పది కార్లను వరుసగా విడుదలకు సిద్దం చేసిన మారుతి

Written By:

భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నమ్మకానికి మరియు నాణ్యతకు మారుపేరు. దేశీయంగా కార్ల కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో కస్టమర్లకు అభిరుచికి తగ్గట్లుగా అత్యుత్తమ కార్లను ప్రవేశపెట్టడంలో మారుతి సిద్దంగా ఉంది. ప్రత్యేకంగా యువతనుద్దేశించి అభివృద్ది చేస్తున్న ఉత్పత్తులు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అందులో ఈ మధ్యనే విడుదలైన ఇగ్నిస్ ఒకటి.

మార్కెట్లో పట్టును కోల్పోకుండా ఇండియన్స్ కోస పది కొత్త కార్లు సిద్దం చేస్తోంది. దాదా అన్నిసెగ్మెంట్లలో లీడర్‌గా కొనసాగడానికి ఈ పది కార్ల విడుదల తోడ్పాటునందిస్తుందని చెప్పవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
10. మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

10. మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి ప్రీమియమ్ హ్యాచ్‌హబ్యాక్ సెగ్మెంట్లోకి 2015 లో బాలెనో హ్యాచ్‍‌‌బ్యాక్ ను విడుదల చేసింది. విడుదల సమయం నుండి మంచి విక్రయాలు సాధిస్తున్న బాలెనో ను ఇప్పుడు మరింత శక్తివంతమైన మోడల్‌గా స్పోర్టివ్ తరహాలో విడుదలకు సిద్దం చేసింది. గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఈ బాలెనో ఆర్ఎస్ ను కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది.

బాలెనో ఆర్ఎస్ సాంకేతిక వివరాలు

బాలెనో ఆర్ఎస్ సాంకేతిక వివరాలు

మారుతి ఈ బాలెనో ఆర్ఎస్ ను మార్చి 2017 మొదటి వారంలో విడుదల చేయడానికి సిద్దంగా ఉంది. సాంకేతికంగా ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టందా 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బాలెనో ఆర్ఎస్ ఫీచర్లు

బాలెనో ఆర్ఎస్ ఫీచర్లు

సాధారణ బాలెనో తో పోల్చుకుంటే శక్తివంతమైన ఆర్ఎస్ వేరియంట్లో అత్యుత్తమ హ్యాండ్లింగ్ కోసం, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఉత్తమ రైడింగ్ కోసం లోయర్ సస్పెన్షన్ సిస్టమ్, ఈ హ్యాచ్‍‌బ్యాక్ మొత్తాన్ని కేవలం 950కిలోల లోపు బరువు ఉండే విధంగా నిర్మించారు. ట్రాన్స్‌మిషన్ పరంగా అదే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేస్తున్నారు.

09. మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

09. మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

మార్కెట్లోకి విడుదలయినప్పటి నుండి ఎలాంటి అప్‌గ్రేడ్స్‌కు గురికాకుండా నిలకడగానే భారీ అమ్మకాలు సాధిస్తున్న వాటిలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఒకటి. అవుట్‌డేటెడ్ డిజైన్ అనే పేరు లేకుండా ఇప్పటికీ భారీ సంఖ్యలో ఎంచుకుంటున్నారు. అయితే బాలెనో వేదిక మీద ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ పరంగా బారీ మార్పులు చేసి 2017 స్విఫ్ట్‌గా విడుదల చేయనుంది.

2017 స్విఫ్ట్ ఫీచర్లు

2017 స్విఫ్ట్ ఫీచర్లు

మునుపటి తరం స్విఫ్ట్(ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్)తో పోల్చుకుంటే ఇది 120కిలోల తక్కువ బరువుతో రానుంది. ఇంటీరియర్‌లో 7-అంగుళాల పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆడ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే ఫీచర్లతో రానుంది. ఎక్ట్సీరియర్ డిజైన్‌లో ముందు వైపున పదునైన ఆకారం నూతన ఫ్రంట్ గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్స్ గుర్తించగలరు.

