2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు
2016 సంవత్సరంలో వాహన సంస్థలు తమ వాహనాలను విడుదల చేయడానికి వేదికగా చేసుకుంటున్నాయి. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో వాహన సంస్థలు తమ కార్లను విడుదల చేయడానికి ముందుగానే కొన్ని తారీఖులను కూడా నిర్ణయించుకున్నాయి.
ఈ సంవత్సరంలో కాబోయే కొన్ని కార్లు గురించి ప్రత్యేకం కథనం, ఇక్కడ ప్రతి కారుకు సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారం ఇవ్వడం జరిగింది.

మహీంద్రా కెయువి1OO
మహీంద్రా వారు కెయువి1OO హ్యాచ్‌బ్యాక్ కారును జనవరి 15, 2016 విడుదలకు పూర్తి ఏర్పాట్లు చేశారు. టియువి తరువాత వచ్చిన మోడల్ మహీంద్రా కెయువి 1OO.దీని కోసం దేశ వ్యాప్తంగా చాలా ఎదురుచుస్తూనే ఉన్నారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. ఇవి వరుసగా 82 మరుయు 77 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయగలవు.
- మహీంద్రా కెయువి1OO ధర దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఉండవచ్చు.
- టాటా జికా ధర దాదాపుగా రూ. 4 లక్షల వరకు ఉండవచ్చు.
- డాట్సన్ రెడి గో కారు ధర దాదాపుగా రూ. 3 లక్షల వరకు ఉండవచ్చు.
- వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ ధర దాదాపుగా రూ. 22 లక్షల వరకు ఉండవచ్చు.
- రెనో డస్టర్ ఫేస్ లిఫ్ట్ కారు ధర దాదాపుగా రూ. 8.5 లక్షలు వరకు ఉండవచ్చు.
- సరికొత్త టయోటా ఇన్నోవా ధర దాదాపుగా రూ. 10.5 లక్షల వరకు ఉండవచ్చు.
- టాటా హెక్సా ధర దాదాపుగా రూ. 13.5 లక్షల వరకు ఉండవచ్చు.
- మారుతి సుజుకి వైబిఎ(వితారా బ్రీజ్) ధర దాదాపుగా రూ. 5 లక్షల నుండి ప్రారంభం కానుంది.
- హోండా బిఆర్-వి ధర దాదాపుగా రూ. 7.5 లక్షల వరకు ఉండవచ్చు.
- శాంగ్ టివోలి ధర దాదాపుగా రూ. 8 లక్షల వరకు ఉండవచ్చు.
- హ్యుందాయ్ ఎలంట్రా ఫేస్ లిఫ్ట్ ధర దాదాపుగా రూ. 14.5 లక్షల వరకు ఉండవచ్చు.
- టాటా జికా సెడాన్ ధర దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఉండవచ్చు.
- వోక్స్‌వ్యాగన్ అమియో ధర దాదాపుగా రూ. 7 లక్షల వరకు ఉండవచ్చు.
- మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ కారు ధర దాదాపుగా రూ. 9.5 లక్షల వరకు ఉండవచ్చు.
- ఫోర్డ్ ఎండీవర్ ధర దాదాపుగా రూ. 29 లక్షల వరకు ఉండవచ్చు.
- జీప్ వ్రాంగ్లర్ ధర దాదాపుగా రూ. 20 లక్షల వరకు ఉండవచ్చు
- జీప్ గ్రాండ్ చిరోకీ ధర దాదాపుగా రూ. 40 లక్షల వరకు ఉండవచ్చు.
- మెర్సిడెస్ బెంజ్ జియల్‌ఇ 450 ఎయమ్‌జి ధర దాదాపుగా రూ. 1.25 కోట్లుగా ఉండవచ్చు.
- ఆడి ఎ4 ధర దాదాపుగా రూ. 32 లక్షలు గా ఉండవచ్చు.
- స్కోడా సూపర్బ్ ధర దాదాపుగా 23 లక్షల వరకు ఉండవచ్చు.
- మెర్సిడెస్ బెంజ్ జియల్‌ఎస్ ధర దాదాపుగా రూ. 1.70 కోట్లుగా ఉండవచ్చు.
- నిస్సాన్ జిటి-ఆర్ ధర దాదాపుగా రూ. 1.75 కోట్లు వరకు ఉండవచ్చు.
- ఫోర్డ్ మస్టాంగ్ ధర దాదాపుగా రూ. 50 లక్షలు వరకు ఉండవచ్చు.

టాటా జికా
టాటా మోటార్స్ వారి దశ తిరిగే రోజులు వచ్చాయని దీనిని చూడగానే చెప్పవచ్చు. టాటా బోల్ట్ కన్నా కొంచెం తక్కువ స్థాయిలో విడుదల కానున్న ఈ కారును టాటా మోటార్స్ వారు ఇపుడు విడుదలకు సర్వం సిద్దం చేసుకున్నారు. ఇందులో 84 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 69 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల డీజల్ ఇంజన్ అందుబాటులో ఉండనుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో రానున్నాయి.

