2016-17 మధ్య దేశీయంగా విడుదల కానున్న హ్యుందాయ్ కార్లు

By Anil

భారత దేశంలో రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది హ్యుందాయ్. 1998లో దేశీయంగా తమ శ్యాంట్రో కారుతో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుండి నేటి వరకు ఉత్తమ నాణ్యత, పనితీరు ఉండేటటువంటి ఉత్పత్తులను ఎప్పటి కప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చి మారుతి సుజుకి సంస్థకు గట్టి పోటీగా నిలిచింది.

కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ వచ్చే ఏడాది లోపు ఇండియన్ మార్కెట్లోకి ఏ విధమైన ఉత్పత్తులను పరిచయం చేస్తోంది అని ఆరా తీస్తే కొన్ని అత్బుతమైన కార్లను హ్యుందాయ్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. 2016-17 మధ్య దేశీయ మార్కెట్లోకి విడుదల కానున్న హ్యుందాయ్ కొత్త కార్ల గురించి క్రింది కథనంలో....

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లోకి హ్యుందాయ్ అందించిన మోడల్ ఇయాన్. దేశీయంగా మారుతి 800 మార్కెట్‌ను విరమించుకున్న తరుణంలో వచ్చిన ఇయాన్ మంచి అమ్మకాలను సాధించింది. ఆ తరువాత మారుతి ఆల్టో 800 ను ప్రవేశపెట్టింది, అయినప్పటికీ దీని అమ్మకాల ధోరణి స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధిస్తున్నందున దీనిని ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో అందించడానికి హ్యుందాయ్ ఏర్పాట్లు చేస్తోంది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో రానున్న ఇయాన్‌లో హ్యందాయ్ వారి ఫ్లూయిడిక్ 2.0 స్ట్రక్చర్‌ ఆధారంతో డిజైన్ చేయనున్నారు, ఎక్ట్స్రీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌లకు హ్యుందాయ్ వారి డిజైన్ ఫిలాసఫీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో 814 సీసీ మరియు 998సీసీ గల ఇంజన్‌ ఆప్షన్లు రానున్నాయి.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

అయితే హ్యుందాయ్ దీనిని డీజల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను పరిచయం చేస్తే బాగుటుంది.

ధర అంచనా రూ. 3 నుండి 4.5 లక్షలు

విడుదల అంచనా 2016 అక్టోబర్ నాటికి

సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా

సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా

దేశీయంగా అందుబాటులోకి రానున్న ఎలంట్రా ఆరవ తరానికి చెందినదిగా గుర్తించవచ్చు. ముందు వైపున ఈ నూతన ఎలంట్రాలో సింగిల్ స్లాట్ ఫ్రంట్ గ్రిల్ స్థానంలో హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్‌‌ను గమనించచ్చు. దీనిని ఐదవ తరానికి తెందిన ఎలంట్రాతో పోల్చినప్పటికీ ఇంటీరియర్ పరంగా ఎంతో విశాలమైనది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

ఆరవ తరానికి చెందిన ఎలంట్రాను హ్యుందాయ్ 2015 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ప్రదర్శించింది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేశారు, ఇది సుమారుగా 147బిహెచ్‌పి పవర్ మరియు 179ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

దేశీయంగా అందుబాటులోకి రానున్న ఎలంట్రాలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.6 లీటర్ డీజల్ మరియు 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది. ఇది దేశీయంగా అందుబాటులోకి వస్తే షెవర్లే క్రూజ్ మరియు స్కోడా లారా వంటి వాటికి పోటీగా నిలవనుంది

ధర అంచనా రూ. 15 నుండి 18 లక్షలు

విడుదల అంచనా అక్టోబర్ - నవంబర్ 2016

హ్యుందాయ్ టుసాన్

హ్యుందాయ్ టుసాన్

హ్యుందాయ్ మోటార్స్ దేశీయంగా ఉన్న ఎస్‌యువి సెగ్మెంట్లోకి క్రెటా మరియు శాంటా ఫే ను అందుబాటులోకి తెచ్చింది. అందులో క్రెటా భారీ అమ్మకాలను సాధిస్తోంది. అయినప్పటికీ టుసాన్ అనే ఎస్‌యువిని విడుదల చేయడానికి సుముఖతతో ఉంది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

