భద్రతే ముఖ్య లక్ష్యంగా టయోటా కార్లు
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశ్యంతో మరో కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. రోడ్డు ప్రమాదాలు ద్వారా ఎంతో మంది ప్రాణాలా కోల్పోతున్న నేపథ్యంలో తమ అన్ని ఉత్పత్తుల్లో కూడా భద్రత ఫీచర్లు తప్పనిసరిగా అందించాలని నిర్ణయం తీసుకుంది.

భద్రతలో తమ వంతుగా, టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (టిఎన్‌జిఎ) ను అభివృద్ది చేశారు. దీనిని నాలుగవ తరానికి చెందిన ప్రియస్ లో కూడా అందించారు. ఈ పరిజ్ఞానాన్ని మరిన్ని ఉత్పత్తుల్లో అందుబాటులోకి తీసుకురానుంది టయోటా. అంతే కాకుండా వచ్చే ఏడాది నాటికి యూరోప్, జపాన్ మరియు అమెరికాలో విడుదలయ్యే అన్ని ఉత్పత్తుల్లో కూడా ప్రి కొల్లిషన్ సిస్టమ్‌ను తప్పనిసరిగా అందివ్వనుంది.

ప్రి కొల్లిషన్ సిస్టమ్ అనగా, ఇది ప్రమాదానికి ముందుగా పనిచేసే వ్యవస్థ. ఇందులో కెమెరా మరియు మిల్లీమీటర్ తరంగ రాడార్ సాంకేతిక వ్యవస్థ ఉంటుంది. ప్రమాదం జరిగడానికి ముందుగా డ్రైవర్ గుర్తించి బ్రేకులను వినియోగించడం విఫలం చెందినపుడు ఈ వ్యవస్థ బ్రేకులు వేస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు మరియు ఒక వేళ ప్రమాదం చోటు చేసుకుంటే దాని తీవ్రతను తగ్గిస్తుంది.

టయోటా లో ముఖ్య భద్రతా సాంకేతిక అధికారి సీజొ కుజుమాకి మాట్లాడుతూ. టయోటా వారి టిఎన్‌జిఎ పరిజ్ఞానంతో కార్ల బాడీలను డిజైన్ చేయడం వలన కారుకు ముందు వైపున ప్రమాదంలో ఎక్కువ భాగం నుజ్జుకాకుండా ఉంటుంది. ఈ పరిజ్ఞానం వినియోగించడం ద్వారా మునుపటి తరం కార్ల కన్నా 55 శాతం క్యాబిన్ డ్యామేజ్ తగ్గిపోతుందని వివరించారు.

ఇండియన్ రహదారుల ప్రమాదాలకు నిలయాలుగా ఉండే సంగతి ప్రపంచ వాహన తయారీ సంస్థలన్నింటికి తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో టయోటా వారి కొత్త పరిజ్ఞానంతో వచ్చే కార్లు దేశీయంగా విడుదలైతే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇండియాలోకి ఈ ఉత్పత్తులను అందించే విశయమైన ఏ విధమైన సమాచారం లేదు.

గత ఏడాదిలో ఇండియాలో రోడ్డు ప్రమాదాల వలన మరణిస్తున్న వారి సంఖ్య ఐదు శాతానికి పెరిగింది. మరియు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1.42 మిలియన్ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

- ఇండియాలో రోడ్డు ప్రమాదాల ఎక్కువగా సంభవించడానికి గల అతి ముఖ్యమైన 25 కారణాలు: రిపోర్ట్


Click it and Unblock the Notifications








