భారీ స్థాయిలో రీకాల్‌కు గురైన వోక్స్‌వ్యాగన్ వెంటో డీజల్ కార్లు
వోక్స్‌వ్యాగన్ కార్ల సంస్థ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన కార్లలో సుమారుగా 3,877 వెంటో సెడాన్ డీజల్ కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లు అధిక స్థాయిలో కార్బన్ మోనాక్సైడ్ వాయును విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.

జర్మనీకు చెందిన వోక్స్‌వ్యాగన్ కార్ల తయారీ సంస్థ ఇండియాలో అందుబాటులో ఉంచిన 1.5-లీటర్ డీజల్ ఇంజన్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్న కార్లను రీకాల్ చేసింది. ప్రాణాంతకమైన వాయువులను విడుదల చేస్తున్న కారణంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది.
Also Read: మారుతి సుజుకి వితారా బ్రిజా వెయిటింగ్ పీరియడ్ 4-5 నెలలు
ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ ఇంజనీర్ల బృందం ఈ సమస్య వెనుకున్న కారణం వెతుకుతున్నారు. త్వరలోనే దీని ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌లను పరీక్షల కోసం ఏఆర్‌ఏఐ కు పంపనున్నారు. ఎందుకైనా మంచింది దీనికి సంభందించి మరింత సమాచారం వచ్చేంత వరకు వేచి చూడండి. తరువాత మాత్రమే వీటిని కొనుగోలు చేయండి.


Click it and Unblock the Notifications