క్రెటా మరియు శాంటా ఫే మధ్య ఉండేట్లు దీనిని విడుదల చేయనుంది. హ్యుందాయ్ వారి మూడవ తరానికి చెందిన టుసాన్ డిజైన్ మరియు పరిమాణం పరంగా చిన్న శాంటా ఫి వాహనం వలె ఉంటుంది. అదే విధంగా డిజైన్ కోసం హ్యుందాయ్ ఫ్లూయిడిక్ స్ట్రక్చర్ 2.0 డిజైన్ తీరును వినియోగించుకోనుంది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

హ్యుందాయ్ ఈ టుసాన్ ఎస్‌యువిలో 114బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.7 లీటర్ డీజల్ ఇంజన్ మరియు 182బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 2.0 లీటర్ డీజల్ ఇంజన్‌లను అందివ్వనుంది. రెండింటిని కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లలో గేర్‌బాక్స్‌లను అందివ్వనున్నారు.

ధర అంచనా రూ. 18 నుండి 25 లక్షలు

విడుదల అంచనా 2016 చివరి నాటికి లేదా 2017 ప్రారంభం నాటికి

కొత్త తరం హ్యుందాయ్ వెర్నా

కొత్త తరం హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతం ఉన్న వెర్నాకు అప్‌డేటెడ్ వెర్షన్‌గా సరికొత్త డిజైన్ మార్పులతో నూతన తరానికి చెందిన సరికొత్త వెర్నాను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది ఎలైట్ ఐ20 ముందు వైపు రూపానికి మెరుగులు దిద్దినట్లు ఉంటుంది. దీనిని హ్యుందాయ్ మోటార్స్ 2016 బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించింది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

కొత్త వెర్నా యొక్క డిజైన్‌ను గమనిస్తే హ్యుందాయ్ ఆరా కారును తిరిగి తీసుకువస్తున్నట్లు ఉంది. ఇందులో సాంకేతికంగా 1.4 మరియు 1.6 రెండు కూడా పెట్రోల్ మరియు డీజల్ ఇంధనంతో ఆప్షనల్‌గా రానున్నాయి.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

రెండు రకాల సామర్థ్యం మరియు ఇంధన ఆప్షన్లతో రానున్న నూతన వెర్నా కారులో మ్యాన్యుల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అప్షనల్‌గా అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ధర అంచనా రూ. 8 నుండి 14 లక్షలు

విడుదల అంచనా జూన్ - జూలై 2017

హ్యుందాయ్ హెక్సా స్పేస్

హ్యుందాయ్ హెక్సా స్పేస్

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఒక్క ఎమ్‌పివి సెగ్మెంట్లోకి ఉత్పత్తులను విడుదల చేయలేదు. అయితే హెక్సా ఎమ్‌పివి కాన్సెప్ట్ పేరుతో 2012 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

హ్యుందాయ్ మోటార్స్ ఈ హెక్సాను ఐ10 వేదిక ఆధారంగా తయారు చేస్తోంది. ఇందులో 1.4 మరియు 1.6 లీటర్ ఇంజన్ ఆప్షన్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

ప్రస్తుతం ఎమ్‌పివి సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా మరియు హోండా మొబిలియోలకు పోటిగా ఉండనుంది.

ధర అంచనా రూ. 7 నుండి 10 లక్షలు

విడుదల అంచనా 2017 ప్రారంభం నాటికి

హ్యుందాయ్ కార్లినో

హ్యుందాయ్ కార్లినో

మారుతి సుజుకి సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువిలోకి విడుదల చేసిన వితారా బ్రిజా విజయాన్ని రుచించింది, అయితే ఈ సెగ్మెంట్లో ఉత్పత్తి లేక హ్యుందాయ్ దూరంగా ఉంది. అయితే వితారా బ్రిజాకు పోటీగా కార్లినోను విడుదల చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద క్రెటా ఎస్‌యువి కన్నా దిగువ స్థాయిలో ఉండే విధంగా ఈ కార్లినో వాహనాన్ని ప్రదర్శించింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ ఇంజన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

హ్యుందాయ్ మోటార్స్ దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి వాటికి పోటీగా నిలవనుంది.

ధర అంచనా రూ. 7 నుండి 10 లక్షలు

విడుదల అంచనా 2017 చివరి నాటికి/2018 ప్రారంభం నాటికి

హ్యుందాయ్ అప్ కమింగ్ కార్లు

ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి 8 కార్లు

ఇండియన్ మార్కెట్లో ఉన్న 10 ఉత్తమ ఆటోమేటిక్ కార్లు

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2016, 14:51 [IST]
English summary
Upcoming Hyundai Cars In India 2016-17
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+