డాట్సన్ రెడి గో
డాట్సన్ రెడి గో కారును ఈ జనవరిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో క్విడ్ కార్లకు పోటిగా నిలవనుంది. ఇందులో 800సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. మరియు దీనిని అతి త్వరలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో అందివ్వనున్నారు.

వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ
వోక్స్‌వ్యాగన్ మోటార్స్ వారు ఈ పోలో జిటిఐ కారును 2015 ఫ్రాంక్ ఫర్ట్‌లో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించింది. అయితే దీనిని 2016 సంవత్సరం మద్య భాగాని భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనిని మన రోడ్ల మీద విజయవంతంగా పరీక్షించారు కూడా. ఇందులో 1.8-లీటర్ టియస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 189 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

రెనో డస్టర్
రెనో వారు విడుదల చేసిన డస్టర్ కారు 2015 లో ఉత్తమ అమ్మకాలు నమోదు చేసుకుంది. దీని వలన ఈ సెగ్మెంట్లో ఉత్తమ అమ్మకాలు నమోదు చేసుకున్న కారు కూడా ఇది పేరు గాంచింది. అయితే రెనో మోటార్స్ వారు ఈ డస్టర్ కారును ఫేస్ లిఫ్ట్ ఆప్షన్‌లో భారతీయ మార్కెట్లోకి అందివ్వనుంది. రెనో డస్టర్ ఫేస్ లిఫ్ట్ కారులో 102 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 84 బిహెచ్‌పి,108 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఇందులో కలవు.

టయోటా ఇన్నోవా
టయోటా మోటార్స్ వారు అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన కారును ఇన్నోవా. అయితే ఈ ఇన్నోవాకు కొన్ని మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే ఈ సరికొత్త ఇన్నోవా కారు ను 2016 విడుదల చేయడానికి టయోటా మోటార్స్ వారు సర్వం సిద్దం చేసుకున్నారు. ఈ సరికొత్త ఇన్నోవా కారులో 147 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగల 2.4-లీటర్ డీజల్ ఇంజన కలదు. దీనిని 2016 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

టాటా హెక్సా
టాటా మోటార్స్ వారి మరొక మోడల్ హెక్సా. దీని ఈ ఏడాది ఆగష్టులో విడుదల చేయనున్నట్లు తెలిసింది. టాటా హెక్సా యమ్‌పివి కారులో 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 154 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలవు.

మారుతి సుజుకి వైబిఎ ( వితారా బ్రీజ్)
మారుతి సుజుకి భారతీయ మార్కెట్లోకి యస్‌యువి కారును అందించాలని ఎప్పటి నుండో కళలు కంటోంది. ఈ సంవత్సరం అది తీర నుంది. మారుతి సుజుకి వైబిఎ అంటే వితారా బ్రీజ్ పేరు మీదుగా మార్కెట్లోకి ఈ ఏడాది జూలై నెలలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో స్విఫ్ట్ కారులో గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందివ్వనుంది.

హోండా బిఆర్-వి
జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఈ బిఆర్-వి కారు విడుదలతో కాంపాక్ట్ యస్‌యువి సెగ్మెంట్లోకి చేరిపోయింది, హోండా మోటార్స్ వారు దీనిని 2016 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఈ బిర్-వి కారు 1.5-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ మరియు 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించనుంది.

శాంగ్‌యాంగ్ టివోలి
భారతీయ మార్కెట్లోకి శాంగ్‌యాంగ్ మోటార్స్ వారు రెండవ మోడల్ గా ఈ టివోలి కారును అందిస్తున్నారు. దీనిని 2016 ద్వితియార్థంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి యస్-క్రాస్, రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు పోటి గా నిలవనుంది.

హ్యుందాయ్ ఎలంట్రా ఫేస్ లిఫ్ట్
కొరియాకు చెంది హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేయనున్న ఎలంట్రా ఫేస్ లిఫ్ట్ కారును 2015 దుబాయ్‌లో జరిగిన మోటార్ షో లో ప్రదర్శించారు. దీనిని ఇండిన్ మార్కెట్లోకి 2016 మద్య భాగానికి తీసుకురానున్నారు. ఇందులో 1.6-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు అందుబాటులో కలవు.

టాటా జికా సెడాన్
టాటా మోటార్స్ వారు కైట్ అనే కోడ్ పేరుతో పరిచయం చేసిన ఈ టాటా జికా సెడాన్ కారును 2016 ఆగష్టులో విడుదల చేయనున్నారు. ఇది మార్కెట్లోకి విడుదల అయితే హోండా అమేజ్, హ్యుందాయ్ జెంట్ మరియు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారుకు పోటిగా నిలవనుంది. జికా కారులోని ఇంజన్ ఆప్షన్ లు ఇందులో ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ అమియో
వోక్స్‌వ్యాగన్ నుండి వస్తున్న కాంపాక్ట్ సెడాన్ కారు డిజైన్ పరంగా పోలో మరియు వెంటో కార్ల ద్వారా ప్రేరణ పొందింది. దీనిని 2016 ఫిబ్రవరిలో మార్కెట్లకి విడుదల చేయనున్నారు. ఈ వోక్స్‌వ్యాగన్ అమియో కారులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు అందుబాటులో కలవు.

