ప్రియస్ ఇండియాలో విడుదల తేదీని ఖరారు చేసిన టయోటా మోటార్స్

By Anil

జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ టయోటా తమ ప్రియస్ హైబ్రిడ్ కారును దేశీయంగా విడుదల చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసుకుంది. సరికొత్త టయోటా ప్రియస్ మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. విస్వసనీయ సమాచార వర్గాల కథనం ప్రకారం టయటా ఈ ప్రియస్ ను ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్లు తెలిసింది. ప్రియస్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో.....

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ఎకో ఫ్రెండ్లీ అయిన హైబ్రిడ్ కార్ల విభాగంలోకి విడుదల కానున్న ఈ ప్రియస్ హైబ్రిడ్ కారును కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం నుండి రాయితీలు కూడా ఉన్నాయి.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

దేశీయంగా అందుబాటులోకి రానున్న ప్రియస్ హైబ్రిడ్ కారులో 1.8 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానమై ఉంటుంది.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 166 బిహెచ్‌పి పవర్ మరియు 305 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ కోసం 8.8 kW/h లిథియమ్-అయాన్ బ్యాటరీను అనుసంధానం చేశారు.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా కలిసి లీటర్‌కు 21.26 కిలోమీటర్ల మైలే‌జ్‌నిస్తాయి.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ఉద్గారాల పరంగా చూస్తే ఈ ప్రియస్ హైబ్రిడ్ కారు పర్యావరణహితమైనది. ఇది కిలోమీటర్‌కు కేవలం32 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వాయువును మాత్రమే ఉద్గారిస్తుంది.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

డిజైన్ పరంగా ఈ ప్రియస్ హైబ్రిడ్ కారు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముందు వైపున మరింత పదునైన డిజైన్ కల్పించారు, మిరాయ్ హైడ్రోజన్ పవర్ కారు తరహాలో దీని ఫ్రంట్ డిజైన్ ఉంటుంది.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ఇక దీని అమ్మకాల పరంగా చూస్తే టయోటా దీనిని తొలిసారిగా ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 90 లక్షల హైబ్రిడ్ కార్లు అమ్ముడుపోయాయి.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

ప్రియస్ హైబ్రిడ్ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 40 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉండవచ్చు.

టయోటా ప్రియస్ హైబ్రిడ్

భారతదేశపు మొదటి హైబ్రిడ్ ఎస్‌యువి

అమియో పేరుతో వోక్స్‌వ్యాగన్ వారి కాంపాక్ట్ సెడాన్ విడుదల

ఎక్కువ మైలేజ్ ఇవ్వగల 5 కాంపాక్ట్ సెడాన్ కార్లు

Article Published On: Saturday, June 11, 2016, 12:00 [IST]
English summary
Toyota Prius India Launch Date Confirmed
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+