2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ విజేత సురేశ్ రాణా బృందం
విజయవంతంగా పూర్తయిన డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ. వివిధ కేటగిరీల వారీగా విజేతలు మరియు ర్యాలీ విశేషాలు నేటి కథనంలో....
మారుతి సుజుకి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 15 వ ఎడిషన్ 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ పూర్తయ్యింది. నాలుగు కెటగిరీలతో ఐదు రోజుల పాటు రాజస్థాన్ ఎడారుల గుండా సాగిన ర్యాలీ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయ్యింది.

15 వ ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ చివరికి సుఖాంతం అయ్యింది. ఎక్స్‌ట్రీమ్ మరియు మోటో కెటిగిరీలలో వరుసగా సురేశ్ రాణా మరియు ఆర్ నటరాజ్ విజేతలుగా నిలిచారు.

కఠినమైన ఇసుక ఏడారుల మీదగా సాగిన ర్యాలీ చీకట్లో సుమారుగా 150కిలోమీటర్ల ప్రయాణం అనంతరం తుది దశకు చేరుకుంది. ఈ ర్యాలీలో ముందుగా ఊహించిన రాత్రి పూట ఉష్టోగ్రతల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలోని ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో మారుతి బృందం యొక్క డ్రైవర్ సురేశ్ రాణా మరియు ఇతని దిశానిర్దేశకుడు అశ్విన్ నాయక్ తమ మారుతి సుజుకి గ్రాండ్ వితారా వాహనం ద్వారా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇదే కెటగిరీలో రెండవ స్థానంలో హిమన్షు అరోరా మరియు చిరాగ్ థాకూర్ జోడి నిలవగా, చివరి స్థానంలో సాజిద్ సింఘా నిలిచాడు.

ఇక మోటో కెటగిరీలోని స్టేజ్ - V పెద్ద డ్రామాను తలపించిందని చెప్పవచ్చు. తుది ర్యాలీలో సిఎస్ సంతోష్ చెక్ పాయింట్ వద్ద తప్పిపోయి 35 నిమిషాలు ర్యాలీకి దూరమయ్యాడు. ఇందుకు గాను ర్యాలీ నిర్వాహకలు జరిమానా విధించారు. అయితే సిఎస్ సంతోష్ యొక్క్ హీరో మోటోస్పోర్ట్స్ బృందం ఇందుకు ససేమిరా అంటూ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. మారుతి మాత్రం మోటో కెటగిరీలో టీవీఎస్ రేసింగ్ రైడర్ ఆర్ నటరాజ్ ను విజేతగా ఎంపిక చేసింది.

టీవీఎస్ ఫ్యాక్టరీ బృందంలోని సభ్యుడు అబ్దుల్ తన్వీర్ వహీద్ మొదటి మరియు రెండవ స్టేజ్ లను పూర్తి చేయగా, నటరాజ్ చివరి స్టేజ్ ర్యాలీని పూర్తి చేశాడు. అయితే వరుసగా మూడు స్టేజీల్లో కూడా మొదటి స్థానంలో నిలిచిన సిఎస్ సంతోష్ ఫైనల్స్‌లో చివరి స్థానానికి పడిపోయాడు.

ఎన్‌డ్యూరెన్స్ కెటగిరీలో నికుంజ్ తోష్నివాలా మరియు ఇతని సహ డ్రైవర్ సువర్‌జిత్ దత్త మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మరియు తమ వితారా బ్రిజా వాహనంతో ఎక్స్‌ప్లోర్ కార్స్ కెటగిరీలో కార్తీక్ మారుతి మరియు ఇతని దిశా నిర్దేశకుడు ఎస్. శంకర్ ఆనంద్ మొదటి స్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకున్నారు.

మారుకి సుజుకి నిర్వహించిన 15 వ ఎడిషన్ 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో మొబిల్1 అధికారిక ఫ్యూయల్ మరియు లుబ్రికేంట్ భాగస్వామిగా వ్యవహరించింది.


Click it and Unblock the Notifications