2017 స్విఫ్ట్ సాంకేతిక వివరాలు

2017 స్విఫ్ట్ సాంకేతిక వివరాలు

సాంకేతికంగా 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ (ప్రస్తుతం ఉన్న ఇంజన్‌లకు అప్‌గ్రేడ్స్ నిర్వహించి) ‌లతో రానుంది. ఇవి వరుసగా 90బిహెచ్‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 75బిహెచ్‌‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

08. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

08. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి తమ ఈ తరువాత తరం డిజైర్ సెడాన్ ను నూతన స్విఫ్ట్ ఆధారంతో అభివృద్ది చేసింది. అయితే ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం నూతన స్విఫ్ట్ కన్న ముందే ఈ కొత్త తరం డిజైర్ విడుదల ఉండనుంది. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తరహాలో దీనికి ఎక్ట్సీరియర్ డిజైన్ మార్పులు సంతరించుకున్నాయి.

via cartoq

మారుతి సుజుకి

ఇంజన్ పరంగా నూతన స్విఫ్ట్ ఇంజన్‌లతో ఇది రానుంది. ఫీచర్ల పరంగా ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, స్విఫ్ట్ తరహాలో ఇంటీరియర్ ఫీచర్లను జోడించనున్నారు.

7. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

7. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి యొక్క టాల్ బాయ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ భారీ విక్రయాలు సాధిస్తూనే ఉంది. ఈ మధ్యనే సుజుకి జపాన్ విభాగం వ్యాగన్ ఆర్ ను విడుదల చేసింది. దేశీయంగా దీనిని నెక్ట్స్ జనరేషన్ వ్యాగన్ ఆర్ గా విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వ్యాగన్ ఆర్ ఫీచర్లు

వ్యాగన్ ఆర్ ఫీచర్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాగన్ ఆర్ తో పోల్చుకుంటే జపాన్ వేరియంట్ చాలా భిన్నంగా ఉంది. ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, సరికొత్త 2 స్లాట్ల ఫ్రంట్ గ్రిల్, నల్లటి రంగును పులుముకున్న తీరులో టెయిల్ ల్యాంప్స్ మరియు బి-పిల్లర్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కలదు.

వ్యాగన్ ఆర్ సాంకేతిక వివరాలు

వ్యాగన్ ఆర్ సాంకేతిక వివరాలు

సాంకేతికంగా ప్రస్తుతం తమ వద్ద ఉన్న అదే 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో అందివ్వనుంది. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయగలదు.

 06. మారుతి సుజుకి సియాజ్

06. మారుతి సుజుకి సియాజ్

మారుతి తమ మునుపటి వేరియంట్లలో రీలాంచ్ కు ప్రయత్నిస్తోందని అనుకుంటున్నారా...? విడుదల కాలం నాటి డిజైన్‌ను కొనసాగిస్తుంటే భారీ అమ్మకాలను సాగిస్తోంది. మరియు నూతన డిజైన్ శైలిలో తమ వాహనాలను రీలాంచ్ చేసే విక్రయాలు ఏ మేరకు పెరగవచ్చో అంచనా వేసుకోండి. సెడాన్ సెగ్మెంట్లలో సియాజ్ పెద్ద చేప అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి

ఇప్పటికే హైబ్రిడ్ పరిజ్ఞానంతో వెర్నా మరియు సిటి సెడాన్ల కార్ల అమ్మకాలను భారీగా తినేస్తోంది. అయితే వెర్నా మరియు అప్‌డేట్స్‌తో వస్తున్న తరుణంలో సియాజ్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి మారుతి సిద్దమైంది. అంతే కాకుండా ఈ ఫేస్‌లిఫ్ట్ సియాజ్‌ను కేవలం నెక్సా షోరూమ్ నుండి మాత్రమే విక్రయించనుంది.

via AutoSanook

మారుతి సుజుకి

ఫేస్‌లిఫ్ట్ సియాజ్ మారుతి ఎస్-క్రాస్ లోని 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అంతే కాకుండా మునుపటి 1.3-లీటర్ డీజల్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో రానున్నట్లు సమాచారం.