మహీంద్రా వెరిటో(ఎలక్ట్రిక్)
మహీంద్రా వారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను అందివ్వడంలో నిమగ్నం అయ్యారు. అందులో భాగంగానే ఈ సరికొత్త వెరిటో ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని 2016 లో జరిగే ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించనున్నారు.

ఫోర్ట్ ఎండీవర్
భారత్‌లో ఇప్పుడిప్పుడే యస్‌యువి కార్ల మధ్య పోటి తీవ్రమైంది. ఈ పోటిలోకి ఫోర్ట్ మోటార్స్ వారు తమ ఎండీవర్ కారుతో ప్రవేశించింది. దీనిని ఈ జనవరి నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో 2.2-లీటర్ మరియు 3.2-లీటర్ కెపాసిటి గల 4X4 వేరింట్ డీజల్ ఇంజన్‌లు అందుబాటులో కలవు.

జీప్ వ్రాంగ్లర్
భారతీయ మార్కెట్లోకి రెండు జీపులు రానున్నాయి. వీటిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించనున్నారు. ఇవి మార్కెట్లో ఉన్న లగ్జరీ యస్‌యువి లకు గట్టి పోటిని ఇవ్వను న్నాయి. ఈ రెండు కూడా 2.8-లీటర్ డీజల్ మరియు 3.6-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్‌తో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

జీప్ గ్రాండ్ చిరోకీ
భారతీయ మార్కెట్లోకి రెండవ ఉత్పత్తిగా అమెరికాకు చెందిన సంస్థ విడుదల చేస్తున్న మోడల్ జీప్ గ్రాండ్ చిరోకీ . ఇందులో 3.0-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్ ఇంజన్ కలదు. ఇది 237 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయగలదు.

మెర్సిడెస్ బెంజ్ జియల్‌ఇ 450 ఎయమ్‌జి
మెర్సిడెస్ ఉన్నట్లుండి 2015 లో 15 మోడల్స్‌ను ఉత్పత్తి చేసింది. అయితే ఈ కొత్త సంవత్సరంలో మెర్సిడెస్ బెంజ్ జియల్‌ఇ 450 ఎయమ్‌జి కారును 2016 జనవరి 12 న విడుదల చేయనున్నారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 362 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

న్యూ ఆడి ఎ4
2016 సంవత్సరంలో కొంచెం ఆలస్యంగా విడుదల చేయడనికి ఆడి తన ఎ4 కారును సిద్దం చేసుంకుంటోంది.ఇది ఏకంగా నాలుగు పెట్రోల్ మరియు మూడు డీజల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఆడి ఎ4 ఫేస్ లిఫ్ట్ కారును 2015 లో జరిగిన ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షో లో ప్రదర్శించారు.

స్కోడా సూపర్బ్
స్కోడా మోటార్స్ వారు భారత్‌లోకి ఫ్లాగ్ షిప్ మోడల్ క్రింద స్కోడా సూపర్ కారను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని 2016 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఇందులో 1.8-లీటర్ టియస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్ లు కలవు. ఇవి వరుసగా 158, 138వ బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జియల్‌ఎస్
జియల్‌ఎస్ కారు మెర్సిడెస్ బెంజ్ సంస్థ యొక్క ఫ్లాగ్ షిప్ యస్‌యువి మోడల్. దీనిని మెర్సిడెస్ బెంజ్ వారు గత ఏడాది నవంహబర్‌లో ప్రవేశ పెట్టారు. దీనిని 2016 మధ్య భాగానికి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇది మూడు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానుంది.

నిస్సాన్ జిటి-ఆర్
నిస్సాన్ మోటార్స్ వారు ఎంతో కాలంగా భారతీయ మార్కెట్లోకి జిటి-ఆర్ స్పోర్ట్స్ కారును విడుదల చేయాలని అలోచిస్తోంది. అయితే దీనిని 2016 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారులో ట్విన్ టర్బో ఛార్జ్‌డ్ 3.6-లీటర్ వి6 ఇంజన్ కలదు ఇది 542 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తోంది.

ఫోర్ మస్టాంగ్
ఫోర్డ్ మోటార్స్ వారు భారతీయ మార్కెట్లోకి మస్టాంగ్ కారును విడుదల చేయడానికి అన్ని సిద్దం చేసుకుంది. దీనిని 2.3-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ కలదు ఇది 310 బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5.0-లీటర్ వి8 ఇంజన్ కలదు ఇది 400 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








