వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ విడుదల: ధర రూ. 7.51 లక్షలు

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి పోలో ఆల్‌స్టార్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసింది. పోలో శ్రేణిలో టాప్ ఎండ్ వేరియంట్లో నిలిచిన దీని ప్రారంభ ధర రూ. 7.51 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ ధర వివరాలు

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ ధర వివరాలు

  • వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ పెట్రోల్ ధర రూ. 7.51 లక్షలు
  • వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ డీజల్ ధర రూ. 9.07 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్‌గా ఉన్నాయి.
వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

అధిక ఫీచర్లు మరియు కాస్మొటిక్ సొబగులతో విడుదలైన ఈ పోలో ఆల్‌స్టార్ ను ఎంచుకోవాలంటే సాధారణ పోలో కన్నా రూ. 30,000 రుపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

ఎక్ట్సీరియర్ పరంగా చోటు చేసుకున్న మార్పులలో హెడ్ ల్యాంప్స్‌ను కడిగే వాషర్‌తో పాటు ఎల్ఇడి హెడ్ లైట్లు, మరియు 15-అంగుళాల 20 స్పోక్స్ గల అల్లాయ్ వీల్స్ కలవు.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

సరికొత్త ఆల్‌స్టార్ లిమిటెడ్ ఎడిషన్‌ను సాధారణ పోలో తో పోల్చినపుడు విభినంగా కనబడటానికి కారులోని బి-పిల్లర్ మీద అల్‌స్టార్ పేరుతో బ్యాడ్జింగ్ అందించారు.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ ఇంటీరియర్‌లో సరికొత్త ఫ్యాబ్రిక్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రేని అందించారు. సీట్లకు మధ్యలో కాస్త విభిన్నమైన రంగులో ఉన్న పట్టీని అందించారు.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్ లోని పెడల్స్‌ను పూర్తిగా మెటల్ తో ఫినిష్ చేసారు. ఫుట్ వెల్ ల్యాంప్, స్కఫ్ ప్లేట్ బేరింగ్ మీద ఆల్‌స్టార్ బ్యాడ్జింగ్ కలదు.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

వోక్స్‌వ్యాగన్ వెంటో లో ఉన్నటువంటి సెంటర్ ఆర్మ్ రెస్ట్ మరియు రియర్ ఏ/సి వెంట్‌లు ఆల్‌స్టార్ లో కలవు.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

సాంకేతికంగా ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ పోలో ఆల్‌స్టార్

అదే విధంగా ఆల్‌స్టార్ లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

English summary
Volkswagen Polo AllStar Launched In India; Prices Start At Rs. 7.51 Lakh
Story first published: Monday, November 14, 2016, 10:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos