ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనున్న టయోటా మోటార్స్
టయోటా మోటార్స్ వారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునే వాహనాలను ప్రదర్శించనుంది.

ఢిల్లీలో 2-లీటర్ కెపాసిటి కన్నా ఎక్కువ ఉన్న డీజల్ ఎస్‌యువి వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టయోటా కు చెందిన ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ వాహనాల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వీటి అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రత్యేకంగా ఇలాంటి నగరాల కోసం టయోటా ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునే వాహనాలను అందించనుంది.
Also Read: లీటర్‌కు 40 కిలోమీటర్ల మైలేజ్! టయోటా కొత్త కారు ప్రియస్
వాహన కాలుష్యాన్ని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుందని. ముఖ్యంగా ఇలాంటి నగరాల కోసమే అతి తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ వాహనాలను అందిస్తున్నామని టయోటా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. రాజా తెలిపారు.


Click it and Unblock the Notifications













