ప్రపంచపు మొదటి ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును నిర్మిస్తున్న చైనా
ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం చైనా, అధిక జనాభాకే కాదు, అంతకు మించిన ట్రాఫిక్‌కు కూడా చైనా పేరుగాంచింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో చైనా ముందడుగు వేసి సరికొత్త ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును నిర్మిస్తోంది. సాధారణంగా ఇలాంటి వాటిని వీడియో గేమ్స్‌లలో చూస్తుంటాం, కాని దీనిని నిజంగా నిర్మించాలని చైనా డిసైడయింది. దీని గురించి పూర్తి వివరాలు కోసం...

చైనా ప్రపంచపు మొదటి ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును పూర్తి స్థాయిలో నిర్మించేసింది. అయితే ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికంటే ముందుగా పరీక్షించాల్సి ఉంది.

ఈ ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సును పరీక్షించడానికి చైనాలో సుమారుగా 300 మీటర్ల పొడవున్న ట్రాక్‌ను రూపొందించింది. ఆ రహదారిలో తక్కువ ట్రాఫిక్‌ను కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలా పరీక్షలకు రోడ్డెక్కిన బస్సు అతి త్వరలో పూర్తి స్థాయిలో సేవలందించడానికి సిద్దం కానుంది. సుమారుగా 1,200 మంది ప్రయాణికులతో గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.

అత్యంత ఖర్చు, శ్రమ మరియు సాంకేతికతతో కూడుకున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం కాస్త కష్టమే అయినప్పటికీ ఇది చైనాలోని ప్రముఖ నగరాలలో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ను సాధ్యమైనంత వరకు నిర్మూలించవచ్చు.

ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు అనగా సుమారుగా రెండు మీటర్లు కన్న ఎత్తు ఉంటుంది. దీని క్రింద కార్లు మరియు చిన్న చిన్న వాహనాలు వెల్లవచ్చు. ఇది అచ్చం రైలులా ఉంటుంది. కాని దీని క్రింద వాహనాలు వెళుతుంటాయి.

దీని కోసం రోడ్డుకు ఇరువైపులా ట్రాక్‌ను నిర్మిస్తారు, ఈ ట్రాక్ మీద చక్రాలతో ఇది నడుస్తుంది. పై భాగంలో ప్రయాణికులకు బస్సు రూపంలో సీటింగ్‌ను అందిస్తారు.

ఈ ప్రాజెక్టులోని ప్రముఖ ఇంజనీర్ మాట్లాడుతూ ఇలాంటి బస్సుల ద్వారా రహదారుల్లో స్థలం లేదనే ఇబ్బంది దూరం చేస్తుంది. ఒకే రూటులో రెండు రకాల ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఉంటుంది అని తెలిపారు.

ఒక్క ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు సుమారు 40 సాధారణ బస్సులకు సమానంగా ఉంటుంది.

ఇక దీని నిర్మాణానికి కావాల్సిన ఖర్చు గురించి చూస్తే, సబ్ వే ల నిర్మాణంలోని ఐదవ వంతు మాత్రమే దీని నిర్మాణానికి ఖర్చవుతుందని తెలిపారు.

అయితే ఇది నూతన అవిష్కరణ అనుకుంటే పొరబాటే, ఎందుకంటే చైనాలో మే లో జరిగిన 19 వ బీజింగ్ అంతర్జాతీయ హై-టెక్ ఎక్స్ పో లో దీనిని ప్రదర్శించారు. తరువాత రెండు నెలల అనంతరం ఈ ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు పరీక్షలకు సిద్దమైంది.
ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్సు రవాణా గురించిన వీడియోను చూడగలరు.

మన భవిష్యత్ ప్రయాణం ఇలా.....

- సముద్ర గర్భంలో కదిలే రహదారి సొరంగం


Click it and Unblock the Notifications








