బ్రహ్మాండమైన మోడిఫికేషన్‌తో భారతదేశపు మొట్ట మొదటి ఇన్నోవా క్రిస్టా
టయోటా మోటార్స్ తమ ఇన్నోవా వాహనానికి రీ డిజైన్ చేసి ఇన్నోవా క్రిస్టా రూపంలో దేశీయంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా లెవల్, రేంజ్, లుక్ అనే విభిన్న అంశాలు దీనికి తోడయ్యాయి. ఇంకేముందు భారీ అమ్మకాలు దిశగా దూసుకుపోతోంది.
ఇదే డిజైన్‌ను మరికాస్త పెంచితే ఎలా ఉంటుంది ? అవును ఒక మోఢిఫికేషన్ బృందం ఈ సరికొత్త ఇన్నోవా క్రిస్టాను తమ దైన శైలిలో మోడిఫై చేశారు. దీనితో మరింత లుక్‌తో అద్బుతంగా తయారైంది. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

ఇన్నోవా క్రిస్టా మోడిఫైడ్
కిట్ అప్ అనే మోడిఫికేషన్ బృందం దీనికి అక్కడక్కడ మాత్రమే మోడిఫై చేయకుండా పూర్తి స్థాయిలో మోడిఫై చేశారు. తద్వారా ఇన్నోవా క్రిస్టా ఓవరాల్ డిజైన్ పూర్తిగా మారిపోయింది.

ఫ్రంట్ ప్రొఫైల్
మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టాలో ముందువైపున హనికోంబ్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్‌ను అందించారు. బంపర్‌ను కూడా రీడిజైన్ చేశారు. ప్రక్కనే ఉన్న ఇన్నోవా క్రిస్టాతో పోల్చుకుంటే మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టా ఎంతో అందంగా ఉంది.

ఫ్రంట్ ప్రొఫైల్
టయోటా మోటార్స్ ఇన్నోవా క్రిస్టాను ఫ్యాక్టరీ అవతారంలో పైలట్ లైట్లను మరియు పగటి పూట వెలిగే లైట్లను అందించింది. ఇది మరే ఇతర కార్లలో కూడా లేదు. అయితే మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టా లో ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ పగటి పూట వెలిగే లైట్లు తో పాటు ఎల్‌ఇడి లైట్లను కూడా అందించారు.

ఫ్రంట్ ప్రొఫైల్
మోడిఫికేషన్ బృందం ఈ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివికి ప్రీమియమ్ టచ్ ఫినిషింగ్ చేశారు. క్రిస్టా ఎక్ట్సీరియర్‌లో కాంట్రాస్ట్ టచ్ మరియు రూఫ్ మీద పియానో బ్లాక్ కలర్‌ను అందించారు.

సైడ్ ప్రొఫైల్
మోడిఫికేషన్ బృందం ఇన్నోవా క్రిస్టాకు అన్ని వైపులా స్కర్ట్స్‌ను అందించారు. మరియు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కూడా గుర్తించవచ్చు.

రియర్ ప్రొఫైల్
టయోటా ఇన్నోవా క్రిస్టా మరింత స్పోర్టివ్‌గా కనిపించడానికి వెనుక వైపున డ్యూయల్ రియర్ స్పాయిలర్‌ను అందించారు. మరియు రెండు ఎగ్జాస్ట్‌లను గుర్తించవచ్చు, వెనుక భాగంలో జరిగిన మోడిఫికేషన్లలో ఈ రెండు మేజర్‌గా ఉన్నాయి.

రియర్ ప్రొఫైల్
ఇక్కడ ఉన్న ఇమేజ్‌లో అద్దం మీదు కొద్దిగా ముందుకు ఉన్న బాగాన్ని స్పాయిలర్ అంటారు. మరొక స్పాయిలర్‌ను అదే అద్దం క్రింది వైపున చిన్నగా అందించారు.

ఇంటీరియర్
ఇందులోని సీట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి కదూ ? అయితే ఇవి కస్టమైజ్ సీట్లు కాదు, టయోటా ఇన్నోవా క్రిస్టాలో అందించిన ఒరిజినల్ సీట్లు ఇవి.

ఇంటీరియర్
ఇంటీరియర్‌లోని డోర్ మీద ఉన్న ట్రిమ్‌ను పూర్తిగా లెధర్‌తో డిజైన్ చేశారు. తద్వారా ఇది లోపలి నుండి చూడటానికి ఎంతో లగ్జరీగా ఉంటుంది.

ఇంటీరియర్
మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ఇంటీరియర్‌లోని ఫ్రంట్ సైడ్ లెథర్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇది పూర్తిగా సీట్లను పోలిన రంగులో కలదు. డ్యాష్ బోర్డ్‌కు క్రింది వైపున లెథర్ తొడుగులు ఉండటం వలన క్లాసిక్ లుక్‌ను సొంతం చేసుకుంది.

ఇంటీరియర్
మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూస్తే మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టాలో మరింత అద్భుతంగా డిజైన్ చేశారు. రెండవ వరుసలో ఉన్న సీట్లుకు వ్యక్తిగతంగా తెరలను అందించారు. దీని ద్వారా వారికి నచ్చిన ప్రోగ్రామ్‌లను ఎంజాయ్ చేయవచ్చు.

ఇంటీరియర్
మోడిఫైడ్ ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో మ్యూజిక్ సిస్టమ్‌కు అదనంగా సబ్ ఊఫర్‌ను అందించారు

సాంకేతిక వివరాలు
ఇందులో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ సొబగులు మినహాయిస్తే ఏ విధమైన సాంకేతిక మార్పులు చోటు చేసుకోలేదు. టయోటా మోటార్స్ ఇందులో రెండు రకాల టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లను అందించారు.

టయోటా ఇన్నోలా క్రిస్టాలోని 2.4-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ సుమారుగా 148బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 2.8-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ సుమారుగా 172బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సాంకేతిక వివరాలు
ఇందులోని 2.8-లీటర్ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు మరియు 2.4-లీటర్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

మోడిఫికేషన్ బృందం: కిట్ అప్
ఇది తమిళనాడు లోని కోయంబత్తూర్ ఆధారిత ఆటోమొబైల్ బాడీ మోడిఫికేషన్ బృందం. ఇది వినియోగదారుల అవసరాలు మేరకు అత్యంత చౌకగా ఆకర్షణీయమైన మరియు ఏరో డైనమిక్ బాడీ డిజైన్ చేస్తారు. విభిన్న స్టైల్స్‌తో పాటు ఆడియో సంభందిత మోడిఫికేషన్లు కూడా నిర్వహిస్తారు.

ఇలాంటి బైక్ మోడిఫికేషన్లను ఎప్పుడైనా చూశారా ?
భారతీయులు మరచిపోయిన పురాతణ ఇండియన్ బైకులు


Click it and Unblock the Notifications