రెండు రోజుల్లో 5,600 బుకింగ్స్ నమోదైన మారుతి సుజుకి వితారా బ్రిజా

By Anil

మారుతి సుజుకి ఈ వారంలో తమ వితారా బ్రిజాను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి చెందిన బుకింగ్స్ ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే వినియోగదారుల నుండి విశేషమైన ప్రజాదరణన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 5,600 వితారా బ్రిజా బుకింగ్స్ నమోదయ్యాయి.

మారుతి సుజుకి వితారా బ్రిజాకు చెందిన ప్రత్యేకమైన సమాచారం క్రింది శీర్షికలో కలదు.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిని గ్లోబల్ సి ఫ్లాట్ ఫామ్ మీద రూపొందించారు. అయితే దీనిని పూర్తిగా స్వదేశీయ ఇంజనీర్లు అభివృద్ది చేశారు.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

ఈ మోడల్‌లో దాదాపుగా 98 శాతం దేశీయంగా తయారైన విడి భాగాలను వినియోగించుకోనున్నారు. తద్వారా దీనిని 6.99 లక్షలు ప్రారంభ ధరతో అందివ్వడానికి ఎంతో సుగమయం అయ్యింది అని చెప్పవచ్చు.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

వితారా బ్రిజా ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.99 లక్షలు మొదలుకొని టాప్ ఎండ్ వేరియంట్ అయిన జడ్‌డిఐ ప్లస్ ధర రూ. 9.68 లక్షల వరకు ఉంది.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

ప్రస్తుతం మార్కెట్లోకి ఇప్పటి వరకు ఏవిధమైన పోటి లేకుండా మంచి అమ్మకాలు సాగిస్తున్న ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వారి టియువి300 లకు గట్టి పోటిగా మార్కెట్లోకి వచ్చింది. దీని రాకతో వీటి పరిస్థి ఆగమ్యగోచరమే....!

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

వితారా బ్రిజా‌లో కొన్ని అత్భుతమైన ఫీచర్లు: ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు, ఆటోమేటిక్ హెడ్ లైట్, వర్షం వస్తే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు, తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా కలదు.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

నాలుగు మీటర్లు సెగ్మెంట్లో మంచి ఆటవిడుపుతో వచ్చిన వితారా బ్రిజా ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం లీటర్‌కు 24.3 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇస్తుంది.

 48 గంటల్లో 5600 వితారా బ్రిజా బుకింగ్స్

మీరు బాగా గమనించినట్లయితే మారుతి సుజుకి తమ స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్‌ లను రంగరించి తయరు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ వితారా బ్రిజా. అయితే వితారా బ్రిజాతో మారుతి మరొక కొత్త శకాన్ని ప్రారంభించగలదని మా అభిప్రాయం.

వార్తల్లో వితారా బ్రిజా

మారుతి సుజుకి మార్చి 8, 2016న మార్కెట్లోకి వితారా బ్రిజా ఎస్‌యువిని పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా విడుదల చేసింది.

వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం

వార్తల్లో వితారా బ్రిజా

మారుతి సుజుకి ఫిబ్రవరి నెల మొదటి వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ వితారా బ్రిజా ఎస్‌యువిని ప్రదర్శించింది. అప్పుడు దీనికి చెందిన ఫోటోలు....

వితారా బ్రిజా ను ప్రదర్శించిన మారుతి సుజుకి : ఫోటోలు (గ్యాలరీ)

 మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీకోసం......
  • దక్షిణ భారత సినీ తారల ఖరీదైన కార్లు: దుమ్ములేపిన తెలుగు సెలబ్రిటీలు
  • భారతీయ రోడ్ల మీద డ్రైవ్‌ చేస్తున్నారా అయితే ఇవి గమనించండి !
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం...!!

Article Published On: Saturday, March 12, 2016, 11:27 [IST]
English summary
Maruti Suzuki Vitara Brezza Bags 5600 Bookings In 2 Days
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+