ఇండియన్ మార్కెట్లోకి హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టిన టయోటా మోటార్స్

By Anil

టయోటా మోటార్స్ గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ నాలుగవ తరానికి చెందిన ప్రియస్ హైబ్రిడ్ కారును ప్రదర్శించింది. టయోటా మోటార్స్ వారు ఉత్పత్తి చేస్తున్న హైబ్రిడ్ కార్లలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ ప్రియస్ కారు. అందుకోసమే మూడు తరువాత నాలుగవ జనరేషన్ ప్రియస్‌ను ఆవిష్కరించింది.

టయోటా ప్రియస్


టయోటా ప్రియస్ సాంకేతిక వివరాలు మరియు ఫీచర్లు
ఇంజన్ రకము: పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్
ఇంజన్ సామర్థ్యం: 1.8-లీటర్ + విద్యుత్ మోటార్
రెండింటి పవర్: 121 బిహెచ్‌పి
రెండింటి టార్క్: 163 ఎన్ఎమ్ అత్యధిక టార్క్
అత్యధిక వేగం: గంటకు 180 కిలోమీటర్లు
మైలేజ్: లీటర్‌కు 22.11 కిలోమీటర్లు
ఇందులో ఉన్న హైబ్రిడ్ పవర్ ట్రైయిన్ సివిటి గేర్‌బాక్స్‌కు అనుసందానమై ఉంటుంది.
AUTO EXPO NEWS: మారుతి సుజుకి వితారా బ్రిజా ఫోటోలు
ప్రియస్ డిజైన్:
ఈ నాలుగవ తరానికి చెందిన ప్రియస్ హైబ్రిడ్‌ కారును దీని ముందు జనరేషన్‌తో పోల్చితే చాలా వరకు వ్యత్యాసం గమనించవచ్చు. ముందు వైపును ఇంకా క్రిందకు ఉండే విధంగా డిజైన్ చేశారు. మరియు ఈ హైబ్రిడ్ కారు గాలి నుండి కలిగే ఘర్షణకు గురికాకుండా ఏరోడైనమిక్‌ డిజైన్‌ కల్పించారు. పొడవాటి బాడీతో ఉన్న దీని రూపం మిమ్మల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది.
AUTO EXPO NEWS: టయోటా క్రిస్టా: పాత సీసాలో కొత్త మద్యం అంటే ఇదే మరి ?
భద్రత మరియు వినోదభరితమైన ఫీచర్లు:
ప్రియస్ కారు క్యాబిన్‌ లోపల 7.0-అంగుళాల తాకే తెర పరిమాణం గల సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు, దీనికి అదనంగా జెబి‌ఎల్ వారి 10 స్పీకర్లు గల ఆడియో సిస్టమ్ ఇందులో కలదు. ఇక భద్రత పరంగా పార్కింగ్ కెమెరా, తొమ్మిది ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ మరియు ట్రాక్షన్‌ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
AUTO EXPO NEWS: కాంపాక్ట్ క్రాసోవర్‌లలో విజృంభించనున్న మారుతి సుజుకి ఇగ్నిస్
పోటి మరియు అందుబాటులోకి:
ప్రస్తుతం ఈ హైబ్రిడ్ ప్రియస్ కారుకు దేశవ్యాప్తంగా ఎటువంటి పోటి లేదు మరియు టయోటా మోటార్స్ వారు దీనిని ఈ ఏడాది చివరికల్లా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 10, 2016, 16:24 [IST]
English summary
New Toyota Prius Hybrid Makes India Debut At Auto Expo 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+