ఇండియన్ మార్కెట్లోకి రానున్న మారుతి సుజుకి వారి ఎనిమిది కొత్త కార్లు
భారతదేశపు అతి పెద్ద కార్ల తయారీ దిగ్గజ మరియు అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న సంస్థ మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి అద్భుతంగా అమ్మకాలు చేపట్టే వితారా బ్రిజా మరియు బాలెనొ వంటి కార్లను అందుబాటులోకి తెచ్చింది.
మారుతి సుజుకి ఈ విజయాలతో భారతీయ వినయోగదారుల పల్స్ ఏంటో కనుక్కుంది. ఎలాంటి కార్ల ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి, ఎలాంటి వాటిని ఇండియన్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు అనే విషయాలను బాదా ఔపోసన పట్టింది. అయితే మరి మారుతి వారి భవిష్యత్ పథకం ఏమిటి ? మారుతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రానున్న 8 ఉత్పత్తులను క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

మారుతి సుజుకి ఇగ్నిస్
మారుతి తమ తరువాత ఉత్పత్తి ఇగ్నిస్ కారును పండుగ సీజన్ ప్రారంభమయ్యే అక్టోబర్-నవంబర్ 2016 మధ్యలో విడుదల చేయనుంది. సెలెరియో మరియు వ్యాగన్‌ఆర్‌లకు పైన మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు క్రింద స్థానంలో మహీంద్రా వారి కెయువి100 కు పోటీగా రానుంది.

ఇగ్నిస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
మారుతి ఈ ఇగ్నిస్‌లో 1.3 లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇది సుమారుగా 80 బిహెచ్‌పి పవర్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 75 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ధర అంచనా: 4 నుండి 6 లక్షలు
- విడుదల అందాసుగా: అక్టోబర్ - నవంబర్ 2016
- ధర అంచనా: 5.5 నుండి 8.5 లక్షలు
- విడుదల అందాసుగా: నవంబర్ - డిసెంబర్ 2016
- ధర అంచనా: 7 నుండి 10 లక్షలు
- విడుదల అందాసుగా: అక్టోబర్ - నవంబర్ 2016
- ధర అంచనా: 4.5 నుండి 6 లక్షలు
- విడుదల అందాసుగా: 2016 ఏడాది చివరినాటికి
- ధర అంచనా: 6 నుండి 7 లక్షలు
- విడుదల అందాసుగా: 2016 ఏడాది చివరినాటికి
- ధర అంచనా: 4 నుండి 5 లక్షలు
- విడుదల అందాసుగా: 2016 ఏడాది చివరినాటికి
- ధర అంచనా: 5 నుండి 8 లక్షలు
- విడుదల అందాసుగా: 2017 ఏడాదిలో ఆలస్యంగా
- ధర అంచనా: 5.50 నుండి 9 లక్షలు
- విడుదల అందాసుగా: 2017 ఏడాదిలో ఆలస్యంగా

మారుతి సుజుకి బాలెనొ ఆర్‌ఎస్
ప్రస్తుతం మారుతి వారి బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఎంతో విజయవంతంగా నడుస్తోంది. హ్యుందాయ్ ఎలైట్ ఐ20 అమ్మకాలకు ప్రత్యక్షంగా కొల్లగొడుతోంది ఈ బాలెనొ. పోటీదారులను మించి అద్భుతమైన అమ్మకాలు సాధిస్తున్న ఈ బాలెనొను మారుతి ఆర్‌ఎస్ బ్యాడ్జి పేరుతో సరికొత్త అందివ్వనుంది.

బాలెనొ ఆర్ఎస్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
బాలెనొ ఆర్ఎస్ డిజైన్ పరంగా బాలెనొని పోలి ఉన్నప్పటికీ ఇందులో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌ను అందివ్వనున్నట్లు సమాచారం. అయితే బాలెనొ ఆర్ఎస్ పేరులో ఉన్న ఆర్ఎస్ అనగా ర్యాలీ స్పోర్ట్ అనే అర్థం ఉన్నట్లు తెలిసింది.

మారుతి వితారా బ్రిజా (పెట్రోల్)
మారుతి సుజుకి కాస్త ఆలస్యంగా ఎస్‌యువిల సెగ్మెంట్లోకి అడుగుపెట్టినప్పటికీ మంచి ఆదరణే పొందింది. మారుతి ఎటువంటి ఉత్పత్తి చేసినా అది పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభ్యమయ్యేది అలాంటిది వితారా బ్రిజా కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే విడుదలయ్యింది. అయితే మారుతి ఇప్పుడు వితారా బ్రిజా ను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

వితారా బ్రిజా (పెట్రోల్) ఇంజన్ మరియు ఇతర వివరాలు
వితారా బ్రిజా పెట్రోల్ మోడల్ 1.0 లీటర్ బూస్జర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి దానినే బాలెనొలో కూడా అందివ్వనుంది. దీనితో పాటు ఈ వితారా బ్రిజాలో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందివ్వనున్నారు.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఎమ్‌పివి
మారుతి సుజుకి ఈ వ్యాగన్ ఆర్ ఎమ్‌పివిని ఎర్టిగా ఎమ్‌పివి కన్నా తక్కువ స్థానంలో విడుదల చేయనుంది. దీని ధర విషయానికి వస్తే చాలా ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పోటిదారులను బోల్తా కొట్టించే రీతిలో దీని ధరలను నిర్ణయించనుంది మారుతి.

