ఆటో ఎక్స్‌పో వేదిక మీద పోలో జిటిఐ ను ప్రదర్శించనున్న వోక్స్‌వ్యాగన్
వోక్స్‌వ్యాగన్ ఇండియా ఫిబ్రవరిలో జరిగే 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో తమ ప్రీమియమ్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు పోలో జిటిఐను ప్రదర్శించాలనే సమాలోచనలో ఉంది. అంతే కాకుండా దీనితో పాటు ఇంకా మూడు మోడళ్లను కూడా ఎక్స్‌పో వేదిక మీదకు తీసుకురానుంది.
వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ సరికొత్త పోలో జిటిఐ మోడల్‌ను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. వోక్స్‌వ్యాగన్ వారు తమ చకన్ ప్లాంటును నుండి ఈ జిటిఐ కారును భారతీయ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

ఇంజన్
వోక్స్‌వ్యాగన్ పోలో జిటిఐ కారులో 1.8-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 189.30 బిహెచ్‌పి పవర్ మరియు320 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

డిఎస్‌జి గేర్ బాక్స్
ఇందులో గల ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి గేర్ బాక్స్‌ను కలగి ఉంది. అయితే వోక్స్‌వ్యాగన్ వారు ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వలేకపోయారు.

గరిష్ట వేగం
పోలో జిటిఐ అత్యధికంగా 236 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోగలదు. మరియు ఇది కేవలం 6.7 సెకండ్ల కాలంలో గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
పోలో జిటిఐ అత్యధికంగా లీటర్‌కు 8.85 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

కంప్లీట్లి నాక్డ్ డౌన్ (సికెడి) ఆప్షన్
వోక్స్‌వ్యాగన్ వారి ఉత్తమ పని తీరు కనబరిచే ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారు పోలో జిటిఐ భారతీయ మార్కెట్లోకి కంప్లీట్లి నాక్డ్ డౌన్ (సికెడి) ఆప్షన్‌తో రానుంది.

ధర
వోక్స్‌వ్యాగన్ వారి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ పోలో జిటిఐ ధర దాదాపుగా రూ. 20 లక్షలు కన్నా ఎక్కువగా ఉండవచ్చు.

ఇతర మోడళ్లు
దీనితో పాటు వోక్స్‌వ్యాగన్ ఇండియా ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఇంకా మూడు మోడళ్లను ప్రదర్శించనుంది.
- అమియో కాంపాక్ట్ సెడాన్
- టైగన్ ప్రీమియమ్ ఎస్‌యువి
- పస్సాట్ జిటిఐ కార్లు.
- మహీంద్రా కెయువి100 ఫోటోలు: తనివితీరా చూసుకోండి....!!
- రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది
- ఆటో ఎక్స్ పోలో పోటికి సిద్దమైన సరికొత్త టయోటా ఇన్నోవా



Click it and Unblock the Notifications