2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ: మూడవ రోజు ఫలితాలు...
మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ మూడవ రోజు ఇరుకైన రోడ్ల మీదుగా, బండరాళ్లతో నిండిన భూభాగాలను ఛేదిస్తూ, ఐమంగళం నుండి భారీ వర్షాల మధ్య బెల్గాంకు చేరింది.
మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీ మూడవ రోజు ఇరుకైన రోడ్ల మీదుగా, బండరాళ్లతో నిండిన భూభాగాలను ఛేదిస్తూ, ఐమంగళం నుండి భారీ వర్షాల మధ్య బెల్గాంకు చేరింది. మూడవ రోజు ర్యాలీలో మారుతి సుజుకి గ్రాండ్ వితారా నడిపిన సురేశ్ రాణా మరియు ఆశ్విన్ నాయక్ 6 గంటల 59 నిమిషాల 02 సెకండ్ల వ్యవధిలో 495కిలోమీటర్ల దూరాన్ని ఛేదించి తొలిస్థానంలో నిలిచారు.

తొలి మరియు రెండవ ర్యాలీలో వరుసగా మొదటి స్థానంలో వచ్చిన డ్రైవర్లు - సామ్రాట్ యాదవ్ మరియు ఎస్ఎన్ నిజామి మూడవ రోజు ర్యాలీలో రెండవ స్థానానికి పడిపోయారు.

సందీప్ శర్మ మరియు కో-డ్రైవర్ కరణ్ ఆర్య మారుతి జిప్సీ ద్వారా 7 గంటల 5 నిమిషాల 46 సెకండ్ల వ్యవధిలో మూడవ రోజు ర్యాలీలోని అల్టిమేట్ కార్స్ కెటగిరీలో మూడవ స్థానానికి పడిపోయారు.

డే 3 ర్యాలీ ముగిసిన తరువాత, సురేశ్ రాణా మాట్లాడుతూ,"భారీగా కురిసిన వర్షాలు ర్యాలీ రూట్ మొత్తాన్ని మరింత కఠినం చేశాయి. అయినప్పటికీ సవాళ్లతో కూడిన మార్గాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నామని తెలిపాడు.

అల్టిమేట్ బైక్స్ కెటగిరీలో రెండవ రోజు తొలి స్థానంలో నిలిచిన ఆర్ నటరాజ్ డే 3లో ర్యాలీ మొత్తం దూరాన్ని 4 గంటల 29 నిమిషాల 30 సెకండ్లలో ఛేదించి యథావిధిగా తొలిస్థానంలో నిలిచాడు. 04:31:26 మరియు 04:35:57 సమయంలో ర్యాలీ పూర్తి చేసి అబ్దుల్ వహీద్ మరియు సంజయ్ కుమార్ రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచారు.

2017 మారుతి సుజుకి దక్షిణ్ డేర్ ర్యాలీలో పోటీదారులు నాలుగవ రోజు పశ్చిమ భూబాగాల మీదుగా మహారాష్ట్రలోని కోల్హాపూర్‌ను చేరుకోనున్నారు.


Click it and Unblock the Notifications