వ్యాగన్ఆర్ ఎమ్‌పివి ఇంజన్ మరియు ఇతర వివరాలు
మారుతి ఈ వ్యాగన్‌ఆర్ ఎమ్‌పివిలో 1.0 లీటర్ పెట్రోల్ (వ్యాగన్ఆర్ లో ఉన్నది) మరియు 793 సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఇలాంటి దానినే సెలెరియోలో గుర్తించవచ్చు.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఏఎమ్‌టి
మారుతి వారి స్విఫ్ట్ ఆటోమేటిక్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. గత మే 2016 నెలలో సుమరుగా 12,355 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే నెలోల టాప్-10 అమ్మకాలలో ఐదవ స్థానంలో నిలిచింది. స్విఫ్ట్ ఇంతవరకు ఎలాంటి పోటీని ఎదుర్కోలేదు, వీరి బాలెనొ తో తప్పించి.

స్విఫ్ట్ ఆటోమేటిక్ ఇంజన్ మరియు ఇతర వివరాలు
ముందు నుండి మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అందిస్తున్న 1.3 లీటర్ ఫియట్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది, ఇది సుమారుగా 74 బిహెచ్‌పి వరకు పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

మారుతి సుజుకి ఆల్టో 800 డీజల్
మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఆల్టో 800 ను విడుదల చేసినప్పటి నుండి రికార్డు స్థాయి అమ్మకాలను సాధిస్తూనే ఉంది. అయితే రెనో వారి తాజా ఉత్పత్తి క్విడ్ వలన కొంచెం తడబడినా కూడా నెంబర్ వన్ స్థానాన్ని మాత్రం కోల్పోలేదు. అయితే ఆల్టో 800 ప్రేమికుల కోసం ఇప్పుడు దీనిని డీజల్ ఇంజన్‌లో విడుదల చేయనుంది.

ఆల్టో 800 డీజల్ యొక్క ఇతర వివరాలు
ఆల్టో 800 డీజల్ వేరియంట్ కోసం ఇందులో 793 సీసీ సామర్థ్యం ఉన్న సెలెరియోలోని డీజల్ ఇంజన్‌ను వినియోగించనున్నారు. ఇది సుమారుగా 47 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి వారికి ఉత్తమ అమ్మకాలు సాధించిపెడుతున్న వాటిలో స్విఫ్ట్ ఒకటి. మారుతి ఇప్పటికే స్విఫ్ట్ ను రెండు సార్లు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో అందించింది. ఇక ఇప్పుడు మరోసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో రానున్న సరికొత్త స్విఫ్ట్‌లో నూతన హెడ్ లైట్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, వాలు నిర్మాణం అధికంగా ఉన్న రూఫ్ డిజైన్ ఇక ఇంటీరియర్ ఫీచర్ల పరంగా చూస్తే తాకే తెర గల ఇన్పోటైన్‌మెంట్ వ్యవస్థ, మూడు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్ మరియు కొన్ని భద్రత ఫీచర్లతో రానుంది.

స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు
కొత్త తరం మారుతి స్విఫ్ట్‌లో 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ మరియు 1.3 లీటర్ సరికొత్త డీజల్ ఇంజన్ ఆప్షన్లు రానున్నాయి. ఈ ఇంజన్‌లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

సరికొత్త స్విఫ్ట్ డిజైర్
బాగా విజయవంతమయిన మారుతి వారి ఉత్తమ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్. దీనిని ఇప్పుడు నూతన శైలిలో అందించడానికి మారుతి యోచిస్తోంది. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ భారీ మార్పులతో రానుంది.

సరికొత్త స్విఫ్ట్ డిజైర్
ఇందులో ముందున్న ఇంజన్ ఆప్షన్‌లతో పాటు 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్ లేదా సరికొత్త డీజల్ ఇంజన్‌ను దీనికోసం సుజుకి అభివృద్ది చేసే ఆలోచనలో ఉంది.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వర్సెస్ ఆల్టో కె10 ఏఎమ్‌టి: దీని గురించి మరింత చదవండి
ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్‌తో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న లెక్సస్


Click it and Unblock the Notifications