టయోటా అప్ కమింగ్ కార్లు
జపాన్‌కు చెందిన టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఉత్తమ ఇంజనీరింగ్ విలువలతో మరియు అత్యంత నాణ్యతతో ఉత్పత్తులను అందివ్వడంలో సుప్రసిద్దం చెందింది. అందుకు ఉదాహరణగా 2000 సంవత్సరంలో వచ్చిన క్వాలిస్ ఎమ్‌పివి మరియు తాజాగ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షల్లో భద్రత పరంగా నాలుగు స్టార్లను పొందిన ఎటియోస్‌లు ఉన్నాయి.
ఇవే నిర్మాణ విలువలతో టయోటా ఇండియన్ మార్కెట్లోకి కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది వాటి గురించి క్రింది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

కొత్త తరం టయోటా ఫార్చూనర్
ప్రస్తుతం ఉన్నటయోటా వారి ఫార్చ్యూనర్ ఎస్‌యువి ఇండియాలో ఉత్తమ సెల్లింగ్ ఎస్‌యువిలలో ఒకటిగా ఉంది. దీని డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫేస్ లిఫ్ట్ రూపంలో కొత్త తరం ఫార్చూనర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండియాలో ఉన్న ఫార్చూనర్‌ను అభివృద్ది చేసి ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లకు అందించారు.

సాంకేతిక వివరాలు
సరికొత్త టయోటా ఫార్చూనర్ ఎస్‌యువిలో రెండు ఇంజన్ అప్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి 2.4 లీటర్ మరియు 2.8 లీటర్ జిడి డీజల్ ఇంజన్‌లు. 2.4 లీటర్ ఇంజన్ సుమారుగా 160బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను మరియు 2.8 లీటర్ ఇంజన్ సుమారుగా 177బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర మరియు విడుదల వివరాలు
ఇందులోని రెండు ఇంజన్ ఆప్షన్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు2 వీల్ డ్రైవ్ మరియు 4 వీల్ డ్రైవ్ తో రానున్నాయి.
- ధర అంచనా రూ. 23-25 లక్షలు
- విడుదల అంచనా 2016 ఏడాది చివరి నాటికి
- ధర అంచన రూ. 8 నుండి 10 లక్షలు
- విడుదల అంచనా 2017 లోపు పోటి ఇది మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సియాజ్ మరియు హోండా సిటి కార్లకు పోటీగా నిలుస్తుంది.
- ధర అంచన రూ. 8 నుండి 14 లక్షల మధ్య ఉండవచ్చు
- విడుదల అంచన 2017 మధ్య భాగానికి ఈ రష్ వాహనం 7-సీటింగ్ సామర్థ్యంతో రానుంది మరియు ఇది మారుతి సుజుకి బ్రిజా, హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ లతో పోటీగా ఉండనుంది.
- మహీంద్రా అండ్ మహీంద్రా వారి అప్ కమింగ్ కార్లు

టయోటా వియోస్
టయోటా మోటార్స్ సెడాన్ రంగంలో పెద్దగా రాణించలేకపోయింది అని చెప్పవచ్చు. కర్రోలా ఆల్టీస్ ఆశించిన విధంగానే రాణిస్తోంది. ఇక ఎటియోస్ క్యాబ్ పరంగా బాగా విజయం సాధించింది. ఇవి తప్పించి సెడాన్ పరంగా టయోటాకు మంచి ఉత్పత్తులు లేవు. సెడాన్ శ్రేణిలోకి టయోటా వియోస్‌ను తీసుకురానుంది. కర్రోలా ఆల్టిస్ మరియు ఎటియోస్ రెండింటి మధ్యలో ఉండనుంది.

టయోటా వియోస్ సాంకేతిక వివరాలు
టయోటా వియోస్ 1.5 లీటర్ ఇంజన్ 107 బిహెచ్పి పవర్ మరియు 141ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ 87బిహెచ్పి పవర్ మరయు 205ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ధర మరియు విడుదల వివరాలు
రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టయోటా రష్
టయోటా ప్రవేశించని విభాగం కాంపాక్ట్ ఎస్‌యువి, ఇందులోని టయోటా మోటార్స్ తమ రష్ వాహనం ద్వారా అడుగుపెట్టనుంది. ఆసియాలోని ఇతర మార్కెట్లో దైహట్సు రష్‌గా అమ్మకాల్లో ఉంది. చిన్న సైజు ఫార్చూనర్ రూపంలో ఉంటుంది ఈ కాంపాక్ట్ ఎస్‌యువి ఉంటుంది.

టయోటా రష్ సాంకేతిక వివరాలు
టయోటా మోటార్స్ రష్‌లో 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులోని డీజల్ ఇంజన్ కర్రోలా ఆల్టిస్‌లో కలదు, ఇది సుమారుగా 67బిహెచ్‌పి పవర్ 170ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ధర మరియు విడుదల వివరాలు



Click it and Unblock the Notifications