మారుతి సుజుకి డిజైర్ కొనే ఆలోచనలో ఉంటే ప్రస్తుతానికి విరమించుకోండి!!

Posted By:

మారుతి సుజుకి డిజైర్ కారును కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే కొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే మారుతి న్యూ జనరేషన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును తమ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించింది. త్వరలోనే మార్కెట్లోకి కూడా విడుదల చేయనుంది. కాబట్టి డిజైర్ కొనే ఆలోచనను కాస్త ప్రక్కన పెట్టి ఇందులో సంభవించే నూతన మార్పులను గమనిద్దాం రండి...

2017 మారుతి సుజుకి డిజైర్

స్విఫ్ట్ బ్యాడ్జ్ పేరుకు బలమైన పోటీనిస్తూ, తమ వాహన శ్రేణిలోనే కాంపిటీషన్ పెంచుతూ డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను న్యూ జనరేషన్ 2017 డిజైర్‌గా మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి సుజుకి సిద్దమవుతోంది.

2017 మారుతి సుజుకి డిజైర్

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజైర్ వేరియంట్ల కన్నా ఈ న్యూ జనరేషన్ డిజైర్ వేరియంట్ల ధరలు రూ. 60,000 నుండి 70,000 వరకు ఎక్కువ ధరతో రానున్నాయి.

2017 మారుతి సుజుకి డిజైర్

మూడవ తరానికి చెందిన 2017 డిజైర్‌లో ఫ్రంట్ డిజైన్ మార్పులకు ప్రధాన్యత ఇవ్వడం ఇక గమనించవచ్చు. ఆగ్రిసివ్ మరియు వాలుగా ఉండే ఫ్రంట్ డిజైన్‌తో థర్డ్ జనరేషన్ డిజైర్‌ను రూపొందించడం జరిగింది.

2017 మారుతి సుజుకి డిజైర్

ఎక్కువ మొత్తంలో ఇంజన్‌కు గాలిని గ్రహించేందుకు పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ టేకర్ అందించారు మరియు నూతన ఫ్రంట్ బంపర్‌కు ఇరువైపులా స్పోర్టివ్ ఫాగ్ ల్యాంపులు రానున్నాయి.

2017 మారుతి సుజుకి డిజైర్

నూతన డిజైర్ లోని టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో సరికొత్త హెక్సా గోనల్ క్రోమ్ పూత గల ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది. మరియు ఇతర అన్ని డిజైన్ ఎలిమెంట్ల జోడింపు ద్వారా కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో పోటీని రాజేయనుంది.

2017 మారుతి సుజుకి డిజైర్

వెనుక వైపున ఉన్న డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగకపోయినా... ప్రక్కవైపుల బాలెనో తరహాలో కొద్దిగా వాలును మరియు వెనుక వైపుకు వంగినటువంటి రూఫ్ డిజైన్ కల్పించడం జరిగింది.

2017 మారుతి సుజుకి డిజైర్

సాంకేతికంగా మారుతి సుజుకి 2017 డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో 1.2-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ జరిగింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 మారుతి సుజుకి డిజైర్

మరియు మారుతి ఇందులో 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ అందించింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంలో లభించే ఇది గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

2017 మారుతి సుజుకి డిజైర్

బాలెనో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నూతన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ది చేయడం జరిగింది. తద్వారా దీని బరువు గణనీయంగా తగ్గనుంది. మరియు అత్యుత్తమ నిర్వహణ మరిన్ని భద్రత ఫీచర్లతో త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

 

English summary
Also Read In Telugu: 2017 Maruti Suzuki Dzire Production Begins – Spied Undisguised

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark