్చారు. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ వేరియంట్ జిఎక్స్ (మ్యాన్యువల్) ధర రూ. 13,72,800 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ జఎక్స్ యొక్క ధర రూ. 19,62,300 లు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న టయోటా షోరూమ్‌లలో ఈ ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

సాంకేతికంగా ఈ ఇన్నోవా క్రిస్టాలో 2.7-లీటర్ సామర్థ్యం ఉన్న డ్యూయల్ వివిటిఐ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

ఇందులోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

ఈ ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను అందించారు. ఇందులో ఎకో మరియు పవర్ అనే రెండు డ్రైవింగ్ మోడ్‌లను అందించారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

ఏఆర్ఏఐ వారి సర్టిఫికేట్ ప్రకారం ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వేరియంట్ 10.38 కిలోమీటర్/లీటర్ మరియు మ్యాన్యువల్ వేరియంట్ 9.89 కిలోమీటర్/లీటర్ చొప్పున మైలేజ్ ఇవ్వగలవు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

డిజైన్ మరియు ఎక్ట్సీరయర్‌ పరంగా ఏ విధమైన మార్పులు జరగలేదు. ఇది పూర్తిగా డీజల్ క్రిస్టాను పోలి ఉంటుంది. ఇంటీరియర్ పరంగా కూడా ఎలాంటి మార్పులు జరగలేదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్లోని స్టాండర్జ్ ఫీచర్లు మూడు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిహబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, హైట్ అడ్జస్టబుల్ సీట్, ముందు వైపు సీట్లకు ప్రి టెన్సనర్ మరియు ఫోర్స్ లిమిటర్ వంటివి కలవు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

వాహనంలోని అన్ని సీట్లకు 3 పాయింట్ల సీట్ బెల్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్, ఇందులో అదనపు బ్యాటరీని అందించారు. అంతే కాకుండా ఇందులో చిల్డ్ సీట్లకు ISOFIX స్లాటింగ్ పాయింట్లను అందించారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

స్టాండర్డ్ వేరియంట్లో ఉన్న ఫీచర్లతో పాటు టాప్ వేరియంట్ జడ్ఎక్స్ లోని భద్రత ఫీచర్లు: మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

డీజల్ క్రిస్టా వేరియంట్లో ఉన్న కూల్ ఫీచర్లు కూల్డ్ అప్పర్ గ్లూవ్ బాక్స్, వన్ టచ్ టంబల్ సెకండ్ రో సీట్లు, మరియు అధునాతనమైన హెడ్ ల్యాంప్స్ ఈ పెట్రోల్ క్రిస్టా లో కూడా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి, గార్నెట్ రెడ్, వైట్ పియర్ల్ క్రిస్టల్ షైన్ మరియు అవంత్-గార్డ్ బ్రాంజ్.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

పైలట్లు ప్రయాణికులతో షేర్ చేయకుండా దాచే విషయాలు

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ విడుదల

సరికొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా: 100కు పైగా ఫోటోలలో

Article Published On: Tuesday, August 9, 2016, 11:45 [IST]
English summary
Toyota Innova Crysta Petrol Launched In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+