రానున్న 2016-17 లో విడుదల కానున్న రెనో కార్లు వివరాలు

By Anil

రెనో కార్ల సంస్థ ఇండియన్ మార్కెట్లోకి డస్టర్ ఎస్‌యువిని విడుదల చేసిన తర్వాత తిరుగులేని ఖ్యాతిని గడించింది. దీని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి దేశీయంగా ఉన్న ఎన్నో కార్ల సంస్థలు తమ పేరుతో ఒక ఎస్‌యువిని విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాయి.

రెనో సంస్థ డస్టర్‌తో మొదలు పెట్టిన విజయపు ప్రస్థానం క్విడ్ విజయంతో కొనసాగిస్తోంది. ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని రెనో సంస్థ ఇండియన్ వినియోగదారులకు మరిన్ని కొత్త ఉత్పత్తులను అందివ్వడానికి సిద్దమైంది. 2016-17 ఏడాదిలోపు దేశీయంగా విడుదల కానున్న రెనో వారి కొత్త ఉత్పత్తుల గురించి క్రింది కథనంలో....

రెనో క్విడ్ 1000సీసీ మరియు ఆటోమేటిక్

రెనో క్విడ్ 1000సీసీ మరియు ఆటోమేటిక్

రెనో విడుదల చేసిన క్వడ్ 800 సీసీ ఇప్పటి సుమారుగా 1.5 లక్షల అమ్మకాల మైలు రాయిని ఛేదించింది. దీని విజయాన్న దృష్టిలో ఉంచుకుని క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను 1000సీసీ సామర్థ్యంతో ఆటోమేటిక్ వెర్షన్‌లో అందివ్వడానికి సన్నద్దమైంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

రెనో క్విడ్ 1.0 లీటర్ వేరియంట్లో 1000సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను పరిచయం చేస్తున్నారు. ఇది సుమారుగా 70బిహెచ్‌పి పవర్ మరియు 90 నుండి 95 మధ్య ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా రెనో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు.

ధర మరియు విడుదల వివరాలు

ధర మరియు విడుదల వివరాలు

నూతన డిజైన్ సొబగులతో మరియు సరికొత్త తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థతో అందుబాటులోకి రానున్న ఈ క్విడ్ ధర రూ. 3 నుండి 4.5 లక్షల మధ్య ఉండనుంది. దీనిని 2016 ఏడాది పండుగ సీజన్‌ నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

 రెనో కప్తుర్

రెనో కప్తుర్

రెనో ఇండియా డస్టర్ విజయానికి మరింత బలాన్ని చేకూర్చడానికి డస్టర్‌ కన్నా పై స్థానంలో కప్తుర్ అనే ఎస్‌యువి తీసుకురానుంది. ఇది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టాటా వారి అప్‌కమింగ్ హెక్సా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. డస్టర్ కన్నా పై స్థానంలో ఉంటుండటం వలన ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇందులో కూడా లాక్, ఆటో మరియు 2వీల్‌డ్రైవ్ అనే డ్రైవింగ్ ఆప్షన్‌లను పరిచయం చేయనున్నారు.

ధర మరియు విడుదల వివరాలు

ధర మరియు విడుదల వివరాలు

అంతర్జాతీయంగా కూడా ఈ కప్తుర్ ఎస్‌యువని విడుదల చేయనున్నారు. ఇంజన్‌కు సంభందించి ఎలాంటి వివరాలను రెనో వెల్లడించలేదు.

  • రెనో కప్తుర్ ధర అంచన: రూ. 12 నుండి 15 లక్షల మధ్య
  • విడుదల అంచన: 2017 నాటికి
  • క్విడ్ కాంపాక్ట్ ఎస్‌యువి

    క్విడ్ కాంపాక్ట్ ఎస్‌యువి

    రెనో ఇండియా క్విడ్ విజయం నేపథ్యంలో క్విడ్ పేరుతో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. అందులో భాగంగానే హెచ్‌బిసి అనే కోడ్ పేరుతో క్విడ్ కాంపాక్ట్ ఎస్‌యువిని సిద్దం చేస్తోంది. ఇది క్విడ్‌లోని 1.0 లీటర్‌ ఇంజన్‌నే పంచుకోనుంది.

    ధర మరియు విడుదల వివరాలు

    ధర మరియు విడుదల వివరాలు

    క్విడ్ 1.0 లీటర్‌ ఇంజన్‌తో రానున్న క్విడ్ కాంపాక్ట్ ఎస్‌యువి 64-69బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయనుంది. మ్యాన్యువల్ మరియు రెనో-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    • ధర అంచనా: రూ. 4 నుండి 6 లక్షల మధ్య
    • విడుదల అంచనా: 2017 చివరి నాటికి
    • రెనో క్విడ్ కాంపాక్ట్ సెడాన్ (ఎల్‌బిసి)

      రెనో క్విడ్ కాంపాక్ట్ సెడాన్ (ఎల్‌బిసి)

      రెనో సంస్థ ఇండియన్ మార్కెట్లోని కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి క్విడ్ ఆధారిత కాంపాక్ట్ సెడాన్‌ను ఎల్‌బిసి అనే కోడ్ పేరుతో అభివృద్ది చేస్తోంది. ముఖ్యంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ మరియు హోండా అమేజ్‌లకు గట్టి పోటీని ఇచ్చే విధంగా దీనిని అభివృద్ది చేస్తున్నారు.

      • ధర: రూ. 3 నుండి 5 లక్షలు అంచనా
      • విడుదల అంచనా: 2017 నాటికి
      •  నూతన తరం రెనో డస్టర్

        నూతన తరం రెనో డస్టర్

        రెనో సంస్థకు అత్యధిక అమ్మకాలు సాధించిపెడుతున్న వాటిలో డస్టర్‌ ఒకటి. ఈ ఏడాదిలోనే డస్టర్‌ను ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కూడా విడుదల చేశారు. కాని నూతన తరం డస్టర్‌ను ఒరోచ్ అనే పేరుతో ప్రవేశపెట్టనుంది. దీని కాన్సెప్ట్‌ను సావ్ పాలో మోటార్ షోలో కూడా ప్రదర్శించారు.

        రెనో అప్‌కమింగ్ కార్లు

        ఉత్తమ మైలేజ్ ఇచ్చే విధంగా ప్రస్తుతం డస్టర్‌లో ఉన్న ఇంజన్‌ను అభివృద్ది చేయనున్నారు. దీని ధర అంచనాగ రూ. 9 నుండి 13 లక్షల మధ్య ఉండనుంది మరియు 2017 ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

        రెనో కాంపాక్ట్ ఫ్యామిలీ ఎమ్‌పివి

        రెనో కాంపాక్ట్ ఫ్యామిలీ ఎమ్‌పివి

        రెనో ఇండియా ఎమ్‌పివి సెగ్మెంట్లోకి విడుదల చేసిన లాజీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. కాని ఫ్రెంచ్‌కు చెందిన ఈ రెనో క్విడ్‌ను అభివృద్ది చేసిన సిఎమ్‌ఎఫ్-ఎ వేదికనే ఆధారంగా చేసుకుని సరికొత్త ఎమ్‌పివిని విడుదల చేయనుంది. దీని ధర రూ. 6 నుండి 8 లక్షలు అంచనాగ మరియు 2017 చివరి నాటికి లేదా 2018 ప్రారంభం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2016, 12:31 [IST]
English summary
Upcoming Renault Cars In India 2016-17
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+