ఏప్రిల్ మరియు మే మధ్య విడుదల కానున్న కొత్త కార్లు
దేశీయంగా ఉన్న చాలా వరకు వాహన తయారీ సంస్థల జాతకం చూస్తే కొత్త వాహనా పరంగా ఈ ఏడాది మంచి ఫలితాలను ఇచ్చింది అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో ఆటో ఎక్స్ పో జరగడం అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా రకాల వరకు కొత్త వాహనాలు మార్కెట్లోకి విడుదల అవడం వంటివి చూస్తే వాహనరంగానికి ఈ ఏడాది మంచి ఊతమిచ్చిందని చెప్పవచ్చు.ఇదంతా ఇంతకు ముందు కాలానికి చెందిన సమాచారం.
కాని వచ్చే రెండు నెలలు కూడా కొత్త కార్ల విడుదల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నాయి. వాహన తయారీ సంస్థల ముందస్తు సమాచారం ప్రకారం వచ్చే రెండు నెలల్లో చాలా వరకు కార్లు మార్కెట్లో విడుదల కానున్న. దీనికి చెందిన వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

టాటా టియాగో
టాటా టియాగో ప్రారంభంలో ఇది మనకు జికా పేరుతో పరిచయం అయ్యింది. ఆ తరువాత ఇది టియాగో పేరుతో స్థిరపడింది. దీనిని టాటా మోటార్స్ మార్చి 28 , 2016 న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

టాటా టియాగో
ప్రస్తుతం టాటా మోటార్స్ అందుబాటులో ఉంచిన ఇతర హ్యాచ్‌బ్యాక్ కార్ల కన్నా ఇది ఎన్నో రెట్లు ఉత్తమమైనది అని చెప్పవచ్చు.య ముఖ్యంగా రెండు రకాల ఇంజన్ ఆప్షన్లు మరియు అత్బుతమైన ఫీచర్లు దీనికి బాగా కలిసి వచ్చాయి అని చెప్పవచ్చు. దీని ధర రూ. 3.5 నుండి 5 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు.
Also Read: టాటా టియాగో ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి తెలుసుకోండి.

మహీంద్రా నువోస్పోర్ట్
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ఉన్న క్వాంటో ఎస్‌యువిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో సరికొత్త పేరుతో మార్కెట్లోకి విడుదల ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనుంది.

ఏడు మంది సౌకర్యవంతంగా ప్రయాణించే వీలున్న ఇందులో మహీంద్రా వారి ఎమ్‌హాక్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉండనుంది. మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర రూ. 5.5 నుండి 8.5 లక్షలు మధ్య ఎక్స్ షోరూమ్‌గా ఉండనుంది.
Also Read: మహీంద్రా నువోస్పోర్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

డాట్సన్ గో క్రాస్
డాట్సన్ ఇండియా గో క్రాస్ ఎస్‌యువి ద్వారా భారతీయ ఎస్‌యువిల మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. డాట్సన్ ఇంతకు ముందు ఫిబ్రవరిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ గో క్రాస్‌ను ప్రదర్శించింది.

గో ప్లస్ ఎమ్‌పివి వాహనాన్ని అభివృద్ది చేసిన ఫ్లాట్ ఫామ్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర రూ. 5 నుండి 10 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు. Also Read:
డాట్సన్ గో క్రాస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డాట్సన్ రెడి గో
డాట్సన్ ఇండియా గో క్రాస్ కారుతో పాటు చిన్న కార్ల మార్కెట్లోకి తమ రెడి గో ద్వారా ఎంటర్ కావాలని చూస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ కార్లను టార్గెట్ చేయనుంది.

మారుతి సుజుకి వారి ఆల్టో 800, హ్యుందాయ్‌కు చెందిన ఇయాన్ మరియు రెనో వారి లేటెస్ట్ ఎంట్రీలెవల్ కారు క్విడ్‌లకు ఇది పోటిగా రానుంది. మార్కెట్లోకి విడుదలయితే దీని ధర రూ. 2.5 నుండి 3.25 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చు. Also Read: డాట్సన్ రెడి గో ఇంజన్ వివరాలు మరియు ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జీప్ గ్రాండ్ చిరోకీ
జీప్ బ్రాండ్ ఈ ఏడాదిలో ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికగా మొదటిసారిగా ఇండియన్ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. అందులో ప్రస్తుతం జీప్ గ్రాండ్ చిరోకిని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే వీటిని దేశీయంగా తయారు చేయడానికి ఫియట్ ఇండియా ముందుకు వచ్చింది.

జీప్ గ్రాండ్ చిరోకీ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర రూ. 35 నుండి 45 లక్షల మధ్య ఎక్స్ షో రూమ్‌గా ఉండనుంది.
Also Read: 2016 ఇండియన్ ఆటోఎక్స్ పో వేదిక మీద జీప్ బ్రాండ్ విడుదల చేసిన ఉత్పత్తుల గురించి తెలుసుకోండి.

టయోటా క్రిస్టా
టయోటా మోటార్స్ సంస్థ ఇన్నోవా గుర్తులు పూర్తిగా చెరిపివేసి మార్కెట్లోకి క్రిస్టా పేరుతో ఎమ్‌పివిని విడుదల చేయనుంది. సాధారణంగానే ఇన్నోవా భారీ స్థాయిలో అమ్మకాలు సాధించేది. ఇక మంచి ఇంజన్ ఆప్షన్లు మరియు ఫీచర్లతో విడుదల కానున్న ఈ క్రిస్టా విడుదల అయితే అమ్మకాల స్థాయి పెరుగుతుందిని టయోటా అంచనా.

ఇంజన్, ఫీచర్లు ఈ రెండు అస్త్రాలతో అతి త్వరలో ఇండియన్ రోడ్ల మీద పరుగులు పెట్టనున్న ఈ క్రిస్టా మార్కెట్లోకి విడుదల ధర రూ. 12 నుండి 18 లక్షలు మధ్య ఎక్స్ షో రూమ్‌గా ఉండనుంది. Also Read: టయోటా ఇన్నోవా మరియు టయోటా క్రిస్టా మధ్య గల తేడాలను తెలుసుకోండి.

ఆడి ఏ4
లగ్జరీ కార్ల పరంగా అడి తమ ఏ4 కారును విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. ఆడి ఆ ఏ4 కారును గత నెలలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ఈ ఏ4 శ్రేణిలోని మునుపటి తరం కారు కన్నా ఇది ఎంతో పెద్దది మరియు శక్తివంతమైనది. ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే దీని ధర రూ. 32 నుండి 42 లక్షలు ఎక్స్ షో రూమ్‌గా ఉండవచ్చు.

ఇతర కార్లు
ఇవి కాకుండా ఫోర్డ్ వారి మస్టాంగ్, నిస్సాన్ ఎక్స్ ట్రయల్ హైబ్రిడ మరియు టాటా మోటార్స్ వారి హెక్సా వంటి కొత్త కార్లు కొంచెం ఆలస్యంగా ఈ ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

- క్రెటా కారును ఎంచుకునే ముందు ఇవి చూసుకోండి
- క్షణంలో శత్రువుల మీద దాడి చేసే భారతదేశపు రహస్య ఆయుధం 'కాళీ'


Click it and Unblock the Notifications