పెట్రోల్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టాను విడుదల చేయనున్న టయోటా

By Anil

టయోటా మోటార్స్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సరికొత్త ఇన్నోవా క్రిస్టా కారును ప్రదర్శించింది. తాజాగా జపాన్‌కు చెందిన ఈ సంస్థ ఇన్నోవా క్రిస్టా డీజల్ ఎమ్‌పివిని దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. అయితే టయోటా మోటార్స్ ఈ ఇన్నోవా క్రిస్టాను పెట్రోల్‌తో నడిచే ఇంజన్‌ ఆప్షన్‌లో అందివ్వనుంది. దీని విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

టయోటా వారి ప్రస్తుత ఇన్నోవా క్రిస్టాను ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధి ప్రాంతంలో విక్రయించడానికి అనుమతులు లేవు. ఢిల్లీ నగరంలో డీజల్ కార్ల అమ్మకాల రద్దు నిర్ణయానికి సుమారుగా ఏడు శాతం అమ్మకాలకు గండిపడుతోంది. టయోటా వారి ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా క్రిస్టా రెండు వాహనాలు కూడా 2.0 లీటర్ కన్నా ఎక్కువ సామర్థ్యంతో ఉన్నాయి.
ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు
టయోటా సంస్థ ఈ ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ కోసం 2.7 లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల వివిటి-ఐ ఇంజన్‌ను అభివృద్ది చేస్తోంది. ఈ ఇంజన్ సుమారుగా 161.76 బిహెచ్‌పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.
దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే.....
ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనిని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. పెట్రోల్ వేరియంట్లో వస్తున్న కారణంగా ఢిల్లీలో కూడా దీనిని విడుదల చేయనున్నారు. పెట్రోల్ ఇంజన్‌తో రానున్న ఈ ఇన్నోవా క్రిస్టాలో కొన్ని వేరియంట్లు కూడా ఉండనున్నాయి. దీని ప్రారంభం వేరియంట్ ధర రూ. 14 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్
టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్
Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Petrol Powered Innova Crysta Launching In India By September
Story first published: Monday, June 20, 2016, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X