టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

Written By:

టాటా మోటార్స్ పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో లారీలు మరియు బస్సులను తయారూ చేస్తోంది. ఎన్నో దశాబ్దాల నుండి దేశ వాణిజ్య మరియు రవాణా రంగంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు రవాణా రంగంలో చిన్న స్థాయి కమర్షియల్ వాహనాల నుండి ప్రపంచ స్థాయి ట్రక్కుల వరకు, సిఎన్‌జి, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మరియు హైబ్రిడ్ బస్సులను ఉత్పత్తి చేస్తోంది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా మోటార్స్ 70 ఏళ్ల సంవత్సరాల కాలం నాటిది. సరిగ్గా 1945లో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ(TELCO)గా ఆవిర్భవించింది. అప్పట్లో టెల్కో పేరుతో ప్రారంభించబడిన టాటా లోకోమోటి‌వ్‌ (రైలు)లను ఉత్పత్తి చేసింది.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా మోటార్స్ తాజాగా టామో అనే ఉప శాఖ ప్రారంభించింది. టామో విభాగం రేస్‌మో అనే స్పోర్ట్స్ కారును కూడా రూపొందించింది. ఇవన్నీ టాటా మోటార్స్ ఈ మధ్య కాలంలో అభివృద్ది చేసిన ఉత్పత్తులు. టాటా కంపెనీ పురుడుపోసుకున్నప్పటి నుండి ఎవ్వరికీ తెలియని పది ముఖ్యమైన విషయాలను టాటా స్వయంగా వెల్లడించింది ఇవాళ్టి కథనంలో అవేంటో చూద్దాం రండి...

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

డైమ్లర్ బెంజ్ భాగస్వామ్యంతో మెర్సిడెస్ లోగో ద్వారా తొలిసారిగా ట్రక్కులను రూపొందించింది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా ఉత్పత్తి చేసిన మూడు ట్రక్కులు 1955లో జెనీవా-బాంబే ర్యాలీలో పాల్గొన్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ట్రక్కులు సుమారుగా 8,000 మైళ్లు ర్యాలీలో భాగంగా ప్రయాణించాయి. జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా(JRD Tata) డ్రైవర్లతో కరచాలనం చేయడాన్ని ఇక్కడ ఫోటోలో చూడగలరు.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా గత 50 సంవత్సరాల కాలం నుండి విదేశాలకు ట్రక్కులను ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు సుమారుగా 45 దేశాలకు టాటా ట్రక్కులు ఎగుమతి అవుతున్నాయి. తొలిసారిగా 1961లో శ్రీలంకకు ట్రక్కులను ఎగుమతి చేయడం జరిగింది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

1969లో మెర్సిడెస్ త్రీ పాయింట్ లోగో ద్వారా టాటా టి - లోగో(T)ను రూపొందించుకుంది. టాటా లోగో ఆవిష్కరణ వేడుకను నిర్వహించినప్పటి ఫోటో...

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

ఇండో-జపాన్ భాగస్వామ్యంతో దేశీయంగా ఉన్న ఐషర్-మిత్సుబిషి, డిఎస్‌ఎమ్ టయోటా, స్వరాజ్ మజ్దా మరియు అల్విన్-నిస్సాన్ వారి లైట్ కమర్షియల్ వాహనాలకు పోటీగా 1986లో టాటా 407 వాణిజ్య వాహనాని భారత్‌కు పరిచయం చేసింది. ఇప్పుడు 407 పేరుతో పాపులర్ ట్రక్కుగా నిలిచింది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా మోటార్స్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ సుమంత్ మూల్గోకర్ పేరు ఆధారంగా, టాటా మోటార్స్ విడుదల చేసిన తొలి మల్టీ యుటిలిటి వెహికల్(MUV)కు సుమో అనే పేరును పెట్టారు.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

టాటా మోటార్స్ కేవలం ప్యాసింజర్ మరియు కమర్షియల్ వాహనాలకు మాత్రమే పరిమితం కాకుండా, కొన్ని దశాబ్దాల నుండి ఇండియన్ ఆర్మీకి విభిన్న రకాల యుద్ద వాహనాలను సరఫరా చేస్తోంది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

భారత్‌లో తయారైన, పూర్తి స్థాయి భారతదేశపు పరిజ్ఞానంతో తయారైన కారు టాటా ఇండికా, టాటా మోటార్స్ విదేశీ భాగస్వామ్యుల సహకారం లేకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించింది.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

వోల్వో, మెర్సిడెస్ మరియు స్కానియా సంస్థలు ప్రపంచ శ్రేణి ట్రక్కులను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి పోటీగా క్యాబిన్ కంఫర్ట్, పర్ఫామెన్స్ మరియు డిజైన్ అంశాల పరంగా రాజీలేకుండా టాటా మోటార్స్ ప్రైమా ట్రక్కులను రూపొందించింది. అంతే కాకుండా ప్రపంచ ట్రక్కుల రేసులో కూడా ప్రైమా ట్రక్కులు రేసింగ్‌కు దిగాయి.

English summary
Read In Telugu: 10 Things You Didn’t Know About Tata Motors

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark