భద్రత పరంగా ఇండియన్స్‌ను మోసం చేస్తున్న కార్ల సంస్థలు, తేల్చేసిన గ్లోబల్ ఎన్‌సిఎపి

By Anil

గ్లోబల్ ఎన్‌సిఎ‌పి వారి ఆధ్వర్యంలో తాజాగా దిగ్గజ దేశీయ కార్ల తయారీ సంస్థలకు భద్రత (క్రాష్) పరీక్షలు నిర్వహించారు. ప్రమాదం జరిగితే ఎంత వరకు ఈ కార్లు సురక్షితం అనే అంశం మీద నిర్వహించిన పరీక్షల్లో అన్ని కార్లు కూడా సున్నా రేటింగ్‌ను పొందాయి. అది కూడా ఇండియన్ మార్కెట్లో ఉత్తమంగా అమ్ముడుపోతున్న కార్లు ఇలా సున్నా రేటింగ్‌ను పొందాయి. మరిన్ని వివరాలకు క్రింది కథనంలో....

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

గ్లోబల్ ఎన్‌సిఎపి మన ఇండియన్ మార్కెట్లో భారీగా అమ్మకాలు సాధిస్తున్న ఐదు కార్లకు క్రాష్ పరీక్షలు నిర్వహించారు. అందులో మారుతి వారి ఈఎకో, సెలెరియో, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో క్విడ్ కార్లు ఉన్నాయి.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

ఈ ఐదు కార్లకు కూడా డ్రైవర్ మరియు ప్యాసింజర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని క్రాష్ పరీక్షలు నిర్వహించారు. అన్ని కార్లు సున్నా రేటింగ్‌ను పొందాయి. అంటే ఇందులో ప్రయాణిస్తే మన జీవితాలు రిస్క్‌లో పడ్డట్లే.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

గ్లోబల్ ఎన్‌సిఎపి వారు ముఖ్యంగా గుర్తించిన ప్రతికూలాంశాలలో పెద్దలకు సంభందించి కారులో చుట్టు ప్రక్కల ఎలాంటి భద్రత కూడా లేదు. తద్వారా ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదం ప్రయాణికుల వరకు చేరుతున్నాయి.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

రెనో క్విడ్‌కు సంభందించి ఎంట్రీ లెవల్, మీడియమ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్‌లకు భద్రత పరీక్షలు నిర్వహించారు. ఈ మూడు వేరియంట్లు కూడా జీరో స్టార్లను పొందాయి.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

అన్ని కార్లను కూడా గంటకు 64 కిలోమీటర్ల వేగం వద్ద క్రాష్ పరీక్షలు నిర్వహించారు. 100 కిలోమీటర్లకు పైబడి వేగం ఉన్న ఈ కార్లలో కేవలం 64 కిలోమీటర్ల వేగం వద్ద ప్రమాదం జరిగితే అంతే సంగతులు. కాబట్టి ఎక్కువ అమ్ముడుపోతున్న ఈ కార్లు భద్రత పరంగా శూన్యం.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

గ్లోబల్ ఎన్‌‌సిఎపి సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్నర్నర్ మాట్లాడుతూ, ఇండియాలో కార్ల తయారీ సంస్థలు డిజైన్,ఇంటీర్ స్పేస్ మరియు ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. అయితే చాలా వరకు కార్లు ధృడమైన బాడీతో తయారు కావడం లేదు తద్వారా అన్ని కార్లు కూడా క్రాష్ పరీక్షల్లో శూన్నా ర్యాంకును పొందాయి అని తెలిపాడు.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

రెనో వారి సుమారుగా మూడు క్విడ్ కార్లకు క్రాష్ పరీక్షలు నిర్వ హిస్తే మూడు కూడా జీరో రేటింగ్‌ను పొందాయి. అందులో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉన్నటాప్ ఎండ్ వేరియంట్ క్విడ్ కారు కూడా క్రాష్ పరీక్షలు నెగ్గలేకపోయాయి.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

రెనో ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో అందిస్తున్న కార్లు భద్రత పరంగా సరిగ్గానే ఉన్నాయి. కాని ఇండియన్ మార్కెట్లో సరైనా భద్రత ప్రమాణాలతో అందించలేకపోతోందని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

మంచి అమ్మకాలు సాధిస్తున్న నేపథ్యంలో రెనో తమ క్విడ్ కార్లను మంచి ధృడమైన బాడీతో రూపొందించి మళ్లీ క్రాష్ పరీక్షల్లో నెగ్గితే అత్బుతమైన ఫలితాలు సాధిస్తుందని వార్నర్ తెలిపాడు.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

వివిధ రకాల కార్ల తయారీదారుల యొక్క కార్లు సాధించిన భద్రత రేటింగ్ వివరాలు

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

రెనో క్విడ్ కారుకు క్రాష్ పరీక్షలు నిర్వహిస్తున్న వీడియో కథనం క్రింద భాగంలో కలదు.

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

పోనిలే సింగిల్ స్టార్ రేటింగ్ అయినా వచ్చింది: బజాజ్ క్యూట్

భద్రత పరంగా ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తున్న దిగ్గజ దేశీయ కార్లు

ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్‌ గురించి ఆసక్తికర విషయాలు

Article Published On: Wednesday, May 18, 2016, 15:57 [IST]
English summary
Zero Stars For All Indian Cars Crash Tested By Global NCAP
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+