టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ పరిచయం: ధర మరియు ఫీచర్లు...

By Anil

దేశీయ మార్కెట్లో పెట్రోల్ కార్ల వినియోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. ఎంట్రీలెవల్ కార్లతో మొదలైన పెట్రోల్ వాడకం ఇప్పుడు పెద్ద పెద్ద ఎస్‌యువిలలో కూడా మొదలైంది. అందుకు నిదర్శనం టయోటా మోటార్స్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోటా క్రిస్టా. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో ప్రజాదరణ పొందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని టయోటా ఈ క్రిస్టాను పెట్రోల్‌ను వేరియంట్లో తీసుకువస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ ఫీచర్లు, ధర మరియు ఇతర వివరాలు విడుదలయ్యాయి, వాటి గురించి క్రింది కథనంలో...

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

దేశ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ను పొందుతున్న టయోటా వారి ఇన్నోవా క్రిస్టా డీజల్ వేరియంట్ మాత్రం దేశ రాజధాని ఢిల్లీ మరియు దాని పరిధిలో అమ్మకాలకు నోచుకోలేకపోతోంది. కారణం. ఇక్కడ 2,000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేశారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

ఎలాగైనా ఢిల్లీలో కూడా ఇన్నోవా క్రిస్టా జెండాను పాతడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది ఇన్నోవా. అందులో భాగంగానే ఢిల్లీని దృష్టిలో ఉంచుకుని ఇన్నోవా క్రిస్టాను పెట్రోల్ వేరియంట్‌లో అభివృద్ది చేస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

టయోటా తమ ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్‌ను జూలై 18, 2016 నుండి ఉత్పత్తి చేయనున్నారు మరియు ఆగష్టు మధ్య భాగానికి వినియోగదారులకు దీనిని డెలివరీ ఇవ్వనున్నారు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వేరియంట్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టయోటా షోరూమ్‌లలో డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. దీనిని లక్షల రుపాయలు బుకింగ్ అమౌంట్‌గా చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

పెట్రోల్ వేరియంట్లో అందుబాటులోకి రానున్న టయోటా ఇన్నోవా క్రిస్టా మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి జి, వి మరియు జడ్‌ గా ఉన్నాయి.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

ఇన్నోవా క్రిస్టాలో 2.7 లీటర్ సామర్థ్యం ఉన్న డ్యూయల్-వివిటిఐ (వేరిబుల్ వ్యాల్యూ టైమింగ్ విత్ ఇంటెలిజెన్స్) సాంకేతికత గల ఇంజన్ కలదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జి వేరియంట్లోని ఫీచర్లు

టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జి వేరియంట్లోని ఫీచర్లు

  • ఏడు మరియు ఎనిమిది సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులో కలదు
  • 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల అనుసంధానం
  • 205/65ఆర్16 టైర్లు గల 16-అంగుళాల చక్రాలు
  • మూడు ఎయిర్ బ్యాగులు
  • ప్రాథమిక మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ తెర (తాకే తెర లేదు)
  • నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్
  • టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వి వేరియంట్

    టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వి వేరియంట్

    • ఏడు సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే అందుబాటులో ఉంది
    • మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే కలదు
    • 205/65ఆర్16 టైర్లు గల 16-అంగుళాల చక్రాలు
    • తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • ఆరు స్పీకర్ల ఆడియో సిస్టమ్
    • టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వి వేరియంట్

      టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ వి వేరియంట్

      • ఆటోమేటిక్ ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్
      • స్మార్ట్ కీ ద్వారా కీ లెస్ ఎంట్రీ
      • డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం
      • నాలుగు అద్దాలు కూడా ఆటో అప్ అండ్ డౌన్
      • టయటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జడ్ వేరియంట్

        టయటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జడ్ వేరియంట్

        • ఏడు సీట్ల సామర్థ్యం
        • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ మాత్రమే కలదు
        • 215/55ఆర్17 టైర్లు గల 17-అంగుళాల చక్రాలు
        • శాటిలైట్ న్యావిగేషన్ అనుసంధానం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
        • టయటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జడ్ వేరియంట్

          టయటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ జడ్ వేరియంట్

          • లెథర్ సీట్లు
          • ఏడు ఎయిర్ బ్యాగులు
          • క్రూయిజ్ కంట్రోల్
          • స్టెబిలిటి కంట్రోల్
          • హిల్ స్టార్ట్ అసిస్ట్
          • ధరలు

            ధరలు

            ఈ మూడు నూతన పెట్రోల్ వేరియంట్ ఇన్నోవా క్రిస్టా వాహనాలు డీజల్ వాహనాల ధరల కన్నా సుమారుగా 60,000 రుపాయల తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

            టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్
            • మీకు తెలుసా శకుంతల రైల్వేస్ ఇప్పటికీ ఇండియన్ రైల్వేలో భాగం కాదు
            • పాత ఇన్నోవాకి కొత్త ఇన్నోవాకి మధ్య తేడా ఏంటి...?

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota Innova Crysta Petrol Variants Revealed, Bookings Open
Story first published: Thursday, July 7, 2016, 18:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X