టయోటా ఇన్నోవా క్రిస్టాలో మరో వేరియంట్: వెంచురర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా విడుదల చేసిన ఇన్నోవా క్రిస్టా వేరియంట్ యొక్క తరువాత లెవల్ మోడల్‌గా పరిగణించబడుతున్న వేరియంట్ ఇన్నోవా వెంచర్.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి తమ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి వాహనాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి తరువాత లెవల్ వేరియంట్‌గా చెప్పుకునే మరో వాహనం ఇన్నోవా క్రిస్టా వెంచురర్ అనే పేరుతో నెట్టింట్లో తెగ అలజడి సృష్టిస్తోంది.

ఇప్పటికి ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి విడుదల ఎమ్‌పివి సెగ్మెంట్‌ను పూర్తిగా తన వశం చేసుకున్న టయోటా ఇప్పుడు క్రిస్టాకు కొనసాగింపుగా మరో మోడల్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు రహస్యంగా విడుదలయిన చిత్రాలు చెబుతున్నాయి.

అయితే ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక తెలిపిన వివరాల మేరకు ఇది ఇండోనేషియాకు చెందిన మోడల్ అని తెలిసింది. మరి ఇండియాలో ఉన్న ఇన్నోవా క్రిస్టా మోడల్‌కు టాప్ ఎండ్ వేరియంట్‌గా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ వర్గాల అభిప్రాయం.

రహస్యంగా విడుదలైన చిత్రాలను గమనిస్తే దాదాపుగా ఇండియన్ స్పెక్ ఇన్నోవా క్రిస్టాను పోలి ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న అప్‌డేట్స్‌కు గురైందని చెప్పవచ్చు. ఇన్నోవా క్రిస్టా వెంచురర్ ప్రత్యేకమైన ఎక్ట్సీరియర్ పెయింటింగ్‌ను కలిగి ఉంది.

నల్లటి షేడ్ గల క్రోమ్ క్లాడింగ్ బాడీ చుట్టూ కలదు, ఎక్ట్సీరియర్‌లోని దాదాపు అనేక ప్రదేశాలలో క్రోమ్ పరికరాలను గుర్తించవచ్చు. ప్రత్యేకించి. హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సొబగులను గమనించవచ్చు.

సాధారణ మోడల్ కన్నా టాప్ ఎండ్ వేరియంట్ కాస్త విభిన్న డిజైన్‌తో వచ్చింది. క్రిస్టా వెంచురర్ ప్రక్క వైపుల విభిన్నమైన డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్ కలవు.

ఇంటీరియర్ పరంగా డ్యూయల్ టోన్ సీట్లతో పాటు ఈ ఎమ్‌పివిలో అనేక అదనపు ఫీచర్లను పరిచయం చేయడం జరిగింది. స్టాండర్డ్ వేరియంట్లో ఉన్న ఫీచర్లన్నింటి జోడింపుతో దీనిని అభివృద్ది చేశారు.

వెంచురర్‌గా పిలువబడే ఈ మోడల్‌లో లభించే ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించలేదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా ముందుగా ఇండోనేషియా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. తరువాత విభిన్న అంతర్జాతీయ విపణులను చేరనుంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా వెంచురర్ ఇంటీరియర్ చిత్రం...

- హెక్సా విడుదల, బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలను వెల్లడించిన టాటా
- ఆరు ఎయిర్ బ్యాగులు గల అత్యంత చౌకైన కారు...


Click it and Unblock the Notifications








