బిఎమ్‌డబ్ల్యూ ఐ3 కారుకు పోటీని తయారు చేస్తోన్న వోక్స్‌వ్యాగన్
జర్మనీకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ వారి మోసపూరిత డీజల్ ఉద్గార పరీక్షల కుంభకోణంలో ఇంకా ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ వారి డీజల్ కార్ల కొనుగోళ్లు కూడా క్షీణిస్తున్నాయి. అయితే వోక్స్‌వ్యాగన్ ఈ అంశాన్ని పూర్తిగా పక్కకు నెట్టి ఉద్గార రహిత ఎలక్ట్రిక్ కార్లకు శ్రీకారం చుట్టింది. ఎంతలా అంటే బిఎమ్‌డబ్ల్యూ వారి ఐ3 కారుకే పోటీగా తమ ఉత్పత్తి రూపొందిస్తోంది.

ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లలో బిఎమ్‌డబ్ల్యూ వారి ఐ3 కారుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది అచ్చం ఇలాంటి కారుకే వోక్స్‌వ్యాగన్ ఎన్‌యువిఇ (NUVe) అనే పేరుతో రూపొందిస్తోంది. దీనిని 2016 అక్టోబర్‌లో జరిగే ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించనుంది.
వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాస్ వేగాస్ లో జరిగిన 2016 కన్జ్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో బడ్‌ఇ (BUDDe) కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఈ బడ్‌ఇ కాన్సెప్ట్‌ను ఎమ్ఇబి (మాడ్యులర్ ఎలక్ట్రిఫికేషన్ కిట్) ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చేసింది. ఇదే వేదిక మీద ఈ సరికొత్త ఎన్‌యువిఇ (NUVe) కూడా అభివృద్ది చేస్తోంది.
చదునైన సమతలం కలిగిన బ్యాటరీల ద్వారా తక్కువ ప్రదేశంలో బ్యాటరీలను అమర్చవచ్చు, ఇందు కోసం ఈ ఎమ్‌ఇబి ఫ్లాట్ ఫామ్ ఎంతో ప్రత్యేకం. బిఎమ్‌డబ్ల్యూ వారి ఐ3 కారుకు పోటీగా రానున్న ఈ ఎన్‌యువిఇ (NUVe) ఎలక్ట్రిక్ కారు 2019 నాటికి ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ వారి షోరూమ్ లను తాకనున్నాయి.
Also Read: ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్ కాదు: AP లోని ఒక APSRTC బస్టాండ్


Click it and Unblock the Notifications


















