2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 1 విజేతలు వీరే
మారుతి సుజుకి ప్రారంభించిన డెసర్ట్ స్టార్మ్ అడ్వెంచర్ రైడ్‌లో మొదటి స్టేజ్ విజయవంతంగా పూర్తయింది. సుమారుగా 250 కిమీల మేర సాగిన స్టేజ్ 1 ఫలితాలు మరియు డెసర్ట్ స్టార్మ్ విశేషాలు....
మారుతి సుజుకి ప్రారంభించిన 15 వ ఎడిషన్ 2017 డెసర్ట్ స్టార్మ్ యొక్క స్టేజ్ 1 నిన్నటి రోజు (జనవరి 30, 2017) న బికనీర్‌లో ముగిసింది. ఉదయాన్నే హనుమాన్‌ఘర్ నుండి ఇసుక తిన్నెల మీదుగా సాగిన యాత్ర హర్దస్వాలి మరియు అర్జన్సర్ మీదుగా బికనీర్ లో ముగిసింది.

ఎక్ట్స్రీమ్ కేటగిరీలో, సురేష్ రాణా నాయకత్వం వహిస్తున్న మారుతి బృందం మొదటి స్టేజి ఫలితాల్లో ముందంజలో ఉంది. ఇతనికి దిశానిర్ధేశకుడిగా అశ్విన్ నాయక్ వ్యహరించాడు. గౌరవ్ క్రిపాల్ (దిశానిర్ధేశకుడు శ్రీకాంత్ గౌడ) మరియు సంజయ్ అగర్వాల్ (దిశానిర్దేశకుడు శివప్రకాశ్) లు వరుసగా రెండవ మరియు మూడవ స్థానంలో నిలిచారు.

మోటో క్యాటగెరీలో, హీరో మోటోస్పోర్ట్స్ బృందం యొక్క ర్యాలీ రైడర్, డకార్ ర్యాలీని రెండు సార్లు విజయవంతంగా పూర్తి చేసిన సిఎస్ సంతోష్ నిర్దేశించిన సమయంలోపు మొదటి స్టేజ్ ర్యాలీని పూర్తి చేశాడు.

టీవీఎస్ రేసింగ్ రైడర్లు తన్వీర్ అబ్దుల్ మరియు ఆర్ నటరాజ్ ఈ ర్యాలీ ముగిసే సమయానికి వరుసగా రెండవ మరియు మూడవ స్థానంలో నిలిచారు.

రెండవ రోజు ర్యాలీ సుమారుగా 500 కిలోమీటర్లు దూరం పాటు సవాళుతో కూడుకున్న భూ భాగం మీదుగా ర్యాలీ ముంగింపు రేఖవైపున ఉన్న జైసల్మీర్ దిశగా రెండవ స్టేజ్ ర్యాలీ కొనసాగనుంది.

2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ మొదటి స్టేజ్ (Leg 1) ఫలితాలు
ఎక్ట్స్రీమ్ కేటగిరీ
1. సురేష్ రాణా/ అశ్విన్ నాయక్
2. గౌరవ్ క్రిపాల్/ శ్రీకాంత్ గౌడ
3. సంజయ్ అగర్వాల్/ శివప్రకాష్

మోటో కెటగిరీ
1. సిఎస్ సంతోష్
2. తన్వీర్ అబ్దుల్ వహీద్
3. ఆర్ నటరాజ్

మారుతి సుజుకి నిర్వహిస్తున్న 15 వ ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలో లుబ్రికేషన్ భాగస్వామిగా ఎక్జాన్‌మొబైల్ లుబ్రికేంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. 2017 మారుతి సుజుకి మోటోస్పోర్ట్స్ కు గాను లుబ్రికేంట్స్ మరియు ఫ్యూయల్ పార్టనర్‌గా ExxonMobil Lubricants Pvt Ltd వ్యవహరిస్తోంది.

ఆరు రోజుల పాటు, 2,000 కిమీల మేర సాగే మారుతి డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ ప్రారంభం


Click it and Unblock the Notifications