డీజల్ కార్లు బ్యాన్ అవుతున్నా ఇప్పటికీ వాటినే ఎంచుకుంటున్నారు, ఎందుకు ?
దేశ రాజధాని ఢిల్లీలో డీజల్ కార్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం వలన ఓ స్థాయిలో వాహన కాలుష్యం కాస్త అదుపులోకి వచ్చినట్లు కూడా తెలిస్తోంది. మంచి పలితాలు ఇస్తున్న తరుణం ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో పరిచయం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: నావిక్ ప్రయోగంతో స్వంత జిపిఎస్ వ్యవస్థను రూపొందించుకున్న భారత్
ఇలా డీజల్ కార్లను బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కొన్ని సంస్థలు ఎటువంటి భయం లేకుండా డీజల్ కార్లను మరింతగా ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ సంస్థ బెంగళూరులోని డీజల్ ఇంజన్‌ల తయారీ ప్లాంటులో సుమారుగా 1,100 కోట్లు రుపాయలు పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ఏడాదికి సుమారుగా 1,08,000 యూనిట్ల వరకు ఉత్పత్తి పెరగనుంది. డీజల్ కార్లను బ్యాన్ చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంటే వీరి ధైర్యం ఎంటో మరి.
Also Read: లీటర్‌కు 1099 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట: ఎలాగో మీరే చూడండి
ప్రస్తుతం ఇండియాలో బిఎస్ IV ఎమిషన్ స్టాండర్ట్ అందుబాటులో ఉంది. అయితే మరింత కఠినతరం చేస్తూ ఉద్గారాలకు సంభందించి బిఎస్ VI స్టాండర్డ్‌ను 2020 నాటికి అందుబాటులో తేనునున్నారు. ఇలా జరిగే ప్రస్తుతం ఉన్న చాలా వరకు డీజల్ ఇంజన్‌లు ఉద్గార నియమాలను పాటించక అనుమతి కోల్పోయే అవకాశాలతో పాటు మార్కెట్ నుండి వైదొలగాల్సి ఉంటుంది. ఈ తరుణంలో టయోటా మోటార్స్ అత్యాధునిక జిడి సిరీస్ డీజల్ ఇంజన్‌ను అభివృద్ది చేసింది. ఇది బిఎస్ IV ఉద్గార నియమాలను పాటిస్తుంది. అంతే కాకుండా దీనిని భవిష్యత్తులో మరింత అభివృద్ది చేసి బిఎస్ VI యొక్క నియమాలను పాటించే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: అణు పరీక్షలు ఆపమంటూ దక్షిణ కొరియా మరియు అమెరికాలకు వార్నింగ్
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న చిన్న కార్లు మరియు హ్యాచ్‌బ్యాక్ వంటి ఇతర కార్లను పెట్రోల్ ఇంజన్‌లతో నడిపినప్పటికీ ఎక్కువ మంది వినియోగదారులు తమ కేవలం డీజల్ ఇంజన్‌లు గల ఎస్‌యువి వాహనాలను మాత్రమే ఎంచుకుంటున్నారు. డీజల్ ఇంజన్‌ల కోసం మొగ్గు చూపడానికి ఎక్కువగా దోహదం చేస్తున్న అంశాలు :
- ఉత్తమ మైలేజ్
- అత్బుతమైన హై వే డ్రైవింగ్
- అధిక బరువులను మోయగలగడం
- నాలుగు, ఐదు గేర్లలో ఉన్నప్పుడు మెట్ట రోడ్ల మీద ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది
- ప్రత్యామ్యాయ ఇంధనాలను ఉపయోగించవచ్చు-హైబ్రిడ్


Click it and Unblock the Notifications








