వోక్స్‌వ్యాగన్ పస్సాట్ "సీసీ" టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు
వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ నెక్ట్స్ జనరేషన్ నాలుగు డోర్ల కూపే ను అభివృద్ది చేస్తోంది. ప్రస్తుతం దీనికి రహదారి పరీక్షలను రహస్యంగా నిర్వహిస్తున్నారు. ఈ కూపేకు వోక్స్‌వ్యాగన్ సీసీ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

వోక్స్‌వ్యాగన్ ఈ సీసీ కూపే కారును 2015 లో ప్రదర్శించబడిన స్పోర్ట్ కూపే కాన్సెప్ట్ జిటిఇ ప్రభావంతో రూపొందించారు. అయితే దీని బాడీ డిజైన్‌ను వర్ణించడానికి ఏ మాత్రం కనబడకుండా పూర్తిగా కప్పివేసారు. కాని దీనిని పొడవైన రూఫ్ మరియు బాడీతో డిజైన్ చేశారు.
Also Read: మీ ఇంట్లో కూర్చునే కేవలం నిమిషాల వ్యవధిలో మీ కారు ఇన్సూరెన్స్ చేసుకోండి
వోక్స్‌వ్యాగన్ ఈ సీసీ కూపేను నాలుగు లేదా ఐదు సీటింగ్ సామర్థ్యంతో డిజైన్ చేస్తున్నారు. ముందు వైపున ఉన్న హెడ్ లైట్లు చాలా విభిన్నంగా డిజైన్ చేయబడ్డాయి.

ఈ సీసీ కూపేను అభివృద్ది చేయడానికి పస్సాట్ సీసీ కి వినియోగించిన అదే ఫ్లాట్‌ఫామ్‌ను వినియోగించారు. ఇక పస్సాట్ సీసీ లోని ఇంజన్‌నే ఇందులో కూడా అందిస్తున్నట్లు సమాచారం. యూరోపియన్ మార్కెట్లో ఇది డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్‌లతో లభించనుండగా అమెరికాలో మాత్రమం స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.



Click it and Unblock the Notifications