5. మారుతి సుజుకి ఎస్-క్రాస్

5. మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి లైనప్‌లో ఓ మోస్తారు అమ్మకాలకు పరిమితమైన వాటిలో ఎస్-క్రాస్ ఒకటి. ఎస్-క్రాస్ నుండి అమ్మకాలను ఆశిస్తున్న మారుతి ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో అభివృద్ది చేస్తోంది. పరిమాణంలో పెద్దగా, ఎక్ట్సీరియర్ డిజైన్‌లో మార్పులతో పాటు ఇంటీరియర్ లో కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

మారుతి సుజుకి

సాంకేతికంగా 89బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ మరియు 118బిహెచ్‌‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ డీజల్ ఇంజన్ లతో రానుంది.

4. మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

4. మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

మారుతి తమ సాధారణ ఉత్పత్తులను అప్పుడప్పుడు స్పోర్టివ్ వెర్షన్‌లలో లమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేస్తూ వచ్చేంది. అయితే ఇప్పుడు తమ నూతన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా ఐదు డోర్ల అవతారంలో స్విఫ్ట్ స్పోర్ట్ పేరుతో ఒక వేరియంట్‌గా విడుదలకు సిద్దమైంది.

మారుతి సుజుకి

స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్ సాంకేతికంగా 1.4-లీటర్ సామర్థ్యం గల టుర్బో పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. స్పోర్టివ్ రైడ్ కోసం తక్కువ బరువుతో ఎక్కువ పవర్ ఉత్పత్తి చేయడం స్విఫ్ట్ స్పోర్ట్ ప్రత్యేకం.

3. మారుతి సుజుకి జిమ్నీ

3. మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి ప్రస్తుతం ఇండియా లైనప్‌లో ఉన్న జిప్సీ స్థానంలోకి జిమ్నీ వాహనాన్ని ప్రవేశపెట్టనుంది. మారుతి ఈ కాంపాక్ట్ ఎస్‌‌యూవీని బాలెనోలో వినియోగించి ఛాసిస్ ఆధారంతో దేశీయంగా తయారు చేస్తోంది.

మారుతి సుజుకి

డిజైన్ పరంగా జిప్సీని పోలి ఉన్న ఈ రెండు డోర్ల జిమ్నీ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది. తక్కువ వీల్ బేస్ ఉన్న వేరియంట్ శక్తివంతమైన ఆఫ్ రోడర్‌గా మార్కెట్లో నెగ్గుకు రాగలదు. సాంకేతికంగా ఇది 1.2-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

 2. మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్

2. మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని గత ఏడాది విపణిలోకి విడుదల చేసింది. ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల సరసన మొదటి స్థానంలో నిలిచింది. అయితే డీజల్ వేరియంట్లో మాత్రమే లభించేది. డీజల్‌తో పాటు పెట్రోల్ ఇంజన్ కార్లకు గిరాకీ బాగా పెరగడంతో మారుతి వితారా బ్రిజా ను పెట్రోల్ వేరియంట్లో పరిచయం చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి

సాంకేతికంగా పెట్రోల్ వితారా బ్రిజా 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. బాలెనో ఆర్ఎస్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో రానున్న ఈ ఇంజన్ గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

1. మారుతి సుజుకి నూతన ఆల్టో

1. మారుతి సుజుకి నూతన ఆల్టో

మారుతి తమ బెస్ట సెల్లింగ్ ఆల్టో కారును నూతన ఆల్టో తో భర్తీ చేసేందుకు పనిచేస్తున్నట్లు సమాచారం. ధృడమైన ఆల్టో పేరుతో విడుదల చేసేందుకు భారత్ న్యూ వెహికల్స్ సేఫ్టీ అస్సెస్‌మెంట్ (BNVSAP) చేత పరీక్షించిన అనంతరం విడుదల చేయనుంది.

మారుతి సుజుకి

నూతన ఆల్టో సాంకేతిక వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దీని విడుదల 2018 లోనే అని తెలుస్తోంది.

మారుతి సుజుకి

మారుతి సుజుకి లైనప్‌లో ఉన్న అన్ని కార్ల ఫోటోలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి... మరియు కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి....

 

English summary
10 New Maruti Suzuki Up Coming Cars And Suvs
Story first published: Friday, February 10, 2017, 15:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark