2018 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు మరియు ఫోటోలు
2018 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. ల్యాండ్ రోవర్ విపణిలోకి ప్రవేశపెట్టిన నూతన డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 42.48 లక్షలు.
2018 ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ లగ్జరీ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. ల్యాండ్ రోవర్ విపణిలోకి ప్రవేశపెట్టిన నూతన డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీ ప్రారంభ వేరియంట్ ధర రూ. 42.48 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

నూతన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కేవలం సింగల్ డీజల్ ఇంజన్ వెర్షన్‌లో అన్ని చక్రాలకు పవర్ సరఫరా చేసే 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమవుతోంది.

| వేరియంట్లు | ధరలు |
| Pure | ₹ 42.48 lakhs |
| SE | ₹ 48.67 lakhs |
| HSE | ₹ 52.31 lakhs |
| HSE Luxury | ₹ 57.46 lakhs |

ల్యాండ్ రోవర్ స్పోర్ట్ లోని ప్యూర్, ఎస్ఇ మరియు హెచ్ఎస్ఇ మోడళ్లలో సాంకేతికంగా ఉన్న 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 147బిహెచ్‌పి పవర్ మరియు 382ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, 2018 డిస్కవరీ స్పోర్ట్ హెచ్ఎస్ఇ లగ్జరీ వేరియంట్లోని టుర్భోఛార్జ్‌డ్ ఇంజన్ 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ల్యాండ్ రోవర్ తమ నూతన డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీలో ఎన్నో లగ్జరీ ఫీచర్లను జోడించింది. ఎస్‌యీవీ యొక్క మొత్తం సమాచారాన్ని రాబట్టగల ఇన్‌కంట్రోల్- ప్రొ సర్వీసెస్ ఉన్నాయి. వీటిలో రూట్ ప్లానర్. న్యావిగేషన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో ముందుగా వెళ్లాల్సిన ప్రదేశానికి సంభందించిన రూట్ ప్లాన్‌ను సిద్దం చేసుకుంటుంది.

అంతే కాకుండా "కమ్యూట్ మోడ్" అనే ఆప్షన్ ఇందులో ఉంది. తరచూ వెళ్లే మార్గాలను వెంటనే గుర్తిస్తుంది, ఒకవేళ ఆ మార్గంలో ఏదైనా ఆలస్యం అని తెలిస్తే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి డిస్ల్పేలో చూపిస్తుంది. అదే విధంగా ఆ కొత్త మార్గం ద్వారా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పట్టే సమయంలో అంచనాగా లెక్కించి మెసేజ్ పంపిస్తుంది.

ల్యాండ్ రోవర్ ప్రవేశపెట్టిన 2018 డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీలో ఓనర్‌కు ఇచ్చిన సిమ్ కార్డ్ ద్వారా పనిచేసే వై-ఫై హాట్‌స్పాట్, డిస్కవరీ స్పోర్ట్‌లో ఉన్న హాట్ స్పాట్ ద్వారా ఒకేసారి ఎనిమిది మంది వరకు కనెక్ట్ చేసుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం ల్యాండ్ రోవర్ 2018 డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీలో ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెట్రోల్ వెర్షన్ రాకపోవడం. అయితే, ఎక్కువ మంది డీజల్ వెర్షన్‌కే మొగ్గుచూపుతున్నారు. కాబట్టి పెట్రోల్ వెర్షన్ లేకపోవడం పెద్ద నష్టమేమీ కాదు.


Click it and Unblock the Notifications








