ఉబర్ ప్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్...!!
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురంచి అందరికీ తెలిసిన విషయమే, టెక్నాలజీలోని నూతన పోకడలను అందిపుచ్చుకుని ఉబర్ సరికొత్త ఎగిరే కార్ల (Flying Cars) అభివృద్ది మీద దృష్టి సారించింది.
పాశ్చ్యాత దేశాలకు చెందిన ప్రముఖ క్యాబ్ సేవల నిర్వహణ సంస్థ ఉబర్ భవిష్యత్ రవాణాను మార్కెట్ చేసుకోవడానికి నూతన పోకడల మీద దృష్టి సారిస్తోంది. ప్రయాణికులకు మరియు డ్రైవర్లకు మధ్య కేవలం అనుసంధాన కర్తగా మాత్రమే కాకుండా ఆ రంగంలో ఉన్న మరిన్ని వ్యాపార అవకాశాలను చేజిక్కించుకునే పనిలో నిమగ్నమయ్యింది. అందులో నుండి పుట్టుకొచ్చిందే ఎగిరే కార్ల అంశం... దీని గురించి పూర్తి వివరాలు....

ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరడానికి ఉబర్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన క్యాబ్‌ల విధానం ప్రపంచ వ్యాప్తంగా విజయపు బాట పట్టింది. అయితే దీనికి ఇక్కడితో పులిస్టాప్ పడకూడదనే ఆలోచనతో భవిష్యత్ రవాణా కోసం తమ వంతు ప్రయోగాలు చేస్తూనే ఉంది. అందులో ఒకటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, మరొకటి ఎగిరే కార్లు.

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌తో పాటు అనే ఆటోమేటివ్ పరిశ్రమలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మీద విసృతమైన పరిశోధనలు చేస్తున్నాయి. అందులో అద్దె కార్లను నడిపే ఉబర్ కూడా ఉంది. డ్రైవర్ రహిత కార్లు కస్టమర్లను పికప్ మరియు డ్రాప్ చేసే విధంగా అభివృద్ది చేస్తోంది.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురంచి అందరికీ తెలిసిన విషయమే, టెక్నాలజీలోని నూతన పోకడలను అందిపుచ్చుకుని ఉబర్ సరికొత్త ఎగిరే కార్ల (Flying Cars) అభివృద్ది మీద దృష్టి సారించింది.

ఉబర్ అభివృద్ది చేస్తున్న ఎగిరే కార్ల గురించి ఆసక్తికరమైన విషయాలు
ఉబర్ ఎగిరే కార్లను సింపులుగా ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లని పిలవచ్చు. ఇవి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఎనర్జీ ద్వారా ఎగురుతాయి.

నగరాల్లో ఉండే అన్ని సమతల ప్రదేశాల్లో, మైదానాలలో, భారీ అంతస్థుల మీద మరియు ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన హెలీప్యాడ్‌ల మీద నిటారుగా ల్యాండింగ్ మరియు టేకాఫ్ తీసుకోగలవు. కాబట్టి వీటి నిర్వహణకు ఎక్కువ స్థలం అవసరం ఉండదు.

ఈ ఎయిర్ క్రాఫ్ట్‌కు అమర్చిన రెక్కలను వేరు చేయడానికి వీలు లేకుండా ఫిక్స్ చేయబడి ఉంటాయి. మరియు ఈ రెక్కలు రోటార్స్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి.

ఉబర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ లైట్ వెయిట్ (తక్కువ బరువున్న) ఎయిర్ క్రాఫ్ట్‌లు సాధారణ హెలీకాఫ్టర్ల కన్నా 15 డెసిబల్స్ కన్నా తక్కువ శబ్దాన్నిస్తాయి.

ఉబర్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు ఒక్క సారి చార్జింగ్‌తో 160 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. మరియు వీటి గరిష్ట వేగం గంటకు 241 కిలోమీటర్లుగా ఉంది. అయితే వీటిని నడపడానికి ఉబర్ సంస్థ ముందుగా పైలట్లను సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

కస్టమర్లు జర్నీ బుక్ చేసుకున్న తరువాత ఆటోమేటిక్‌గా వారి వద్దకు చేరుతాయి, ఎయిర్ క్రాఫ్ట్‌లోకి ఎంటర్ అయిన తరువాత దానంతట అదే నడుపుకుంటూ గమ్యాన్ని చేరే విధంగా ఎయిర్ క్రాఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి ఉబర్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ కోరిక సిద్దిస్తుందో లేదో వేచి చూడాలి.

ప్రస్తుతం ఉన్న ప్రయివేట్ రవణా వ్యవస్థతో పోల్చుకుంటే ఉబర్ యొక్క ఆలోచన బాగానే ఉంది. కాని ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పట్టనుంది.

ఉబర్ తమ స్వంత పరిజ్ఞానంతో ఈ ఎగిరే అద్దె కార్ల (Flying Cars)ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ వాటిని ప్రవేశపెట్టే దేశాల యొక్క అనుమతులు లభించడం దాదాపుగా కస్టమే. అయితే భవిష్యత్తులో ఎగిరే కార్ల పరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుని విడుదలైతే ఉబర్ ప్లాన్ ఫలించనట్లే...

- డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
- గంటకు 600 కిమీల వేగంతో దూసుకెళ్లే రైలు : ఎక్కడో తెలుసా ?
- ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద


Click it and Unblock the Notifications








