సరికొత్త మారుతి స్విఫ్ట్‌లో వస్తున్న ఐదు అతి పెద్ద మార్పులు

మారుతి తమ స్విఫ్ట్‌ను నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా విడుదల చేయడానికి సిద్దమైంది. అయితే, స్విఫ్ట్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఐదు అతి ముఖ్యమైన మార్పులు జరిగాయి.

By Anil

మారుతి సుజుకిలో మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరుగాంచిన స్విప్ట్ కారును అతి త్వరలో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.

మారుతి ఈ ఏడాదిలో తమ పాత స్విఫ్ డిజైర్ స్థానంలోకి సరికొత్త డిజైర్ కారును విడుదల చేసింది. దీని విడుదలతో మారుతికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీని మీద వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. అదే ధరలో భారీ మార్పులకు గురైన డిజైర్ లభిస్తుండటంతో డిజైర్ సేల్స్ అమాంతం ఊపందుకున్నాయి.

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

ఇదే తరహా విజయాన్ని ఆశిస్తున్న మారుతి తమ స్విఫ్ట్‌ను నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌గా విడుదల చేయడానికి సిద్దమైంది. అయితే, ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో తెలుసా...? స్విఫ్ట్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఐదు అతి ముఖ్యమైన మార్పులు జరిగాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

క్యాబిన్ స్పేస్

ఇండియన్స్ ప్రథమంగా గమనించే అంశం క్యాబిన్ స్పేస్. క్యాబిన్‌లో విశాలమైన స్పేస్ ఉంటే కాస్త అడ్జెస్ట్ చేసుకోనైనా మరో ఇద్దురు ప్రయాణించవచ్చని భావిస్తారు. ఏదేమైనప్పటికీ ఇండియన్ రోడ్డ మీద ప్రయాణించే వాహనాలకు విశాలమైన అత్యుత్తమ క్యాబిన్ స్పేస్ తప్పనిసరి.

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

క్యాబిన్ స్పేస్ స్వల్పంగా పెంచేందుకు కారు మొత్తాన్ని చూడటానికి స్పోర్టివ్ శైలిలోనే ఉంచుతూ, కొలతలను పెంచుతూ కారు మొత్తాన్ని పునర్నిర్మించడం జరిగింది. దీంతో చూడటానికి సరికొత్త డిజైన్‌లో ఆకర్షణీయంగా మార్చారు. పొడవుని 10ఎమ్ఎమ్ వరకు తగ్గించగా, వీల్ బేస్ 20ఎమ్ఎమ్ వరకు పెంచారు. మునుపు ఉన్న2430ఎమ్ఎమ్ వీల్ బేస్ 2450ఎమ్ఎమ్‌కు పెంచడం జరిగింది.

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

ఎంతో స్టోరేజ్ స్పేస్...

సరికొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారులో క్యాబిన్ స్పేస్‌తో పాటు బూట్ (లగేజ్)స్పేస్ కూడా అధికంగానే ఉంది. మునుపటి బూట్ స్పేస్‌తో పోల్చుకుంటే 60 లీటర్ల అధికంగా మొత్తం 265-లీటర్ల బూట్ స్పేస్ కలదు. స్పేసియస్ ఇంటీరియర్ అందివ్వడంతో అధిక లగేజ్ స్పేస్ సాధ్యమయ్యింది.

Recommended Video

2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

స్పోర్టివ్ శైలి

సరికొత్త స్విఫ్ట్ బరువు మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే దీని బరువు చాలా తక్కువ. సుమారుగా 120కిలోలు తగ్గిపోయింది. బరువు తగ్గడంతో ఎంతో ఫన్ డ్రైవ్ సాధ్యమవుతుంది. బరువు తగ్గడంతో తేలికపాటి యాక్సిలరేషన్ మరియు మంచి మైలేజ్ సాధ్యమవుతుంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌తో పోల్చుకుంటే అత్యంత వేగవంతమైనది కూడా...

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్

భారత్‌లో ఆటోమేటిక్ కార్లను ఎంచుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగేకొద్దీ మారుతి తమ తరువాత తరం స్విప్ట్‌ను ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు మారుతి తమ స్విఫ్ట్‌లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ అందించిందిలేదు. పెట్రోల్ వేరియట్ స్విఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

మారుతి స్విఫ్ట్‌లో మార్పులు

నూతన ఫీచర్లు

సరికొత్త స్విఫ్ట్ ఎన్నో కొత్త ఫీచర్లతో విజిల్స్ వేస్తూ వస్తోంది. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయగల నూతన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది. అంతే కాకుండా, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, స్టాండర్డ్ ఎయిర్ బ్యాగులు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే, పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లతో రానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: five big improvements in upcoming maruti swift
Story first published: Friday, September 29, 2017, 22:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X