మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2 లో ఆధిక్యంలో కొనసాగుతున్న సంజయ్ అగర్వాల్ మరియు సిఎస్ సంతోష్

Written By:

మారుతి సుజుకి నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ ఇప్పుడు రెండవ స్టేజ్ పూర్తి చేసుకుని కఠినమైన ఇసుక తిన్నెలను వేడి గాలుల మధ్య మూడవ స్టేజ్ వైపు సాగుతోంది. అత్యంత కఠినతరమైన ఈ ర్యాలీలో పోటీదారుల మధ్య వేడిని రాజేస్తోంది. స్టేజ్ 2 ర్యాలీ ముగిసే నాటికి సంజయ్ అగర్వాల్ మరియు సిఎస్ సంతోష్ ఆధిక్యంలో ఉన్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

బికనీర్ నుండి నూర్‌సర్, కెలన్, రాజ్‌సార్, మోతీఘర్ మీదుగా నోఖ్రా ను దాటుకుని చివరికి గోల్టెన్ సిటి ఆఫ్ జైసల్మీర్‌కు చేరుకుంది. ఈ స్టేజ్ 2 ర్యాలీ మొత్తం 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలోని ఎక్ట్స్రీమ్ కెటగిరీలో సంజయ్ అగర్వాల్ మరియు ఇతని దిశానిర్దేశకుడు శివప్రకాష్ మొదటి స్థానంలో నిలిచారు. వీరి తరువాత మారుతి సుజుకి బృందం నుండి వరుసగా హర్‌ప్రీత్ బవా ఇతని న్యావిగేటర్ వీరేంద్ర కశ్యప్ లు రెండవ స్థానంలో నిలిచారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

పోటీలో మారుతి సుజుకి బృందంలోని మరో జోడీ సురేష్ రాణా మరియు ఇతని న్యావిగేటర్ అశ్విన్ నాయక్ లు స్టేజ్ 2 ర్యాలీ ముగిసే సమయానికి వరుసగా మూడవ స్థానంలో నిలిచారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

ఇక మారుతి నిర్వహిస్తున్న 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీలోని మోటో కెటగిరీలో హీరో మోటోస్పోర్ట్స్ బృందం యొక్క ర్యాలీ రైడర్ సిఎస్ సంతోష్ మొదటి స్థానంలో, ఆర్ నటరాజ్ మరియు సంజయ్ కుమార్ వరుసగా మూడవ స్థానంలో నిలిచారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

విజేతలుగా ఫైనల్లో గెలుపొందడానికి అన్ని స్టేజీల్లో కూడా ఆధిక్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మారుతి కొనసాగించే 2017 డెసర్ట్ స్టార్మ్ మూడవ రోజుకు చెందిన మూడవ స్టేజ్ ర్యాలీ మొత్తం 350 కిలోమీటర్లు పాటు సాగనుంది.

స్టేజ్ 2 అనంతరం 2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ఫలితాసలు

స్టేజ్ 2 అనంతరం 2017 మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ ఫలితాసలు

ఎక్ట్స్రీమ్ కెటగిరీ

1. సంజయ్ అగర్వాల్/శివప్రకాశ్

2. హర్‌ప్రీత్ బవా/ విరేంద్ర కశ్యప్

3. సురేశ్ రాణా/అశ్విన్ నాయక్

మోటో కెటగిరీ

మోటో కెటగిరీ

1. సిఎస్ సంతోష్

2. ఆర్ నటరాజ్

3. సంజయ్ కుమార్

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని మొబిల్ కంపెనీ యొక్క భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఈ ర్యాలీకి మొబిల్1 అధికారిక ఫ్యూయల్ మరియు లుబ్రికేషన్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ స్టేజ్ 2

మారుతి సుజుకి 2017 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీని డ్రైవ్‌స్పార్క్ బృందం స్వయంగా కవర్ చేస్తోంది. వీటికి సంభందించిన మరిన్ని ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు.

 
English summary
2017 Maruti Suzuki Desert Storm: Sanjay Agarwal And CS Santosh Lead After Leg 2
Story first published: Thursday, February 2, 2017, 15:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos