హ్యుందాయ్ క్రెటాకు పోటీని రూపొందిస్తున్న వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ గ్రూపు అతి త్వరలో తమ ఎస్‌యువిలను పరిచం చేయనుంది. దేశీయంగా ఎస్‌యువి మార్కెట్ ఊపందుకుంటున్న నేపథ్యంలో సుమారుగా 9 వరకు ఎస్‌యువిలను అభివృద్ది చేయడానికి వోక్స్‌వ్యాగన్ పథకం వేస్తోంది. వీటిని వోక్స్‌వ్యాన్ లేదా స్కోడా బ్యాడ్జి పేరుతో అందుబాటులోకి తీసుకురానుంది.
వోక్స్‌వ్యాగన్ ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో బాగా విజయం సాధించిన హ్యుందాయ్ వారి క్రెటా కాంపాక్ట్ ఎస్‌యువి పోటీగా ఎస్‌యువిని అభివృద్ది చేయనుంది.

వోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ క్రెటాకు పోటీగా తీసుకురానున్న వాహనాన్ని జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన టి-క్రాస్ కాన్సెప్ట్ ఆధారంతో అతి త్వరలో రానున్న నెక్ట్స్ జెన్ వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేస్తున్న ఎమ్‌క్యూబి ఏఒ వేదికను వినియోగించుకోనుంది.
Also Read: టాప్-10 సెల్లింగ్ కార్లలో పెను మార్పులు: తగ్గిన మారుతి కార్ల ప్రభావం
కొత్త అంతర్జాతీయంగా రానున్న ఎస్‌యువి 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు ఇండియన్ మార్కెట్ కోసం రానున్న ఎస్‌యువిలో 112బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ మరియు 117బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజల్ ఇంజన్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: టయోటా అప్ కమింగ్ కార్లు
ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌ల కోసం వోక్స్‌వ్యాగన్ తమ టి-క్రాస్ మరియు టి-క్రాస్ బ్రీజ్ కాన్సెప్ట్‌లను డిజైన్ ఫీచర్ల కోసం వినియోగించుకోనుంది. వోక్స్‌వ్యాగన్ ఈ నూతన ఎస్‌యువిని దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తే ప్రారంభ ధర రూ. 10 లక్షలుగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








