మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

By Anil

దేశీయంగా నెం. 1 స్థానంలో ఉన్నటయోటా వారి ఎమ్‌పివి వాహనం, మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తిని నిలిపివేసింది. ఈ మొదటి తరం ఇన్నోవా స్థానాన్ని తమ రెండవ తరానికి చెందిన ఇన్నోవా అయిన క్రిస్టా వాహనంతో భర్తీ చేయనున్నారు.

టయాటా ఇన్నోవా గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

ప్రస్తుతం టయాటా మోటార్స్ సంస్థ తమ ఇన్నోవా వాహనాన్ని కర్ణాటకలోని బిడది ప్రాంతంలో గల ప్లాంటు ద్వారా ఉత్పత్తి జరుగుతోంది.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

వ్యక్తిగతంగా మరియు వ్యాపార సంస్థలకు రెండు విధాలుగా ఈ ఇన్నోవా మంచి ఆదరణ పొందింది. అయితే దీని స్థానంలోకి తీసుకువచ్చిన సరికొత్త టయోటా క్రిస్టా కారు దీని ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తుందని తెలిపారు.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

టయోటా తమ మొదటి మరియు రెండవ తరం ఇన్నోవాలను రెండింటిని కూడా మార్కెట్లోకి అందింస్తుందని వదంతులు వచ్చాయి. అయితే బిడది ప్లాంటులో టయోటా సంస్థ ఏర్పాటు చేసిన వేదిక సంధర్బంగా రెండవ తరం ఇన్నోవాలను మాత్రమే అందుబాటులో ఉంచి, మొదటి తరం ఇన్నోవాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

టయోటా మోటార్స్ తమ మొదటి తరం ఇన్నోవా వాహన్ని దేశీయ మార్కెట్లోకి 2005లో పరిచయం చేశారు.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

అయితే అప్పట్లో దీనిని టయోటా క్వాలీస్ స్థానాన్ని భర్తీ చేయడానికి మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఇన్నోవా వాహనం భారీ స్థాయిలో ప్రజాదరణ పొందుతూ వస్తోంది. ప్రతి నెల కూడా దాదాపుగా 5,000 యూనిట్ల టయోటా ఇన్నోవా వాహనాలు అమ్ముడుపోతున్నాయి.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

మొదటి తరం ఇన్నోవా స్థానాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటున్న రెండవ తరం ఇన్నోవా అయిన క్రిస్టా ఈ ఏడాది మధ్య భాగంలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా

టయోటా ప్రస్తుతం దీనికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా వెళ్లడించలేదు. అయితే దీనిని 100 శాతం దేశీయంగా తయారుచేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో దీనిని విడుదల చేయనున్నారు, అప్పటి దాకా డ్రైవ్‌స్పార్క్‌తో కలసి ఉండండి.

మొదటి తరం ఇన్నోవా ఉత్పత్తికి తెర దించిన టయాటా
  • విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?
  • భారతదేశపు సుదూర రైలు వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు

Article Published On: Tuesday, March 15, 2016, 10:09 [IST]
English summary
Toyota Innova First-Gen MPV Model Production Comes To An End In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+