మునుపటి నిర్ణయానికి రివర్స్ గేర్‌లో టయోటా మోటార్స్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ ఒకప్పుడు ఇండియాలోకి తమ కొత్త ఉత్పత్తుల విడుదలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఇండియాలోకి తమ కొత్త ఉత్పత్తుల వరదను పొంగిస్తామని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు గతంలో ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో 2000సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాలను నిషేధించింది. ఈ క్రమంలో ఇండియాలోకి కొత్త వాహనాల విడుదలను ఆలస్యం చేయాలని టయోటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగ దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఈ నిషేధాన్ని తొలగించింది. దీంతో టయోటా తమ నిర్ణయాన్ని మార్చుకుని కొత్త ఉత్పత్తుల విడుదలను ప్రారంభించాలని అనుకుంది.
Also Read: దేశీయ విపణిలోకి మూడు ఉత్పత్తులను విడుదల చేసిన జీప్: ప్రారంభ ధర రూ. 93.64 లక్షలు
టయోటా మోటార్స్ యొక్క మధ్య ఆసియాతో పాటు తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికాలకు ఛీఫ్ ఎక్జ్సిక్యూటివ్‌గా ఉన్న హిరోయుకి ఫుకుయ్ మాట్లాడుతూ ఇండియాలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామని, దీనికి భారత సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఎంతో కారణం అయ్యిందని వివరించారు.
దేశ సర్వోన్నత న్యాయ స్థానం గత ఏడాది చివరిలో తీసుకున్న డీజల్ వాహనాల నిషేధానికి టయోటా మోటార్స్ భారీగా నష్టపోయింది. సుమారుగా 8,500 కార్ల అమ్మకాలు స్తంభించిపోవడం వలన 1,700 కోట్ల వరకు నష్టపోయినట్లు టయోటా తెలిపింది. అంతే కాకుండా దేశం మొత్తం అమ్మకాల్లో ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో టయోటా అమ్మకాల వాటా 7 నుండి 8 శాతం వరకు ఉండేదని టయోటా కిర్లోస్కర్ ఛైర్మెన్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు.
Also Read: హీరో నుండి మూడు కొత్త ఉత్పత్తులు: హీరో ప్లాన్ కేక
త్వరలో దేశీయంగా విడుదల కానున్న కొత్త ఉత్పత్తులకు సంభందించిన అభివృద్ది పనులు జపాన్‌లో జరుగుతున్నాయి. మరియు వాటిని ఇండియాలో విడుదల చేయాడానికి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టయోటా కిర్లోస్కర్‌కు దేశీయంగా కర్ణాటకలో రెండు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఈ రెండింటి నుండి ఏడాదికి 3,10,000 యూనిట్ల ఉత్పత్తయ్యే సామర్థ్యం కలదు.


Click it and Unblock the Notifications








