మార్చి లో విడుదలకు సిద్దమైన 2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ మోటార్స్ వచ్చే మార్చి నాటికి విపణిలోకి తమ 2017 ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ నూతన డిజైన్ మరియు ఫీచర్ల జోడింపుతో విడుదల చేయడానికి సిద్దమైంది. దీని గురించి పూర్తి వివరాలు...

By Anil

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చే మార్చి నాటికి తమ ఎక్సెంట్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనుంది, ఇప్పటికే పలుమార్లు రహస్యంగా దేశీయ రోడ్ల మీదకు పరీక్షలకొచ్చిన ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌కు హ్యుందాయ్ ప్రతినిధులు చివరి దశ పరీక్షలు నిర్వహించారు. ఫోటోలు, ఫీచర్లు మరియు సాంకేతిక వివరాలు గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి....

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

టీమ్‌బిహెచ్‌పి అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాల మేరకు హ్యుందాయ్ ఫేస్‌లిఫ్ట్ ఎక్సెంట్‌కు చెన్నై సమీపంలో రహదారి పరీక్షలు నిర్వహించింది. దీనికి తాలూకు ఫోటోలను కూడా పంచుకుంది. అయితే ఫోటోల ద్వారా ఫీచర్లను గుర్తించకుండా జాగ్రత్తపడ్డారు.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

2017 హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ చతుర్బుజాకారంలో ఉన్న టెయిల్ లైట్లను కలిగి ఉంది. బూట్ లిడ్ మీద క్రోమ్ స్పాయిలర్ కలదు. ముందు మరియు వెనుక వైపున కొత్త బంపర్ కలదు. హ్యుందాయ్ ఈ మధ్యనే విడుదల చేసిన సరికొత్త గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ లో ఉన్నటువంటి ఫ్రంట్ గ్రిల్ ఇందులో రానుంది.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

పగటి పూట వెలిగే లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్ జోడింపుతో ఉన్న న్యూ డిజైన్ ఫ్రంట్ బంపర్ కలదు. ఇందులో రీ డిజైన్ అల్లాయ్ వీల్స్, మరియు ప్రక్క వైపు డిజైన్ మీద కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

ఇంటీరియర్‌లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి, ఆపిల్ కార్ ప్లే, అండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ వంటి ఫీచర్లు గల 7.0-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అంతే కాకుండా ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ రానుంది.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

2017 హ్యుందాయ్ ఎక్సెంట్ లో సాంకేతికంగా 1.2-లీటర్ సామర్థ్యం గల యు సిఆర్‌డిఐ మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ రానుంది. ఈ మధ్యనే విడుదలైన 2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ లో కూడా ఇదే ఇంజన్ కలదు. ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

అయితే ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ సామర్థ్యం గల కప్పా డ్యూయల్ విటివిటి పెట్రోల్ ఇంజన్ ను తొలగించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ 113.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2017 హ్యుందాయ్ ఎక్సెంట్

పది కార్లను వరుసగా విడుదలకు సిద్దం చేసిన మారుతి

Most Read Articles

English summary
2017 Hyundai Xcent Spotted Testing Again; India Launch By March
Story first published: Sunday, February 12, 2017, 16:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X