టూ వీలర్లతో పాటు కార్లను కూడా ఉత్పత్తి చేయనున్న యమహా

జపాన్ ఆధారిత యమహా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ కార్లను తయారు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. యమహా ఇప్పటికే మోటార్ సైకిల్ ఆధారిత స్పోర్ట్స్ కారును రూపొందించింది.

By Anil

ప్రపంచ ద్విచక్ర వాహన తయారీ రంగంలో యమహా కీలక పాత్ర పోషిస్తోంది. బైకులు మాత్రమే కాదు కార్లను కూడా తయారు చేయడానికి యమహా సిద్దమైందని సమాచార వర్గాల కోడై కూస్తున్నాయి. యమహా ఇప్పటికే మోటార్ సైకిల్ ఆధారిత స్పోర్ట్స్ కారును రూపొందించింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

2015 టోక్యో మోటార్ షో వేదిక మీద యమహా ప్రదర్శించిన స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. మెక్‌లారెన్ ఎఫ్ డిఎన్ఎ లక్షణాల సింగారంతో వచ్చి ప్రత్యేకాకర్షణగా నిలిచింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ఈ స్టోరీ అంతా దేనిగురించి అనుకుంటున్నారా ? యమహా సరికొత్త బ్రాండ్‌గా ప్రదర్శించిన కారును స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ పేరుతో దీనిని పరిచయం చేసింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

సాధారణంగా స్పోర్ట్స్ బైకులను రైడ్ చేసే వారికి స్పోర్ట్ కారులో రైడింగ్ అనుభూతిని కల్పించడం కోసం ఈ స్పోర్ట్స్ కార్లను తయారు చేయడానికి యమహా సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

మెరైన్ ఉత్పత్తులు, సంగీత వాయిద్యాలుస మోటార్ సైకిళ్లకు బాగా ప్రసిద్దిగాంచింది యమహా. అయితే ఇప్పుడు ఏకంగా కార్ల సామ్రాజ్యంపై కన్నేసింది యమహా.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ఎప్పుడు ద్విచక్ర వాహనాలును మాత్రమే ఉత్పత్తి చేసే యమహా 1960 ల కాలం నుండి కార్లకు కావాల్సిన ఇంజన్‌ల మీద ప్రత్యేక ప్రయోగాలు చేస్తూ వచ్చింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

యమహా తమ లెంజడరీ 2000జిటి ఉత్పత్తి చేయడానికి మొదటి సారిగా 1965 లో టయోటా సంస్థతో చేతులు కలిపింది. అంతే కాకుండా వోల్వో, ఫోర్డ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరిన్ని ఇతర సంస్థలతో చేతులు కలిపింది యమహా.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

అయితే యమహా తమ స్వంత కారును పూర్తిగా రూపొందించింది. మెక్‌లారెన్ ఎఫ్1 డిజైన్ పితామహుడు అయిన గొర్డాన్ ముర్రే చేత డిజైన్ చేయబడింది ఈ యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ముర్రే పేటెంట్ పొందిన ఐస్ట్రీమ్ కార్బన్ అనే ఐస్ట్రీమ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ద్వారా ముర్రే ఈ రెండు సీట్లు సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ ను అభివృద్ది చేసాడు.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

యమహా స్పోర్ట్స్ కారు పొడవు 3,900ఎమ్ఎమ్, వెడల్పు 1,720ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,170ఎమ్ఎమ్‌గా ఉంది. ఇది మజ్దా ఎమ్ఎక్స్-5 కన్నా తక్కువ పొడవు, తక్కువ ఎత్తులో ఉంటుంది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

బరువు విషయానికి వస్తే ఎమ్ఎక్స్-5 కన్నా 250 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. మరియు ఇది కేవలం 750కిలోలు బరువును మాత్రమే మోయగలదు.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

సాంకేతకంగా దీని గురించి ఈ విధమైన వివరాలు వెల్లడించలేదు యమహా. అయితే దీనిని నడుపుతున్నపుడు మోటార్ సైకిల్‌ను రైడింగ్ చేస్తున్న అనుభూతిని పొందడ ఖాయం అంటోంది యమహా.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

మెక్‌లారెన్ ఎఫ్1 డిజైన్ రూపకర్త ముర్రే అభివృద్ది చేసిన అచ్చం ఇదే సంతతికి చెందిన ప్రోటోటైప్ ఐస్ట్రీమ్ టి25 సిటి కారులో 660సీసీ సామర్థ్యం గల స్మార్ట్ ఇంజన్‌ను అందించాడు.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ఈ కారులోని ఛాసిస్‌తో పాటు మిగతా ఇతర ప్రధాన విడి భాగాలకు కార్బన్ ఫైబర్‌తో డిజైన్ చేశారు. దీని ఎత్తు, బరువు, రూపం వంటి అంశాలకు పోటీపడే మిగతా అన్ని ఉత్పత్తులతో పోల్చుకుంటే దీని ధర చాలా తక్కువగా ఉండనుందని ముర్రే తెలిపాడు.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

సాధారణంగా హై ఎండ్ స్పోర్ట్స్ కార్లలో వినియోగించే కార్బన్ ఫైబర్ ప్యానళ్లను యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు ఇంటీరియర్‌లో వినియోగించింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ప్రత్యేక ఆకర్షణీయమైన రంగుల్లో, కార్బన్ పైబర్,అల్యూమినియం పదార్థంతో ఇంటీరియర్‌ డిజైన్ చేయబడింది.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

ఒక ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్పోర్ట్స్ కారును తయారు చేయగలదు అని నిరూపించింది యమహా సంస్థ.

యమహా స్పోర్ట్స్ రైడ్ కాన్సెప్ట్ కారు

  • ప్రపంచపు మొదటి విమానం కనుగొన్నది రైట్ సోదరులు కాదు, మన భారతీయుడే...!
  • భయంకర వినాశకారి మిస్సైల్‌కు ప్రాణం పోసిన రష్యా
  • ఈ కొత్త కారుతో మార్కెట్‌ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu: Yamaha Has Made A Car With Motorcycle Soul — Sports Ride Concept
Story first published: Saturday, October 29, 2016, 13:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X